
📌 Key Points
- చంద్రకళకు బిడ్డ పుడితే ఇంట్లో ప్రాణనష్టం అని సిద్ధాంతి హెచ్చరిక!
- శాలిని మాటలు అన్నీ అబద్ధం అని నిరూపించిన క్రాంతి!
- పార్టనర్‌షిప్ నుండి శాలినిని తీసేస్తున్నట్లు క్రాంతి ప్రకటన!
- విరాట్‌కు యాక్సిడెంట్ అవుతుందని చంద్రకళ పీడకల!
నిన్ను కోరి సీరియల్‌లో సంచలన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చంద్రకళ జీవితం ప్రమాదంలో పడనుందా? శాలిని నిజస్వరూపం బయటపడటంతో క్రాంతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. ఇది ఒక ఆసక్తికరమైన మలుపు.
చంద్రకళకు ప్రాణగండం: సిద్ధాంతి హెచ్చరిక!
Ninnu Kori Serial March 24th Episode: నిన్ను కోరి సీరియల్ మార్చి 24 ఎపిసోడ్‌లో రఘురాం రాసుకున్న పేపర్ చూసి ఎవరి గురించి భయపడుతున్నారని శాలిని ఆలోచిస్తుంది. తనకు వచ్చిన కల గురించి చంద్రకళ చెబితే ఇంటికి సిద్ధాంతిని పిలిపిస్తారు. చంద్రకు బిడ్డ పుడితే ఇంట్లో ప్రాణనష్టం జరుగుతుందని సిద్ధాంతి చెబుతాడు.
Ninnu Kori Serial Today Episode: నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రఘురాం ఏదో ఆలోచిస్తుంటే శాలిని చూస్తుంది. బుక్‌లో రాసుకుంది రఘురాం చదువుతాడు. అది శాలిని వింటుంది. నేనేంటీ ఇలా రాసుకున్నా. జగదీశ్వరి కి ఈ విషయం తెలియద్దు అని పేపర్ చింపి పాకెట్‌లో పెట్టుకుంటుండగా గాలికి ఎగిరిపోతుంది.
దాంతో మర్చిపోతాడు రఘురాం. ఏ పేపర్ కోసం వెతుకున్నారని క్రాంతి అడిగితే.. ఏ పేపర్ అని రివర్స్‌లో అడుగుతాడు రఘురాం. న్యూస్ పేపర్ అని శాలిని చెబుతుంది. న్యూస్ పేపర్ ఇవ్వడంతో రఘురాం వెళ్లిపోతాడు. కిందపడిన పేపర్ తీసుకుని చూసిన శాలిని ఎవరికి ప్రాణపాయం ఉంది. నేను వేసిన ప్లాన్ తెలిసిపోయిందా అని కంగారుపడుతుంది శాలిని.
శాలిని అసలు రూపం: క్రాంతి షాకింగ్ నిర్ణయం!
మరోవైపు చంద్రకళ పరుగెత్తుకుంటూ వచ్చి విరాట్‌కు యాక్సిడెంట్ అయినట్లు పీడకల వచ్చిందని భయంతో చెబుతుంది. దాంతో అది కల, కంగారుపడకని జగదీశ్వరి వాళ్లు చెబుతారు. తెల్లవారు వచ్చే కల నిజమవుతుందంటారు. ఇప్పటివరకు ఆయన కాల్ లిఫ్ట్ చేయట్లేదు అని చంద్రకళ అంటుంది. తిరిగి తిరిగి అలసిపోయి పడుకుని ఉంటాడు. ఇంత పొద్దున లిఫ్ట్ చేస్తారా అని కామాక్షి అంటుంది.
నీకు నీ భర్త బాగా సపోర్ట్ అనుకుంటా అని ఫ్రెండ్స్ అంటే.. లేదు మాదాంట్లో రివర్స్. నేను చెప్పడంతోనే క్రాంతి బిజినెస్ చేస్తున్నాడు. నేను ఎంకరేజ్ చేయడం వల్లే అతను బిజినెస్ ట్రిక్స్ చెప్పానని, నా పర్మిషన్ లేకుండా ఏం చేయడు, నా సైన్ లేకుండా కంపెనీలో ఒక్క ఫైల్ కూడా ముందుకు వెళ్లదని గొప్పలు పోతుంది శాలిని. ఆ మాటలు క్రాంతి విని షాక్ అవుతాడు.
శాలిని గొప్పలు: క్రాంతి దిమ్మతిరిగే సమాధానం!
ఇంతలో క్రాంతి వచ్చి పేపర్స్ మీద సంతకం కావాలంటాడు. దాంతో శాలిని సైన్ చేస్తుంది. చెప్పానుగా నా సైన్ లేకుండా ఏం జరగదని శాలిని అంటుంది. ఇక నుంచి నీకు ఆ శ్రమ ఉండదని క్రాంతి అంటాడు. క్రాంతిని పొగుడుతారు శాలిని ఫ్రెండ్స్. అంత పొగడకండి. శాలిని పార్టనర్‌షిప్ నుంచి తీసేస్తున్నా. ఈ శాలిని చెప్పింది అంతా అబద్ధం. తను నా పాలిట దాపురించిన శని శాలిని నిజస్వరూపం గురించి చెప్పేసి వెళ్లిపోతాడు క్రాంతి.
సరే అకౌంట్‌లో ఎంత ఉంది. అప్పులు తీర్చాలని రాజ్ అంటాడు. ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని శ్రుతి అంటుంది. దాంతో ఇద్దరు షాక్ అవుతారు. మరోవైపు జగదీశ్వరి ఇంటికి సిద్ధాంతి వస్తాడు. విరాట్ యాక్సిడెంట్ గురించి, క్రాంతి, రఘురాం భయపడటం గురించి చెబుతుంది శ్యామల .
నిన్ను కోరి సీరియల్ మరింత ఉత్కంఠభరితంగా సాగుతోంది. చంద్రకళకు ఎదురయ్యే ప్రమాదం ఏమిటి? క్రాంతి నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


