
Key Points
కోట శ్రీనివాసరావు అంత్యక్రియల్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
అభిమానులు 'జై ఎన్టీఆర్' నినాదాలు చేయడంతో ఎన్టీఆర్ వారిని హెచ్చరించారు.
ఎన్టీఆర్ కోట శ్రీనివాసరావు గురించి గౌరవంగా మాట్లాడుతూ వారిని 'జై కోట శ్రీనివాసరావు' అని నినాదించమని కోరారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అభిమానుల ప్రవర్తనపై ఎన్టీఆర్ అసంతృప్తి
తెలుగు లెజండరీ నటుడు కోట శ్రీనివాసరావు మరణం టాలీవుడ్ ఇండస్ట్రీని శోకసంద్రంలోకి నెట్టివేసింది. జులై 13న సాయంత్రం కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు జరిగాయి. అయితే, సినీ సెలబ్రిటీలు, అభిమానుల సందర్శనార్థం కోట శ్రీనివాసరావు పార్థివదేహాన్ని ఆయన నివాసంలో ఉంచారు.
అగ్ర తారలు, నటీనటులు కోట శ్రీనివాసరావు పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం మీడియా ముందుకు వచ్చి కోట గురించి గొప్పగా చెప్పారు. ఈ క్రమంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సైతం కోట శ్రీనివాసరావుకు నివాళులు అర్పించాడు. కోట గురించి చెప్పడానికి విలేకరుల ముందుకు వచ్చాడు తారక్.
వేలు చూపి హెచ్చరించిన జూనియర్ ఎన్టీఆర్
అయితే, కోట శ్రీనివాసరావు గురించి జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతుండగా ఆయన అభిమానులు జై ఎన్టీఆర్.. జై ఎన్టీఆర్ నినాదాలు చేశారు. అదే పనిగా ఫ్యాన్స్ నినాదాలు చేసేసరికి జూనియర్ ఎన్టీఆర్‌కు కోపం వచ్చింది. అభిమానులపై సీరియస్ అయిన తారక్ వేలి చూపించి మరి సైలెంట్‌గా ఉండమంటూ వార్నింగ్ ఇచ్చాడు.
అలా వద్దు, జై కోట శ్రీనివాసరావు అని జూనియర్ ఎన్టీఆర్ నినదించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కోట శ్రీనివాసరావుకు జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన గౌరవాన్ని నెటిజన్స్‌ను ఫిదా చేసింది. ట్విటర్ లో ట్రెండ్ అవుతున్న ఈ వీడియోకు నెటిజన్స్ పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
‘ఎంత గౌరవ సూచిక’ అంటూ ఓ వ్యక్తి ఈ వీడియోకు ట్విటర్‌లో స్పందించారు. ‘స్టార్ గౌరవంగా ఉంటాడు. కానీ, అభిమానులు మూర్ఖులు’ అని మరొకరు కామెంట్ చేశారు. మరికొందరైతే అభిమానులు ఈ నటుడికి ఇబ్బందికరంగా మారారని విమర్శించారు. ‘ఈ ఫ్యాన్ బేస్ ఏంటి. చాలా మూర్ఖత్వం” అని ఒకరు వ్యాఖ్యానించారు.
ఇక కోట శ్రీనివాసరావు గురించి చాలా గొప్పగా చెప్పాడు జూనియర్ ఎన్టీఆర్. కోట శ్రీనివాసరావు వారసత్వం, తెలుగు సినిమాపై చూపిన ప్రభావం గురించి ఎన్టీఆర్ విలేకరులతో మాట్లాడారు. ఆయన మిగిల్చిన వారసత్వాన్ని మన అన్ని మాధ్యమాల్లో, దుఃఖం లేకుండా జరుపుకుందామని జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.
కోట శ్రీనివాసరావుకు జూనియర్ ఎన్టీఆర్ చూపిన గౌరవం, అభిమానుల ప్రవర్తనపై ఆయన స్పందన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ యొక్క ఈ చర్య చాలా మందిని ఆకట్టుకుంది.


