
📌 Key Points
- నోయిడా కార్మిక నిరసనల్లో పాక్ కుట్ర కోణం వెలుగులోకి.
- సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తి చేసినట్లు గుర్తింపు.
- ప్రధాన నిందితులపై జాతీయ భద్రతా చట్టం కింద చర్యలకు యోచన.
- అల్లర్లకు సంబంధించి 13 ఎఫ్ఐఆర్‌లు నమోదు, 62 మంది అరెస్ట్.
ఉత్తర్ ప్రదేశ్‌లోని నోయిడాలో కార్మిక నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ హింస వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తి చేసి కార్మికులను రెచ్చగొట్టారని పోలీసులు తెలిపారు.
నిరసనల్లో పాక్ హస్తం?
ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh)లోని నోయిడా (Noida)లో ఈ నెల 13న జరిగిన కార్మిక నిరసనల సమయంలో చోటుచేసుకున్న హింస, విధ్వంసం వెనుక పాకిస్థాన్ హస్తం ఉన్నట్లుగా నోయిడా పోలీసులు గుర్తించారు. నిరసనకారులను రెచ్చగొట్టి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడానికి పాకిస్థాన్ నుంచి రెండు సోషల్ మీడియా ప్లాట్‌పామ్ ‘X’ (ట్విట్టర) ఖాతాలను ఆపరేట్ చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. అయితే, ‘అనుషి తివారీ’, ‘మీర్ ఇలియాస్ ఇంక్’ అనే పేరుతో ఉన్న ఖాతాల ద్వారా నిరసనల్లో పలువురు కార్మికులు మరణించారంటూ తప్పుడు వార్తలను వ్యాప్తి చేశారు. తద్వారా కార్మికులను హింసకు ప్రేరేపించారు. విచారణలో ఈ ఖాతాలను పాకిస్థాన్ నుంచి వీపీఎన్ VPN (Virtual Private Network) సాయంతో ఆపరేట్ చేస్తున్నట్లు సాంకేతిక ఆధారాలతో పోలీసులు ధ్రువీకరించారు.
‘మజ్దూర్ బిగుల్ దస్తా’ అనే బృందానికి చెందిన రూపేష్ రాయ్, మనీషా చౌహాన్, ఆదిత్య ఆనంద్‌లు వేలమంది కార్మికులతో వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి, వారిని క్షేత్రస్థాయిలో రెచ్చగొట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఈ అల్లర్లకు సంబంధించి ఇప్పటి వరకు 13 ఎఫ్ఐఆర్‌లు నమోదు కాగా, 62 మందిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులపై జాతీయ భద్రతా చట్టం (NSA) కింద చర్యలు తీసుకునే యోచనలో పోలీసులు ఉన్నారు. డిజిటల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ, స్థానికంగా కార్మికులను సమీకరించి అలజడి సృష్టించేందుకు పక్కా ప్లాన్‌త కుట్ర చేసినట్లుగా నోయిడా పోలీస్ కమిషనర్ లక్ష్మీ సింగ్ తెలిపారు.
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం
చర్యలకు సిద్ధమైన పోలీసులు
నోయిడాలో జరిగిన కార్మిక నిరసనల వెనుక పాకిస్థాన్ కుట్ర ఉందని పోలీసులు గుర్తించడం సంచలనంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోనున్నారు.


