|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

స్వాసిక చూడటానికి సాఫ్ట్‌గా ఉంది కానీ.. మలయాళ హీరోయిన్‌పై హీరో నితిన్ కామెంట్స్.. అప్పట్లో 60 లక్షల ఖర్చు అంటూ!

Published: 12-06-2025, 3:23 AM
స్వాసిక చూడటానికి సాఫ్ట్‌గా ఉంది కానీ.. మలయాళ హీరోయిన్‌పై హీరో నితిన్ కామెంట్స్.. అప్పట్లో 60 లక్షల ఖర్చు అంటూ!

నితిన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్వాసిక, దిల్ రాజు తమ అనుభవాలను పంచుకున్నారు.

Key Points

1

నితిన్, స్వాసిక, లయ, సప్తమి గౌడ నటించిన 'తమ్ముడు' ట్రైలర్ లాంచ్ జరిగింది.

2

నితిన్ స్వాసిక గురించి, ఆమె పాత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

4

'తమ్ముడు' సినిమా జూలై 4న విడుదల కానుంది.

‘తమ్ముడు’ ట్రైలర్ లాంచ్ హైలైట్స్

రాబిన్‌హుడ్ సినిమా థియేటర్లలో ఫ్లాప్ అయింది. కానీ, ఓటీటీ లో మాత్రం మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అలాంటి రాబిన్ హుడ్ సినిమా తర్వాత హీరో నితిన్ నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ తమ్ముడు. పవన్ కల్యాణ్ మూవీ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాకు వకీల్ సాబ్ డైరెక్టర్ శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు.

ఈ సినిమాలో హీరోయిన్‌గా వర్ష బొల్లమ చేయగా.. సీనియర్ హీరోయిన్ లయ, సప్తమి గౌడతోపాటు మలయాళ హీరోయిన్ స్వాసిక విజయ్ కీలక పాత్రలు పోషించారు. దిల్ రాజు, అల్లు శిరీష్ నిర్మించిన తమ్ముడు ట్రైలర్‌ను జూన్ 11న రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన తమ్ముడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో స్వాసిక, దిల్ రాజు, తమ్ముడు మూవీపై హీరో నితిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

హీరో నితిన్ మాట్లాడుతూ.. “తమ్ముడు మూవీ ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని నమ్ముతున్నాం. ఈ సినిమాకు లయ గారు చాలా ఇంపార్టెంట్. ఆమె చాలా బాగా పర్‌ఫార్మ్ చేశారు. అలాగే సప్తమి గౌడ ఈ చిత్రంలో కీ రోల్ చేశారు. స్వాసిక చూడటానికి సాఫ్ట్‌గా ఉంది. కానీ, ఈ మూవీలో ఆమె క్యారెక్టర్ సర్‌ప్రైజ్ చేస్తుంది” అని అన్నాడు.

నితిన్, స్వాసిక వ్యాఖ్యలు

“నా ఎడిటర్ ప్రవీణ్ పూడి, మా డీవోపీ గుహన్ గారు, అజనీష్ గారు సూపర్బ్‌గా ఔట్ పుట్ ఇచ్చారు. మా డైరెక్టర్ వేణు గారు నాలుగేళ్లు ఈ చిత్రం కోసం కష్టపడ్డారు. ఎక్కువగా ఫారెస్ట్‌లో షూట్ చేశాం” అని హీరో నితిన్ చెప్పుకొచ్చాడు.

“నా కెరీర్ బిగినింగ్‌లో దిల్ సినిమాకు రాజు గారు హయ్యెస్ట్ బడ్జెట్ పెట్టారు. అప్పట్లో సెట్ సాంగ్ కోసం 60 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఆ సినిమా మంచి హిట్ అయ్యింది. మళ్లీ తమ్ముడు మూవీకి నా కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్ ఖర్చు చేశారు. జూలై 4న మా మూవీ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా” అని దిల్ రాజు గురించి చెప్పాడు హీరో నితిన్ .

దిల్ రాజు గత అనుభవాల గురించి

ఇక మలయాళ హీరోయిన్ స్వాసిక విజయ్ మాట్లాడుతూ.. “తమ్ముడు మూవీలో నటించే అవకాశం రావడం హ్యాపీగా ఫీలవుతున్నాయి. నేను కెరీర్‌ బిగినింగ్‌లో ఉన్నాను. ఇలాంటి టైమ్‌లో మంచి రోల్ దొరకడం సంతోషంగా ఉంది. అందుకు నిర్మాత దిల్ రాజు గారికి, డైరెక్టర్ శ్రీరామ్ వేణు గారికి థ్యాంక్స్ చెబుతున్నా” అని అన్నారు.

“తమ్ముడు మూవీలో టాలెంటెడ్ కాస్టింగ్‌తో నటించడం మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులకు ఒక విజువల్ ట్రీట్‌లా ఉంటుంది. జూలై 4న తమ్ముడు మూవీని థియేటర్స్‌లో చూడండి” అని మలయాళ బ్యూటి స్వాసిక తెలిపింది.

‘తమ్ముడు’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో నితిన్, స్వాసిక, దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. జూలై 4న విడుదల అవుతున్న ఈ సినిమా హిట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.