|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్రహ్మముడి సీరియల్: పవర్ ఆఫ్ అటార్నీకి షాక్ ఇచ్చిన అపర్ణ! రేఖ అవుట్, రచ్చ రచ్చ చేసిన రాజు!!

Published: 19-03-2026, 1:35 AM
బ్రహ్మముడి సీరియల్: పవర్ ఆఫ్ అటార్నీకి షాక్ ఇచ్చిన అపర్ణ! రేఖ అవుట్, రచ్చ రచ్చ చేసిన రాజు!!
  • పవర్ ఆఫ్ అటార్నీ నుంచి రేఖను తప్పించాలని అపర్ణ ప్లాన్!
  • ఇందు ఫోన్ పగలగొట్టిన రాజు.. సీరియల్ లో హై టెన్షన్!
  • కావ్య, అప్పు, స్వప్నల అనుబంధం గుర్తు చేసుకున్న అపర్ణ.
  • ఐశ్వర్య మనసులో విష బీజం నాటుతున్న రేఖ, భ్రమరాంబ.

బ్రహ్మముడి సీరియల్ అభిమానులకు ఒక అదిరిపోయే న్యూస్! అపర్ణ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. రేఖను పవర్ ఆఫ్ అటార్నీ నుంచి తప్పించాలని ప్లాన్ వేసింది. అసలేం జరిగిందో తెలుసా?

పవర్ ఆఫ్ అటార్నీ నుంచి రేఖను తప్పించేందుకు స్కెచ్!

ఐశ్వర్య ఇందును తిట్టడంతో అపర్ణ వచ్చి బాధపడుతుంది. ఇక్కడ అపర్ణ గత విషయాలను గుర్తుకుతెచ్చుకుని కన్నీరు పెట్టుకుంటుంది. ఏమైందని సుభాష్ అడిగితే..కావ్య, అప్పు, స్వప్న ఎలా ఉండేవాళ్లు, ఒకరంటే ఒకరికి ప్రాణం, ఎవరికి కష్టమొచ్చినా సాయం చేసుకునేవాళ్లు, కానీ వాళ్ల పిల్లలు మాత్రం ఇలా తయారయ్యారేంటని బాధపడుతుంది. అసలు నందు ఎక్కడుందో, బతికుందో, చచ్చిపోయుందో అని ఏడుస్తుంది. ఈ రేఖ..రుద్రాణిని మించిపోతుందని అంటుంది. ఇప్పటినుంచే ఐశ్వర్య మనసులో విష బీజం నాటుతున్నారని అంటుంది. ఇప్పటికే భ్రమరాంబ, రేఖ ఇందును శత్రువులుగా చూస్తున్నారు..ఇక ఐశ్వర్య కూడా మరో శత్రువులా తయారవుతోందని బాధపడుతుంది. ఐశ్వర్యను తనలాగే పెంచుతోందని అంటే…అలా చేయకపోతే ఆశ్చర్యం గానీ చేస్తే ఎందుకు ఆలోచించాలని సుభాష్ అంటాడు. ఇప్పుడైతే ఓకే రేపు మనకేదైనా అయితే ఇందు ఒక్కతే వీళ్లతో ఎలా పోరాడుతుందని అపర్ణ అంటుంది. మనం ఏం చేయగలం…నేను లేవలేని పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఏం చేయలేవ్ అని సుభాష్ అంటాడు. అలా అయితే ఇందుకు మన అవసరం లేకుండా శక్తి వస్తే…ఈ ఆస్తి, ఫ్యాక్టరీలు ఎలాగూ ఇందు పేరుమీద ఉన్నాయి….కొన్ని రోజుల్లో అవి తనపేరుమీదకు వస్తాయి అని అంటుంది. అలా జరగాలి అంటే ఇన్నాళ్లుగా మన ఆస్తులకు పవర్ ఆఫ్ అటార్నిగా ఉన్న రేఖను తప్పించాలని అపర్ణ అంటుంది. నీ ఆలోచన బాగానే ఉన్నా రేఖకు తెలిస్తే ఏం చేస్తుందో అని భయంగా ఉందని సుభాష్ అంటాడు. ఇన్నాళ్లు భయపడుతూనే ఉన్నాం…ధైర్యం చేసి కోర్టులో కేసు వేస్తే తప్పకుండా పవర్ ఆఫ్ అటార్నీ ఇందు చేతిలోకి వస్తుందని ఆ రేఖ ఏమీ చేయలేదని అంటుంది. ఈరోజే లాయర్‍ని కలుస్తా అని వెళ్తుంది.

ఇటు ఇందు ఇంటర్వ్యూ కోసం బయల్దేరుతుంటుంది. సర్టిఫికేట్లు అన్ని బ్యాగులో పెట్టుకుని వెళ్తుంది. ఇంతలో హాల్‍లో భ్రమరాంబ ఉంటుంది. ఎప్పుడూ మీ అమ్మ హాల్‍లో ఉంటుందేంటి స్వాతి అని ఇందు అంటుంది. బయటకు వెళ్లడానికి రేఖ ఆంటీ పర్మిషన్ ఇచ్చినప్పుడు భయపడతావేంటీ, వెళ్లు ఉంటుంది. భ్రమరాంబకు చెప్పి వెళ్తుంటే….ఒక్కసారి ఆగు అని అంటుంది. వంట చేయడానికి బ్యాగు వేసుకేళ్తున్నావేంటీ అని అడుగుతుంది. ఇంట్లో నుంచి ఏమైనా ఎత్తుకెళ్తున్నావా లేక ఏమైనా సీక్రెట్స్ ఉన్నాయా అని అడుగుతుంది. ఇందు చేతిలోని బ్యాగు లాక్కోని తీస్తుండగా శేషం వచ్చి…ఇంకా నీ పాత బుద్ధులు పోనీచ్చుకోవా అని సెటైర్ వేస్తాడు. అప్పటికే బ్యాగు నుంచి సర్టిఫికేట్లు పడిపోతాయి. భ్రమరాంబ చూస్తుందేమోనని స్వాతి, ఇందు కంగారుపడిపోతారు. నీ ఫ్యామిలీ మొత్తానికి ఇదే అలవాటు కదా అని శేషం అంటే..నా ఫ్యామిలీ జోలికి రాకు అంటూ శేషాన్ని తిడుతూ వెళ్లిపోతుంది భ్రమరాంబ.

గతం గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్న అపర్ణ

వెంటనేఇందు సర్టిఫికేట్లు తీసుకుని బ్యాగులో వేస్తుండగా వెనుకనుంచి స్వాతి రేఖలో ఇమిటేట్ చేస్తుంది. ఇందు భయపడిపోతుంది. సరదాగా జోక్ చేసా అక్క…అని స్వాతి అంటుంది. ఫస్ట్ టైం గడప దాటి బయటకెళ్తున్న ఇందు…ఎలాంటి అడ్డంకులు రాకుండా చూడు కృష్ణయ్య అని ఇందు అంటుంది.

ముందు శివరాం ఇంటికి వెళ్తుంది ఇందు. ఏమేం వంట చేయోలో చెప్పండి, చేసేస్తా అంటుంది ఇందు. అదేం అవసరం లేదమ్మా…నువ్వు హెల్త్ అడిగావ్ కాబట్టి వంట చేయడానికి పిలిచా అంటాడు. ఆ ఇంట్లో నీకు మాట్లాడే స్వేచ్ఛ లేదు కాబట్టే నన్ను హెల్ప్ అడిగావ్….అందుకే సాయం చేశా. నువ్వు చేసిన దానికి నేను చేసింది చాలా తక్కువ అంటాడు. బయటకు రావడానికి కారణమేంటి అని శివరాం అడిగితే జాబ్ చేయాలనుకుంటున్నా అని ఇందు చెప్తుంది. ఆ జాబ్ విషయంలో నేను ఏమన్నా హెల్ప్ చేయాలా అని శివరాం అడిగితే…ఇప్పటికే నాకోసం చాలా రిస్క్ తీసుకున్నారు, ఇకపై మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదని ఇందు అంటుంది. నీకు ఎప్పుడు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు అని శివరాం అంటాడు.

ఇంటర్వ్యూకి వెళ్తున్న ఇందుని అడ్డుకున్న భ్రమరాంబ

ఇంతలో ఇంటర్వ్యూ కోసం వెళ్తున్న ఇందును రాజు బైక్‍తో డాష్ ఇస్తాడు. అప్పుడు ఇందు ఫోన్ పగిలిపోతుంది. నీ వల్ల పబ్‍లో నా జాబ్ పోగొట్టావ్, అప్పుడు కారును డాష్ ఇచ్చావ్, ఇప్పుడు నా సెల్ ఫోన్ పగలగొట్టావ్, నా కర్మకు నువ్వు దొరికావ్ అని తిడుతుంది. ఇప్పుడు నేను ఇంటర్వ్యూకు ఎలా వెళ్లాలి అని అడుగుతుంది. కావాలంటే ఫోన్ స్క్రీన్ పగిలిపోయింది కదా…డబ్బులు ఇస్తా వేయించుకో అంటాడు. స్క్రీన్ కాదు మొత్తం ఫోన్ పగిలిపోయింది.. నా ఫోన్ నాకు ఇప్పించు లేకపోతే పోలీస్ స్టేషన్‍లో కంప్లైట్ చేస్తా అని ఇందు బెదిరిస్తుంది.

ఫోన్ బాగు చేయించడానికి షాప్‍కు తీసుకెళ్తే…ఫోన్ మొత్తం పోయింది, ఇది రిపేర్ చేయడానికి కుదరదని షాప్ అతను అంటాడు. కావాలంటే రూ.7 వేలు కట్టి 7 రోజుల తర్వాత రమ్మని చెప్తాడు. రూ.7 వేలకు కొత్త ఫోన్ వస్తుంది కదా అని రాజు అంటే…నాకు కొత్త ఫోన్ వద్దు, ఈ ఫోనే కావాలి, అందులో కంపెనీ మెసేజ్ ఉంది అని ఇందు అంటుంది. కొత్త ఫోన్‍లో కూడా మెసేజ్ వస్తుందని షాప్ అబ్బాయి చెప్పడంతో…కొత్త ఫోన్ కొనిస్తాడు రాజు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

బ్రహ్మముడి సీరియల్ లో రోజుకో ట్విస్ట్ ఎదురు చూస్తూనే ఉంది. రేఖ పవర్ ఆఫ్ అటార్నీని అపర్ణ ఎలా అడ్డుకుంటుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.