
📌 Key Points
- విరాట్ జీవితంలోకి మాయ సంచలన ఎంట్రీ, ఊహించని మలుపు!
- దుబాయ్‌లో ల్యాండ్ అమ్మిన పురుషోత్తం, కొత్త చిక్కులు!
- విరాట్, చంద్రకళల మధ్య దూరం పెంచే ప్రయత్నాలు!
- జల్ రాజ్ ట్రావెల్ ఏజెన్సీ ఓపెనింగ్, శృతి కుట్రలు!
నిన్ను కోరి సీరియల్ అభిమానులకు షాకింగ్ న్యూస్! విరాట్ జీవితంలోకి మాయ ఎంట్రీతో కథ మొత్తం మారిపోయింది. అసలు మాయ ఎవరు? విరాట్ జీవితంలోకి ఎందుకు వచ్చింది? చూడాల్సిందే!
మాయ ఎంట్రీతో విరాట్ జీవితంలో పెను మార్పులు!
Ninnu Kori Serial March 10th Episode: నిన్ను కోరి సీరియల్ మార్చి 10 ఎపిసోడ్‌లో జల్‌రాజ్ ట్రావెల్ ఎజెన్సీని రఘురాం, జగదీశ్వరిలతో ఓపెన్ చేయిస్తాడు. విరాట్ ల్యాండ్ డాక్యుమెంట్ మిస్ అయిందని, అది తిరిగి పొందడానికి అమ్మిన వ్యక్తి సైన్ కావాలని క్రాంతి చెబుతాడు. దాంతో అతని దగ్గరికి విరాట్ వెళ్తాడు.
Ninnu Kori Serial Today Episode: నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో విరాట్, చంద్రకళ నవ్వుతూ మాట్లాడుకుంటుంటే క్రాంతి వస్తాడు. క్రాంతి, విరాట్ చంద్రకళకు పుట్టబోయే బిడ్డ గురించి మాట్లాడుతారు. తర్వాత ల్యాండ్ ఇష్యూలో లింక్‌డ్ డాక్యుమెంట్ మిస్ అయిందని క్రాంతి చెబుతాడు.
అంత కష్టపడి డాక్యుమెంట్ దొంగలిస్తే మల్లీ రీగేయిన్ చేయొచ్చాంటారేంటీ. అది పూర్తయ్యాకా చూద్దాం అని శాలిని వెళ్లిపోతుంది. జల్‌రాజు ట్రావెల్ బిజినెస్ పెడుతున్నాడు. రేపే ఓపెనింగ్. అందరిని రమ్మన్నాడు అని చంద్రకళ చెబుతుంది. మరుసటి రోజు ఉదయం ట్రావెల్ బిజినెస్ ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతుంటాయి.
దుబాయ్‌లో ల్యాండ్ అమ్మిన పురుషోత్తం.. అసలేం జరిగింది?
జల్‌రాజ్‌కు ఎవరు డబ్బు ఇస్తున్నారో తెలిస్తే ఆపేదాన్ని అని శ్రుతి అనుకుంటుంది. రాజ్ గురించి గొప్పగా చెబుతుంది తల్లి సరోజా. శ్రుతి సెటైర్లు వేస్తుంది. ఎంత ట్రై చేసిన నీ అప్పులు తీర్చనివ్వను అని శ్రుతి అనుకుంటుంది. ఇంతలో రఘురాం ఫ్యామిలీ వస్తుంది. జగదీశ్వరి, రఘురాంతో రిబ్బన్ కట్ చేయిస్తాడు జల్‌రాజ్. లోపల జ్యోతి ప్రజ్వలన చేస్తారు.
మన సేల్స్ కూడా పడిపోతున్నాయని అతను చెబుతాడు. మీరు ఒక పదిరోజులు గడువు అడిగి తీసుకోండి. ఈలోపు నేను సమస్య పరిష్కరిస్తాను అని విరాట్ చెబుతాడు. ఇంకెన్ని పరీక్షలు పెడతాడో దేవుడు అని విరాట్ అనుకుంటాడు. రోడ్డు నడి మధ్యలో ఓ అమ్మాయి నడుస్తూ వెళ్తుంది. అది విరాట్ చూసి అలా నడుస్తోంది ఏంటని అనుకుంటాడు.
విరాట్, చంద్రకళల మధ్య చిచ్చు పెడుతున్న మాయ!
ఆ అమ్మాయి వెనుక వెహికిల్స్ వస్తుంటాయి. ఓ పెద్ద వ్యాన్ రావడంతో వెళ్లి విరాట్ ఆ అమ్మాయిని లాగుతాడు. నన్ను చావనివ్వు అని ఆమె అంటే లాగిపెట్టి కొడతాడు విరాట్. మాయ.. ఏంటీ నువ్వు ఇలా అని గుర్తుపడతాడు విరాట్. మరోవైపు విరాట్ కోసం ఎదురుచూస్తుంది చంద్రకళ. శ్యామల, కామాక్షి దాని గురించి గొడవ పడతారు. ఇంతలో విరాట్ ఇంటికి మాయను తీసుకొస్తాడు.
మరోవైపు ట్రావెల్ బిజినెస్ గురించి కస్టమర్స్‌తో మాట్లాడుతాడు. ఇదంతా వీడికి ఎప్పుడు తెలిసింది అని శ్రుతి అంటే.. తెలుసుకున్నాడే, వాడి పేరులోనే రాజు ఉంది అని సరోజ అంటుంది. మరోవైపు విరాట్, చంద్రకళ ముద్దు పెట్టుకోబోతుంటే మాయ మధ్యలో వస్తుంది. దాంతో ఆగిపోతారు. అలా విరాట్ జీవితంలోకి వచ్చిన మాయ అడ్డుపడుతుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
మాయ రాకతో విరాట్ జీవితం ఎలా మారుతుందో చూడటానికి వేచి ఉండండి. మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి!


