|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వెక్కి వెక్కి ఏడుస్తూ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిన నోరా ఫతేహి.. చర్చనీయాంశంగా మారిన వీడియో

Published: 07-07-2025, 8:42 AM
వెక్కి వెక్కి ఏడుస్తూ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిన నోరా ఫతేహి.. చర్చనీయాంశంగా మారిన వీడియో

బాలీవుడ్ నటి నోరా ఫతేహి తాజాగా ఎయిర్‌పోర్ట్‌లో కన్నీళ్లతో కనిపించింది. ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ ఎయిర్‌పోర్ట్ లోకి వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.

Key Points

1

నోరా ఫతేహి ఎమోషనల్‌గా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తున్న వీడియో వైరల్

2

కన్నీళ్లతో కనిపించిన నోరాను చూసి అభిమానులు ఆందోళన

4

నోరా ఇన్‌స్టాగ్రామ్‌లో అరబిక్‌లో పోస్ట్ చేయడం గమనార్హం

ఎమోషనల్‌గా కనిపించిన నోరా

బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి(Nora Fatehi)కి పరిచయం అక్కర్లేదు. ఈ అమ్మడు బాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకుంది. పలు చిత్రాల్లో స్పెషల్ సాంగ్ చేసి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. అంతేకాకుండా ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ ఐటమ్ సాంగ్ చేసి ఓవర్ నైట్ స్టార్‌గా మారింది. ఇక ఈ ఏడాది నోరా ‘హౌస్‌ఫుల్-5’ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం హరిహర వీరమల్లు(Harihara Veeramallu), కాంచన-4, కేడీ: ది డెవిల్ వంటి సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. అయినప్పటికీ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం పలు పోస్టులు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా, నోరా ఫతేహికి సంబంధించిన ఓ ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి చర్చనీయాంశంగా మారింది. ఇక ఇందులో ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్లింది. కన్నీళ్లు పెట్టుకుంటూ లోపలికి వెళ్తుండగా.. ఓ అభిమాని ఆమెతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించగా.. వెంటనే ఆమె బాడిగార్ట్ వచ్చి ఆ యువకుడిని పక్కకు తోసేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక అది చూసిన నెటిజన్లు ఆమె దగ్గరి బంధువులు ఎవరైనా చనిపోయారు కావచ్చు అందుకే అంత ఎమోషనల్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా నోరా స్ట్రాంగ్‌గా ఉండాలని ధైర్యం చెబుతున్నారు. అయితే ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే ముందు నోరా ఇన్‌స్టాగ్రామ్‌లో అరబిక్‌లో ఓ పోస్ట్ పెట్టడం గమనార్హం.

వైరల్ అవుతున్న వీడియో

అభిమానుల ప్రతిచర్యలు

నోరా ఫతేహి యొక్క ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆమెకు అభిమానులు ధైర్యం చెబుతున్నారు. ఈ ఘటన వెనుక ఉన్న నిజానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.