
📌 Key Points
- నిన్ను కోరి సీరియల్‌లో విరాట్‌ను టార్గెట్ చేసిన సునంద – ప్లాన్ వర్కవుట్ అవుతుందా?
- శాలిని సలహాతో మాయ ఏం చేస్తుందో చూడండి – ట్విస్ట్ అదిరింది!
- రాజ్ ఎంట్రీతో సీన్ మారిపోయింది – ఏం జరిగిందో మీరే చూడండి!
- రఘురాం టెన్షన్ పడుతూ ఉండగా, జగదీశ్వరి ఓదార్పు – అసలు సమస్య ఏంటి?
నిన్ను కోరి సీరియల్‌లో మరో సంచలన ఎపిసోడ్ మీ కోసం! సునంద కుట్రలు, మాయ అనుమానాలు, రాజ్ సహాయం… ఈరోజు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాల్సిందే!
విరాట్‌పై సునంద ప్లాన్: ఏం జరగబోతోంది?
Ninnu Kori Serial March 21st Episode: నిన్ను కోరి సీరియల్ మార్చి 21 ఎపిసోడ్‌లో ఇంటికెళ్లిన రఘురాం తెగ టెన్షన్ పడుతూ భయపడుతాడు. తర్వాత జగదీశ్వరికి లివర్ క్యాన్సర్ అని గుర్తొచ్చి తను ఆ విషయం ఎలా గుర్తుపెట్టుకోవాలని ఉక్కిరిబిక్కిరి అవుతాడు. విరాట్‌పై సునంద కొత్త ప్లాన్ వేసి శాలినికి చెబుతుంది.
Ninnu Kori Serial Today Episode: నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఇంట్లో అంతా కంగారుపడుతుంటే రఘురాం పక్కింటి వాళ్లు తీసుకొస్తారు. మీ ఇల్లు అనుకుని మా ఇంటి డోర్ కొట్టారని, జాగ్రత్తగా చూసుకోండని చెప్పి వెళ్లిపోతారు పక్కింటివాళ్లు. తనకు రోడ్డు మీద జరిగింది గుర్తు చేసుకుని రోడ్డు మీదకు ఎందుకు వెళ్లాను అని ఆలోచిస్తాడు రఘురాం .
ఎవ్వరికి ఏ సమస్య లేదు. మీరే అనవసరంగా భయపడుతున్నారు అని జగదీశ్వరి అంటుంది. నాకు ఎవరో ఏదో చెప్పారు, ఏదో గుర్తు వస్తుంది. మళ్లీ గుర్తు రావట్లేదు అని డాక్టర్ మాట్లాడింది గుర్తు చేసుకుంటాడు రఘురాం. రెస్ట్ తీసుకోమని చెప్పి చంద్రకళ వెళ్లిపోతుంది. మాయ ఏమైందని అడిగితే రఘురాం సమస్య గురించి చెబుతుంది. విరాట్‌కు ఏమైనా.. అని కాల్ చేసి చెప్పు అని మాయ అంటుంది.
శాలిని మాటలు విని మాయ ఏం చేసింది?
అనవసరంగా టెన్షన్ పెట్టకు. నువ్వు కూడా బావకు కాల్ చేయకు అని చెప్పేసి వెళ్లిపోతుంది చంద్రకళ. జగదీశ్వరి ట్యాబ్లెట్స్ ఇస్తే రఘురాం వేసుకుంటాడు. పొద్దున్నే కదండి డాక్టర్ గారెని కలిశాం. అంతా బాగుందని చెప్పారు. నా వేలికి అయిన గాయమైన గుర్తుందా అని చూపిస్తుంది జగదీశ్వరి. అది చూసిన రఘరాం డాక్టర్ చెప్పింది గుర్తు చేసుకుంటాడు.
మీరెందుకు నాకేదో అయిపోయినట్లు మాట్లాడుతున్నారు. మన మనిమనవళ్లతో కూడా ఆడుకునేవరకు మనిద్దరం నిక్షేపంగా ఉంటామని జగదీశ్వరి అంటుంది. మరోవైపు జల్ రాజ్ కోసం చికెన్ వండి తీసుకొస్తుంది తల్లి. శ్రుతి సైలెంట్‌గా ఉందని చెబుతుంది. ఇంతలో శ్రుతి వస్తుంది. ఇద్దరం కలిసి తిందామని రాజ్ అంటే.. వద్దని శ్రుతి అంటుంది.
మీ సంగతి, చంద్రకళ సంగతి చెబుతాను అంటుంది శ్రుతి. ఇంతలో శ్రుతి పెట్టుకున్న ఫుడ్ ఆర్డర్ వస్తుంది. ఫ్యామిలీ ప్యాక్ బిర్యాని ఆర్డర్ చేసుకున్నా, డబ్బులు ఇచ్చేయ్ అని వెళ్లిపోతుంది శ్రుతి. నువ్వు వండింది దానికి సరిపోదు. అందుకే ఆర్డర్ పెట్టుకుంది. అది బాధపడే రకం కాదు బాధపెట్టే రకం అని జల్‌రాజ్ అంటాడు. మరోవైపు రాత్రి లేచి నాకు దేవుడు అన్యాయం చేస్తున్నాడు. నువ్వు ఎక్కువ కాలం బతకవు అని కన్నీళ్లు పెట్టుకుంటాడు రఘురాం.
రాజ్ ఎంట్రీతో కథ ఎలా మలుపు తిరుగుతుంది?
ముందు డాక్టర్‌తో మాట్లాడి ఇంట్లోవాళ్లకు చెప్పాలి. ఈ విషయంపై నేను చాలా జాగ్రత్తగా ఉండాలని అనుకుంటాడు రఘురాం. మరుసటి రోజు ఉదయం జగదీశ్వరి పూజ చేసి అందరికి హారతి ఇస్తుంది. విరాట్ పని గురించి మాట్లాడుకుంటారు. పురుషోత్తం కనిపించట్లేదట అని క్రాంతి చెబుతాడు. కనిపించనప్పుడు ఎందుకు. బావ గారికి ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా అని శాలిని అంటుంది.
తర్వాత విరాట్ గురించి తల్లి సునందకు ఫోన్‌లో చెబుతుంది. పురుషోత్తం కోసం పిచ్చోడిలా తిరుగుతున్నాడట. కానీ, అది జరగదుగా మమ్మీ అని శాలిని సంతోషంగా అంటుంది. నీలిమతో మరో కొత్త నాటకం ఆడిస్తానని అదేంటో చెబుతుంది తల్లి సునంద. ఈ ప్లాన్ ఇప్పుడే ఇంప్లిమెంట్ చేస్తానని శాలిని అంటుంది. ఆ మాటలు విన్న మాయ శాలినిని ఫాలో అవుతుంది.
నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ఎంతో ఉత్కంఠగా ముగిసింది. రాబోయే ఎపిసోడ్స్‌లో ఏం జరుగుతుందో చూడాలి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి!


