|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నితిన్ సంచలనం: ఏడు ఫ్లాపుల తర్వాత సైన్స్ ఫిక్షన్ తో ఊహించని రీఎంట్రీ!

Published: 25-01-2026, 9:05 AM
నితిన్ సంచలనం: ఏడు ఫ్లాపుల తర్వాత సైన్స్ ఫిక్షన్ తో ఊహించని రీఎంట్రీ!
  • భీష్మ తర్వాత నితిన్ కెరీర్ లో ఏకంగా ఏడు ఫ్లాప్స్, ఫ్యాన్స్ షాక్!
  • విఐ ఆనంద్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మూవీతో నితిన్ గ్రాండ్ రీఎంట్రీ!
  • టైటిల్ ఇంకా ఫిక్స్ కాలేదు, కానీ ట్యాగ్ లైన్ మాత్రం అదిరింది: నో బడీ నో రూల్స్!
  • శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై భారీగా నిర్మితమవుతున్న ఈ చిత్రం!

యంగ్ హీరో నితిన్ తన కెరీర్ లో ఒక కీలకమైన మలుపులో ఉన్నాడు. వరుస ఫ్లాపుల తర్వాత, ఇప్పుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో ఒక సైన్స్ ఫిక్షన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

నితిన్ కి వరుసగా ఏడు ఫ్లాపులు!

యంగ్ హీరో నితిన్ కి భీష్మ చిత్రం తర్వాత వరుసగా 7 ఫ్లాపులు పడ్డాయి. ఇటీవల అయితే నితిన్ కి కెరీర్ లో దారుణమైన డిజాస్టర్లు ఎదురయ్యాయి. మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, రాబిన్ హుడ్, తమ్ముడు ఇలా నితిన్ నటించిన సినిమాలన్నీ ఫ్లాపులే.

ఇలా వరుస ఫ్లాపులు ఉన్నప్పుడు నెక్స్ట్ మూవీని ప్రారంభించడం అంత సులభం కాదు. నితిన్ నటించిన చివరి చిత్రం తమ్ముడు. గతేడాది జూలైలో విడుదలయింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. నితిన్ త్వరగానే తేరుకుని తన నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేశారు.

విఐ ఆనంద్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మూవీ

వరుస ఫ్లాపుల్లో కూడా ప్రయోగాలు చేయడం ఆపడం లేదు. నితిన్ కొత్త చిత్రం విఐ ఆనంద్ దర్శకత్వంలో ఉండబోతోంది. ఈ ఆసక్తికర కాంబినేషన్ కి సంబంధించిన ప్రకటన తాజాగా వెలువడింది. ఇది సైన్స్ ఫిక్షన్ మూవీ. ఇంతకు ముందు ఎవరూ టచ్ చేయని కథ..అయినప్పటికీ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది అని చిత్ర యూనిట్ ప్రకటించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ప్రకటించలేదు కానీ.. నో బడీ నో రూల్స్ అనే ట్యాగ్ లైన్ ఇచ్చారు. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో షాడోలో నితిన్ లుక్ కూడా పాక్షికంగా కనిపిస్తోంది.నితిన్ సిగరెట్ తాగుతూ కనిపిస్తున్నాడు.

నో బడీ నో రూల్స్ అంటున్న నితిన్

గతంలో దర్శకుడు విఐ ఆనంద్.. ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం, డిస్కో రాజా, ఊరు పేరు భైరవ కోన లాంటి చిత్రాలని తెరకెక్కించారు. ఆయన సినిమాల్లో ఏదో ఒక వైవిధ్యమైన పాయింట్ ఉంటుంది. కానీ ఆడియన్స్ కి తన చిత్రాలని నచ్చేలా తెరకెక్కించడంలో విఫలమవుతున్నారు. ఈ చిత్రం విజయం సాధించడం నితిన్, విఐ ఆనంద్ ఇద్దరికీ అవసరమే.

నితిన్ కొత్త సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. విభిన్నమైన కథతో వస్తున్న ఈ చిత్రం నితిన్ కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అవుతుందా చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.