|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్రహ్మముడి జూన్ 26 ఎపిసోడ్: రౌడీ తల బద్దలు కొట్టిన కావ్య- స్వప్న కావ్యలను కాపాడిన రేవతి- అపర్ణతో గతం- నిజం వినేసిన రాజ్

Published: 25-06-2025, 10:40 PM
బ్రహ్మముడి జూన్ 26 ఎపిసోడ్: రౌడీ తల బద్దలు కొట్టిన కావ్య- స్వప్న కావ్యలను కాపాడిన రేవతి- అపర్ణతో గతం- నిజం వినేసిన రాజ్

బ్రహ్మముడి సీరియల్‌లో ఈరోజు ఎపిసోడ్‌లో, స్వప్నను రౌడీలు కిడ్నాప్ చేయడంతో కావ్య ధైర్యంగా వారిని ఎదుర్కొని స్వప్నను కాపాడుతుంది. రేవతి అనే మహిళ కూడా వారికి సహాయపడుతుంది. రాజ్ కూడా కథలో కీలక పాత్ర పోషిస్తాడు.

రౌడీల దాడి నుండి కావ్య-స్వప్న రక్షణ

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో స్వప్న కారుకు ఉన్న జీపీఎస్ ట్రాకర్‌ మూలంగా కావ్య ఫాలో అవుతుంది. ఇంతలో రాజ్ కాల్ చేసి నన్ను ఇన్సల్ట్ చేశారు. ఇంటికి వచ్చిన అతిథిని ఎలా చూసుకోవాలి. అలా వెళ్లిపోయారు. ఇంకా రాలేదు అని రాజ్ అంటాడు. నేను ఇప్పుడే రాలేను అని కావ్య అంటే ఏంటీ అంత కంగారుపడుతున్నారు. నా హెల్ప్ కావాల అని రాజ్ అంటాడు.

అదేం వద్దని ఇంటికి వచ్చాక మాట్లాడుతానని కావ్య కాల్ కట్ చేస్తుంది. రాజ్ కాల్ మాట్లాడటం విన్న ఇందిరాదేవి, అపర్ణ వచ్చి ఏం చెప్పిందని అడిగితే.. ఏదో సమస్యలో ఉన్నట్లుంది. తర్వాత చేస్తా అని కాల్ కట్ చేసినట్లు చెబుతాడు రాజ్. దానికి ప్రాబ్లమ్స్ లేనిది ఎప్పుడు అని ఇందిరాదేవి అంటుంది. మరోవైపు స్వప్న కారు దొరుకుతుంది. కానీ, అందులో స్వప్న ఉండదు. ఆ రౌడీలు ఏమైనా చేశారా అని కావ్య టెన్షన్ పడుతుంది.

కట్ చేస్తే స్వప్న వెంట రౌడీలు వెంట పడుతుంటారు. ఇంతలో కావ్యకు కాల్ చేసి మీ అక్కతో ఐదు నిమిషాల్లో హాయ్ చెప్పిస్తానన్నావ్. ఏమైంది. నువ్ పెట్టుకుంది యామినితో. ఇది యామిని వేట. నువ్ జీపీఎస్ ట్రాకర్‌తో కనిపెట్టాలనుకుంది నాకు తెలియదనుకున్నావా. నీ ప్లాన్ తెలిసి నా ప్లాన్ మార్చా. ఇప్పుడెల కాపాడుకుంటావ్ అని యామిని అంటుంది.

రేవతి ప్రవేశం మరియు గతానికి సంబంధం

కాపాడుకుంటా అని కావ్య అంటుంది. నా మనుషులు అసలే రౌడీ వెధవలు. చంపేసిన చంపెస్తారు అని యామిని కాల్ కట్ చేస్తుంది. ఏదొక దారి చూపించు అని కావ్య దేవుడును ప్రార్థిస్తుంది. మరోవైపు స్వప్న వెళ్లి వినాయకుడి విగ్రహం వెనుక దాక్కుంటుంది. కానీ, స్వప్నను ఓ రౌడీ చూసి కత్తి పట్టుకుని తనవైపు వెళ్తాడు. తనను ఏం చేయొద్దని స్వప్న ప్రాధేయపడుతుంది.

అయినా వినని రౌడీ కత్తితో పొడవబోతుంటే కర్రతో రౌడీ తల బద్దలు కొడుతుంది కావ్య. మిగతా రౌడీలను పిలవడంతో అక్కడి నుంచి కావ్య, స్వప్న పారిపోతారు. వారి వెంట రౌడీలు పడతారు. ఒకచోట ఇంట్లోకి వాళ్లను ఒకరు లాగుతారు. రౌడీలు వెళ్లిపోతారు. కంగారుపడొద్దు మీకేం కాదు కావ్య అని ఇద్దరు పేర్లు చెబుతుంది ఆవిడ. అసలు మీరెవరు అని షాక్ అవుతారు కావ్య, స్వప్న .

నా పేరు రేవతి. మీ కుటుంబం గురించి తెలియనివారు ఉంటారా అన తాతయ్య గొప్పదనం గురించి చెబుతుంది. తర్వాత రౌడీలు బయటే ఉన్నారు. వాళ్లు వెళ్లే వరకు ఇక్కడే ఉండండి అని రేవతి చెబుతుంది. అపర్ణ గారు ఎలా ఉన్నారు. ఆవిడ ప్రేమను, ద్వేషాన్ని రెండు తట్టుకోలేం అని రేవతి అంటుంది. మీరు మా గురించి బాగా తెలిసినట్లు మాట్లాడుతున్నారు. కానీ, బయటవాళ్లలా లేరని కావ్య అంటుంది.

రాజ్‌కు నిజం బయటపడటం

ఇంట్లోదాన్ని అయితే ఇలా బస్తీలో ఎందుకు ఉంటాను అని రేవతి చెబుతుంది. అయితే, అపర్ణ -రేవతికి ఏదో ఫ్లాష్‌బ్యాక్ (గతం) ఉన్నట్లు తెలుస్తోంది. కావ్య, స్వప్నకు టీ పెట్టి ఇస్తుంది రేవతి. ఇంతలో ఎవరో తలుపు కొట్టేసరికి భయపడతారు. ఇక్కడి నుంచి ఎలా బయటపడాలో మాకు తెలుసు అని కావ్య అంటుంది. మరోవైపు కావ్య కోసం రాజ్‌తోపాటు అంతా ఎదురుచూచ్తారు.

ఇంటికి అప్పు వస్తుంది. అప్పుకు కావ్య కాల్ చేసి జరిగింది అంతా చెబుతుంది. త్వరగా రమ్మని లొకేషన్ షేర్ చేస్తుంది. కిడ్నాప్ కేసు వచ్చిందని అప్పు వెళ్తానంటుంటే ధాన్యలక్ష్మీ తిడుతుంది. దాంతో అప్పుకు ఇందిరాదేవి సపోర్ట్ చేస్తుంది. ప్రకాశం నాలుగో సింహం డైలాగ్ కొడతాడు. దాంతో అప్పు వెళ్లిపోతుంది. తర్వాత యామినిని కొట్టి కిడ్నాప్ గురించి అప్పు మాట్లాడితే ఆ నిజాన్ని రాజ్ వెంటాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

చివరికి, కావ్య మరియు స్వప్న రేవతి సహాయంతో రౌడీల నుండి తప్పించుకుంటారు. అపర్ణ గతం మరియు రాజ్ నిజం తెలుసుకోవడంతో కథ మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.