
ఒక తెలుగు స్టార్ హీరోయిన్, ఆమె తల్లిపై మేకప్ ఆర్టిస్ట్ సంచలన ఆరోపణలు చేసింది. పారితోషికం విషయంలో మోసం, వేధింపులు అంటూ ఆమె చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు టాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ వివాదం సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది.
Key Points
తెలుగు స్టార్ హీరోయిన్, ఆమె తల్లిపై మేకప్ ఆర్టిస్ట్ సంచలన ఆరోపణలు చేసింది.
పారితోషికం చెల్లింపులో మోసం, వేధింపులు అంటూ మేకప్ ఆర్టిస్ట్ పోస్ట్ వైరల్ అయ్యింది.
నిర్మాణ సంస్థల ఆర్టిస్టులను వద్దని సొంతంగా మేకప్ టీమ్‌ను పెట్టుకుంటున్నారని ఆరోపణలు.
మేకప్ టీమ్‌కు తక్కువ ఇచ్చి, నిర్మాత నుంచి రెట్టింపు వసూలు చేస్తున్నారని షాకింగ్ ఆరోపణ.
మేకప్ ఆర్టిస్ట్ సంచలన ఆరోపణలు
మరో తెలుగు హీరోయిన్ వివాదంలో నిలిచింది. మేకప్ ఆర్టిస్టుతో వివాదం ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. సదరు మేకప్ ఆర్టిస్ట్.. తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టడంతో ఈ సంగతి బయటపడింది. సదరు హీరోయిన్, ఆమె తల్లిపై లేడీ మేకప్ ఆర్టిస్టు సంచలన కామెంట్స్ చేసింది. ఇంతకీ అసలేం జరిగిందంటే?
‘గత కొన్నిరోజులుగా ఓ స్టార్ హీరోయిన్ నన్ను వేధిస్తోంది. ఆమె టీమ్, కుటుంబ సభ్యులు అయితే చాలా స్టుపిడ్‌గా ప్రవర్తిస్తున్నారు. దక్షిణాదిలో వాళ్లకు తక్కువ మొత్తానికి లేదంటే ఫ్రీగా పనిచేసినట్లు ఇక్కడ కూడా పనిచేస్తారని అనుకుంటున్నారు. మాకు చాలా తక్కువ డబ్బులు ఇస్తున్నారు. నాకు నీతో పనిచేయాలని లేదు. కాబట్టి ఇకపై ఫోన్, మెసేజ్ చేయకు’
హీరోయిన్, తల్లిపై వేధింపుల ఆరోపణలు
‘ఆమె కుటుంబానికి చెందిన ఓ మనిషి.. నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. మిగతావాళ్లు సారీ చెబుతున్నారు. కానీ నాకు మీతో పనిచేయాలని లేదు. మా డబ్బులు నొక్కేయడం ఆపండి. లేదంటే ఈసారి మీ పేర్లు బయటపెడతాను’ అని సదరు మేకర్ ఆర్టిస్ట్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టార్ హీరోయిన్ ఎవరు?
విషయానికొస్తే.. రీసెంట్ టైంలో తెలుగులో వరస సినిమాలు చేసిన ఈ హీరోయిన్ ప్రస్తుతం బాలీవుడ్‌లో పలు ప్రాజెక్టులు చేస్తోంది. అయితే నిర్మాణ సంస్థలు ఏర్పాటు చేసే మేకప్ ఆర్టిస్టులని ఈ హీరోయిన్ తల్లి వద్దని చెబుతోందట. బదులుగా వేరే వాళ్లని పెట్టుకుని వాళ్లకు డబ్బులిస్తోంది. అయితే మేకప్ ఆర్టిస్టులకు ఎంత డబ్బులు ఇస్తుందో అంతకు రెట్టింపు.. నిర్మాత నుంచి వసూలు చేస్తున్నారట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు?
మొత్తానికి ఈ స్టార్ హీరోయిన్, ఆమె తల్లిపై వచ్చిన ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మేకప్ ఆర్టిస్ట్ బహిరంగంగా చేసిన ఈ ఆరోపణలపై చిత్ర పరిశ్రమ వర్గాలు, అభిమానులు స్పందన కోసం ఎదురు చూస్తున్నారు. ఈ వివాదం ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి.


