|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఎన్టీఆర్‌ క్లాసికల్‌ డాన్స్ కి ఇన్‌స్పైర్‌ అయి ఇప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన నటి ఎవరో తెలుసా?

Published: 27-08-2025, 2:19 PM
ఎన్టీఆర్‌ క్లాసికల్‌ డాన్స్ కి ఇన్‌స్పైర్‌ అయి ఇప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన నటి ఎవరో తెలుసా?

ఎన్టీఆర్ చిన్ననాటి కూచిపూడి నృత్య ప్రదర్శనలు చూసి ఒక తల్లి తన కూతురును నృత్యకళలో శిక్షణ ఇచ్చింది. ఆ కూతురు ఎవరో తెలుసా? అవును, ఆమె టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.

Key Points

1

ఎన్టీఆర్ చిన్ననాటి కూచిపూడి నృత్య ప్రదర్శనలు.

2

శ్రీలీల తల్లి స్వర్ణలతకు ఎన్టీఆర్ ప్రేరణ.

4

శ్రీలీల టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదుగుదల.

ఎన్టీఆర్ యొక్క చిన్ననాటి నృత్య ప్రయాణం

జూ ఎన్టీఆర్‌ చిన్నప్పుడు క్లాసికల్‌ డాన్స్ నేర్చుకున్నారు. కూచిపూడి డాన్స్ లో మంచి పట్టు ఉంది. అనేక స్టేజ్‌ షోస్‌ కూడా ఇచ్చి మెప్పించారు. తారక్‌ని చిన్నప్పుడు ఓ సాధారణ అబ్బాయిగానే పెంచింది వాళ్ల అమ్మ. అలానే ట్రీట్‌ చేసింది.  చదువు విషయంలో కూడా అలానే ట్రీట్‌ చేసింది. తారక్‌ చాలా అల్లరివాడు. ఆ అల్లరిని కంట్రోల్‌ చేసేందుకు కర్రలు విరిగేలా అమ్మ తనని కొట్టిందని పలు సందర్భాల్లో ఎన్టీఆర్‌ చెప్పారు. చిన్నప్పుడు ఎంత కష్టపడ్డాడో, ఇప్పుడు అంతే గొప్పగా ఎదిగారు తారక్‌. డాన్సుల్లో టాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్‌గా పేరుతెచ్చుకున్నారు.

ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌ చిన్నప్పుడు క్లాసికల్‌ డాన్స్ షో చేసే సమయంలో ఒక హీరోయిన్‌ మదర్‌.. తారక్‌ని చూసి ఇన్‌స్పైర్‌ అయ్యింది. తాను కూడా తనకు కూతురు పుడితే ఇలా డాన్సర్‌ని చేయాలని కలలు కన్నది. అప్పుడు ఎన్టీఆర్‌ కలిసినప్పుడు కూడా అదే విషయాన్ని చెప్పింది. ఇప్పుడు అదే చేసి చూపించింది. తన కూతురుని బెస్ట్ డాన్సర్‌ గా తీర్చిదిద్దింది. ఇప్పుడు ఆ అమ్మాయి టాలీవుడ్‌లో బెస్ట్ డాన్సర్‌గా పేరు తెచ్చుకుంది. అంతేకాదు స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తోంది. ఆమె ఎవరో కాదు శ్రీలీల.

శ్రీలీల తల్లి స్వర్ణలత యొక్క ప్రేరణ

శ్రీలీల తల్లి స్వర్ణలత తారక్‌ని చూసి తనకు కూతురుపుడితే మీలా బెస్ట్ డాన్సర్‌ని చేయాలని ఫిక్స్ అయ్యిందట. ఈ విషయాన్ని జగపతిబాబు హోస్ట్ గా చేస్తోన్న `జయమ్ము నిశ్చయమ్మురా` టాక్‌ షోలో తెలిపారు. శ్రీలీల, వాళ్ల మదర్‌ స్వర్ణలత కలిసి ఈ షోలో పాల్గొన్నారు. ఇందులో జగపతిబాబు..ఎన్టీఆర్‌ చిన్నప్పుడు డాన్స్ పర్‌ఫెర్మెన్స్ చేస్తోన్న ఒక ఫోటోని చూపించి, ఈ ఫోటో గురించి ఏమైనా చెబుతారా? అని శ్రీలీల అమ్మని అడిగారు.

ఆమె రియాక్ట్ అవుతూ, 1997లో తానా ఈవెంట్స్ లాస్‌ ఏంజెల్స్ లో జరిగాయి. అక్కడ తాము ఉండేవాళ్లం. ఆ సమయంలో ఈ తానా ఈవెంట్‌కి వెళ్లాం. అందులో ఎన్టీఆర్‌ డాన్స్ చేశారు. ఆయన కలిసినప్పుడు నాకు అమ్మాయి పుడితే నీలా డాన్స్ చేయించాలని కోరిక ఉంది అని చెప్పాను.  అదే కోరికని బలంగా దాచుకుని ఇప్పుడు శ్రీలీలని తయారు చేశాన`ని తెలిపింది స్వర్ణలత. శ్రీలీలకి క్లాసికల్‌ డాన్స్ లతోపాటు వీణ వాయించడం వచ్చు. ఇప్పుడు డ్రమ్స్, గీటార్‌ నేర్చుకుంటుందట. చిన్నప్పుడు భరతనాట్యంతోపాటు బాలిలో కూడా చేర్చించిందట. ఈ రెండూ ఒకేసారి నేర్చుకుందట శ్రీలీల. ఆ సమయంలో కష్టమైనా, సాధన చేస్తే పెద్ద సమస్యకాదని చెప్పి నేర్పించానని,  శ్రీలీల కూడా అంతే బాగా నేర్చుకుందని, ఇప్పుడు బెస్ట్ డాన్సర్‌ అయ్యిందని తెలిపింది స్వర్ణలత.

శ్రీలీల యొక్క విజయవంతమైన కెరీర్

`పెళ్లిసందడి` చిత్రంతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల..`ధమాఖా` తో బ్లాక్‌ బస్టర్‌ అందుకుంది. దీంతో వరుసగా సినిమా ఆఫర్లు సొంతం చేసుకుంది. `గుంటూరు కారం`, `స్కంధ`, `ఆదికేశవ`, `ఎక్స్ టార్డినరీ మ్యాన్‌`, `భగవంత్‌ కేసరి`, `రాబిన్‌హుడ్‌`, `జూనియర్‌` వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి ఆకట్టుకుంది. `పుష్ప 2`లో కిస్సిక్‌ సాంగ్‌తో దుమ్ములేపిన విషయం తెలిసిందే. దీంతో ఆమెకి ఇప్పుడు ఇంతర భాషల్లోనూ ఆఫర్లు వస్తున్నాయి. హిందీలో `అషిఖీ 3`లో హీరోయిన్‌గా ఎంపికైంది. తమిళంలో `పరాశక్తి` మూవీలోనూ నటిస్తోంది. ఇక తెలుగులో `మాస్‌ జాతర`, `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది శ్రీలీల.

ఎన్టీఆర్ ప్రేరణతో శ్రీలీల నృత్య ప్రపంచంలో రాణిస్తోంది. తల్లి ప్రోత్సాహంతో, శ్రీలీల టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇది నిజంగా ప్రేరణదాయకమైన కథ.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.