|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నోరా ఫతేహి సంచలనం: ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో అరుదైన ఘనత!

Published: 09-05-2026, 6:30 PM
నోరా ఫతేహి సంచలనం: ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో అరుదైన ఘనత!
  • నోరా ఫతేహి ఫిఫా వరల్డ్ కప్ 2026 ఓపెనింగ్ సెర్మనీలో ప్రదర్శన ఇవ్వనుంది.
  • 2022 క్లోజింగ్ సెర్మనీ తర్వాత ఇది ఆమెకు రెండోసారి దక్కిన అరుదైన అవకాశం.
  • ఈసారి 48 దేశాలతో ఫిఫా చరిత్రలోనే అతిపెద్ద ఈవెంట్‌గా నిలవనుంది.
  • నోరా తన డ్యాన్స్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది.

బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ నోరా ఫతేహి ఫిఫా వరల్డ్ కప్ 2026 ఓపెనింగ్ సెర్మనీలో ప్రదర్శన ఇవ్వనుంది. 2022లో క్లోజింగ్ సెర్మనీలో అదరగొట్టిన నోరా, ఇప్పుడు రెండోసారి ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనడం భారతీయ సినిమాకు గర్వకారణం. ఇది ఫిఫా చరిత్రలోనే అతిపెద్ద ఈవెంట్‌గా నిలవనుంది.

ఫిఫా 2026: నోరా ఫతేహికి మరో అరుదైన అవకాశం

Nora FIFA : నోరా ఫతేహి… తనదైన స్టెప్పులతో,అదిరే అందాలతో మూవీ లవర్స్ కి ముచ్చెమటలు పట్టించే ఈ బాలీవుడ్ బ్యూటీ ఈసారి పుట్ బాల్ ప్రేమికులని మురిపించేందుకు రెడీ అయిపొయింది.యస్ .. కెనడాలోని టొరంటోలో జూన్ 11న అట్టహాసంగా ప్రారంభం కానున్న ఫిఫా వరల్డ్‌కప్ 2026 ఓపెనింగ్ సెర్మనీలో స్టేజ్ షో ఇవ్వబోతుంది నోరా .

‘లైట్ ది స్కై’ పాటతో వరల్డ్  షేక్

గతంలో 2022లో ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్ క్లోజింగ్ సెర్మనీలో ‘లైట్ ది స్కై’ పాటతో వరల్డ్ ని షేక్ చేసిన ఈ అమ్మడు ఇప్పుడు ఏకంగా టోర్నీ ఓపెనింగ్ సెర్మనీలోనే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవబోతుండడం విశేషం. దీంతో ఈ ఛాన్స్ దక్కడం నోరాకే కాదు ఇండియన్ సినిమాకే ఒక ప్రౌడ్ మూమెంట్ అంటూ పోస్టులతో నెట్టింట్లో సందడి చేస్తున్నారు మూవీ లవర్స్.

ఫిఫా హిస్టరీలోనే ఇది అత్యంత భారీ ఈవెంట్‌

ఫిఫా చరిత్రలోనే అతిపెద్ద ఈవెంట్

ఇక ఈ మెగా ఈవెంట్ విషయానికి వస్తే ఫిఫా హిస్టరీలోనే ఇది అత్యంత భారీ ఈవెంట్‌గా నిలవబోతోందని తెలుస్తుంది. జూన్ 11 నుంచి జూలై 19 వరకు మొత్తం 39 రోజుల పాటు మూడు దేశాల్లో అంటే అమెరికా, కెనడా, మెక్సికోలు కలిసి ఈ ఈవెంట్ ని నిర్వహించబోతుండడం ఒక విశేషం అయితే గతంలో 32 దేశాలు మాత్రమే పాల్గొనే ఈ టోర్నీలో, ఈసారి మొదటిసారిగా 48 దేశాలు పాల్గొనడం మరో విశేషం.

‘బాహుబలి’ సినిమాలోని ‘మనోహరి’ పాటతో

ఇక నోరా ఫతేహి స్టెప్పుల విషయానికి వస్తే కేవలం బాలీవుడ్ ఐటెం సాంగ్స్‌కు మాత్రమే పరిమితం కాలేదు. ‘బాహుబలి’ సినిమాలోని ‘మనోహరి’ పాటతో టాలీవుడ్ ఆడియన్స్ కి దగ్గరైన ఈ భామ, ఆ తర్వాత హిందీలో ‘దిల్బర్’, ‘సాకీ సాకీ’, ‘గర్మీ’ వంటి చార్ట్‌బస్టర్ సాంగ్స్‌తో ఇండియాలో తిరుగులేని డ్యాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకుంది.వీటితో పాటు ఇంటర్నేషనల్ మ్యూజిక్  వీడియోలలోనూ తన సత్తా చాటింది కూడా.

నోరా గ్లోబల్ డ్యాన్స్ జర్నీ

నోరా స్టెప్పులకి వరల్డ్ వైడ్  ఫాలోయింగ్

ఇక ఈ మధ్యే ఆమె నటించిన ‘మడ్గావ్ ఎక్స్‌ప్రెస్’ మరియు విద్యుత్ జమ్వాల్‌తో కలిసి చేసిన ‘క్రాక్’ సినిమాల్లోని ఆమె పెర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఆమె భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ భామకి ఇపుడు ఫిఫా 2026 ఓపెనింగ్ సెర్మనీలో స్టెప్పులేసె అవకాశం దొరకడం అదృష్టమనే చెప్పాలి.ఏది ఏమైనా ఒకసారి అలాంటి అవకాశం దొరకడమే గొప్ప అనుకుంటే ఏకంగా రెండో సారి కూడా ఛాన్స్ దక్కించుకోవడం చూస్తుంటే నోరా స్టెప్పులకి వరల్డ్ వైడ్ గా ఎంతటి ఫాలోయింగ్ ఉందో అర్థమవుతుంది.

నోరా ఫతేహికి ఫిఫా వరల్డ్ కప్ వంటి అంతర్జాతీయ వేదికపై రెండోసారి అవకాశం దక్కడం ఆమె గ్లోబల్ ఫాలోయింగ్‌కు నిదర్శనం. ఆమె ప్రదర్శన కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.