|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బిగ్ బాస్ సీజన్-9 ఫైనల్ కంటెస్టెంట్ లిస్ట్ రెడీ.. ఈ సారి క్రేజీ స్టార్స్‌ని దించుతున్నారుగా..?

Published: 22-06-2025, 1:48 AM
బిగ్ బాస్ సీజన్-9 ఫైనల్ కంటెస్టెంట్ లిస్ట్ రెడీ.. ఈ సారి క్రేజీ స్టార్స్‌ని దించుతున్నారుగా..?

బిగ్ బాస్ తెలుగు షో 9వ సీజన్ ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సారి క్రేజీ స్టార్స్, కాంట్రవర్సీలకు కేరాఫ్ గా నిలిచిన సెలబ్రిటీలు పాల్గొనే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కొందరు కంటెస్టెంట్ల పేర్లు లీక్ అయ్యాయి.

Key Points

1

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కి క్రేజీ కంటెస్టెంట్ల ఎంపిక

2

మై విలేజ్ షో ఫేమ్ అనిల్ గీల, జబర్దస్త్ ఫేమ్ ఇమ్మాన్యుయేల్ లాంటి వారు కూడా పాల్గొనే అవకాశం

4

గత సీజన్ల కంటే ఈ సీజన్ రేటింగ్స్ పెంచేందుకు ప్రయత్నాలు

క్రేజీ కంటెస్టెంట్ల ఎంపిక

రెండు తెలుగు రాష్ట్రాల్లో బిగ్‌ బాస్‌‌(Bigg Boss) షోకు ఎంత ఆదరణ లభిస్తుందో మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పటివరకు 8 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు 9 సీజన్‌ ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నెమ్మదిగా కంటెస్టెంట్లని ఎంపిక చేసే పనిలో బిగ్‌ బాస్‌ నిర్వాహకులున్నారు. ప్రస్తుతం ఈ షోకి సంబంధించిన పనులు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సారి హౌజ్‌లోకి ఎవరు రాబోతున్నారు? ఎలాంటి కంటెస్టెంట్లని దించుతున్నారు? అనేది ఆసక్తికరంగా మారింది. గత షోకి పెద్దగా ఆదరణ రాలేదు. ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేదు.

లీక్ అయిన పేర్లు

కానీ ఈ సారి ఆ మిస్టేక్స్ జరగకుండా షో రేటింగ్‌ పెంచేలా ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో బిగ్‌ బాస్‌ తెలుగు 9వ సీజన్‌కి క్రేజీ కంటెస్టెంట్లని రంగంలోకి దించబోతున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా కొందరు కంటెస్టెంట్ల పేర్లు లీక్‌ అయ్యాయి. వారి పేర్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే వీరిలో పలువురు క్రేజీ స్టార్స్ ఉండటం విశేషం. అదే సమయంలో కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా నిలిచిన సెలబ్రిటీల పేర్లు కూడా వినిపిస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు వినిపిస్తున్న సమాచారం ప్రకారం తొమ్మిదో సీజన్‌కి రాబోతున్న కంటెస్టెంట్లు వీరే అని కొందరి పేర్లు వినిపిస్తున్నాయి.

రేటింగ్స్ పెంచే ప్రయత్నాలు

వీరిలో మై విలేజ్ షో ఫేమ్ అనిల్ గీల(Anil Geela), సీరియల్ యాక్టర్ కావ్య(Kavya), రీతు చౌదరి(Reethu Chowdary), ప్రదీప్(Pradeep), శివ కుమార్(Shiv Kumar), బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ దీపిక(Deepika), జబర్దస్త్ ఫేమ్ ఇమ్మాన్యుయేల్(Emmanuel), సీరియల్ యాక్టర్ సీతాకాంత్(Seetha Kanth), ప్రియాంక జైన్ లవర్ శివ్ కుమార్(Shiv Kumar), అలేఖ్య(Alekhya)(అలేఖ్య చిట్టి పికిల్స్), అమర్ తేజ్ వైఫ్ తేజస్విని గౌడ(Tejaswini Gowda), సీరియల్ హీరోయిన్ దేబ్‌జాని(Debjani), కేరింత హీరో సుమంత్ అశ్విన్(Sumanth Ashwin), సీరియల్ యాక్టర్స్ హారిక(Harika), ఏక్‌నాథ్‌(Eknadh)ల పేర్లు తెరపైకి వచ్చాయి. మరి ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. Link

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కి సంబంధించి లీక్ అయిన కంటెస్టెంట్ల జాబితా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. చివరి నిర్ణయం కోసం మనం వేచి చూడాల్సిందే.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.