
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన ‘తమ్ముడు’ చిత్రం జూలై 4న విడుదలవుతోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యాక్షన్, భావోద్వేగాలతో నిండి ఉంటుందని సమాచారం.
Key Points
నితిన్ నటించిన ‘తమ్ముడు’ జూలై 4న విడుదల
అదిరిపోయే పోస్టర్‌ను మూవీ మేకర్స్ విడుదల చేశారు
వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లు
యాక్షన్, భావోద్వేగం కలిగిన కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది
‘తమ్ముడు’ రిలీజ్ డేట్ ప్రకటన
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin), ‘వకీల్ సాబ్’ ఫేమ్ వేణు శ్రీరామ్ కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు’(thammudu). పవన్ కళ్యాణ్ హిట్ సినిమాతో పేరుతో రాబోతుండటంతో అందరిలో క్యూరియాసిటీ పెరిగిపోయింది. దీనిని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో సప్తమి గౌడ(Sapthami Gowda), వర్ష బొల్లమ్మ(Varsha Bollamma) హీరోయిన్లుగా నటిస్తుండగా.. లయ (laya) కీలక పాత్రలో కనిపించబోతుంది. అజనీస్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈచిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్ అన్ని మంచి రెస్సాన్స్‌ను దక్కించుకున్నాయి.
నితిన్ లుక్ విడుదల
అయితే ఈ మూవీ రిలీజ్ వాయిదా పడినట్లు షూటింగ్ పూర్తి కానందున కాస్త సమయం పడుతున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ‘తమ్ముడు’ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ సినిమా జూలై-4న థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు తెలుపుతూ నితిన్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇక ఇందులో నితిన్ నోట్లో కత్తి పెట్టుకుని వైల్డ్ లుక్‌లో కనిపించాడు. ఈ పోస్ట్‌కు ‘‘ఒక ప్రతిష్టాత్మకమైన.. శక్తివంతమైన గాథ బిగ్ స్క్రీన్‌లను వెలిగిస్తుంది. యాక్షన్, భావోద్వేగం అన్నింటిని ఒకే స్క్రీన్‌పై చూసి గొప్ప అనుభూతి చెందండి. తమ్ముడు జూలై 4, 2025న బుల్సేయ్‌ని తాకుతున్నాడు’’ అనే క్యాప్షన్ జత చేశారు.
సినిమా విశేషాలు
A post shared by Sri Venkateswara Creations (@srivenkateswaracreations)
నితిన్ అభిమానులకు ‘తమ్ముడు’ సినిమా ఒక గొప్ప వినోదాన్ని అందించనుందని ఆశిద్దాం. జూలై 4న థియేటర్లలో ఈ సినిమాను వీక్షించండి.


