|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఎన్టీఆర్ ‘డ్రాగన్’: నీల్ మాయలో తారక్ ఫ్యాన్స్.. షూటింగ్ ఆలస్యం! అసలేం జరుగుతోంది?

Published: 27-03-2026, 10:35 AM
ఎన్టీఆర్ 'డ్రాగన్': నీల్ మాయలో తారక్ ఫ్యాన్స్.. షూటింగ్ ఆలస్యం! అసలేం జరుగుతోంది?
  • ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా షూటింగ్ 40% మాత్రమే పూర్తయింది.
  • సినిమా ఆలస్యం కావడంతో రెండు భాగాలుగా తీస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
  • రుక్మిణి వసంత్ వంటి కొత్త హీరోయిన్ సీన్స్ తీయడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి.
  • తక్కువ వర్క్, ఎక్కువ హైప్ అన్నట్టుగా సినిమా ఉందని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న ‘డ్రాగన్’ సినిమా షూటింగ్ నత్తనడకన సాగుతుండటంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు. సినిమా ప్రారంభమై చాలా కాలం గడుస్తున్నా ఇంకా సగం కూడా పూర్తి కాకపోవడంతో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.

డ్రాగన్ మూవీ షూటింగ్ ఎంతవరకు వచ్చింది?

NTR Dragon Movie: KGF సిరీస్ ,సలార్ సినిమాలతో నేషనల్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ తారక్ తో సినిమా అనగానే ఎగిరి గంతేశారు నందమూరి ఫ్యాన్స్. ఇక మా హీరోకి మరో వెయ్యికోట్ల సినిమా పక్కా అని కాలర్ ఎగరేశారు కూడా. అలా అంచనాలు స్కై లెవల్ లో పెట్టేసిన ఈ సినిమా గురించి ఇపుడు చక్కర్లు కొడుతున్న అప్ డేట్స్ వింటే పూనకాలు రావడం అటుంచి గుండె ఆగినంత పనవుతుందట. అవును ..సినిమా ముహూర్తం పెట్టుకుని ఇన్నేళ్లయినా ఇప్పటికీ కేవలం 40 శాతం షూటింగ్ మాత్రమే కంప్లీట్ అయిందన్న వార్త ఫ్యాన్స్ కి నిద్ర లేకుండా చేస్తున్నాయ్.దీంతో ఈ డ్రాగన్ గర్జించేదెప్పుడో మా హీరో రికార్డులు రీరైట్ చేసేదెప్పుడో అని డీలా పడిపోతున్నారట డై హార్డ్ ఫ్యాన్స్ .

ఇప్పటికీ సగం కూడా కంప్లీట్

ముఖ్యంగా సినిమాని ఓ రేంజ్ లో తీస్తున్నాని,ప్రతి సీన్‌ను హై స్టాండర్డ్స్‌లో ఆదరగొడుతున్నాని చెప్పి షూటింగ్ ని చాలా స్లోగా తీస్తున్నాడన్నా వార్తలు వినిపిస్తున్నాయ్ .మొదలెట్టి దాదాపు రెండేళ్ళు గడిచిపోయినా ఇప్పటికీ సగం కూడా కంప్లీట్ కాలేదంటే అసలు నీల్ మామ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేద్దామనుకుంటూన్నాడు  అంటూ చెడుగుడు ఆడేస్తున్నారు నెటిజన్లు .

సినిమా ఆలస్యానికి కారణాలేంటి?

నిజానికి RRR తర్వాత తారక్ రేంజ్ మారిపోయింది.కానీ ఒకవైపు డ్రాగన్’ అప్డేట్స్ లేకపోవడం,మరో వైపు షూటింగ్ స్లోగా సాగడంతో కొంపదీసి సినిమాని రెండు పార్ట్స్ గా తీస్తున్నారా ఏంటి అన్న డౌట్స్ కూడా రైజ్ చేస్తున్నారు.మరో వైపు రుక్మిణి వసంత్ లాంటి కొత్త హీరోయిన్‌ను తీసుకుని కూడా ఆమె సీన్లు తీయడానికి ఇంతింత టైం స్పెండ్ చేస్తే ఇక భారీ యాక్షన్ సీక్వెన్సుల పరిస్థితి ఏంటి? చూస్తుంటే వర్క్ తక్కువ – హైప్ ఎక్కువ అన్నట్టుగా ఉందని ఫైర్ అవుతున్నారు తారక్ ఫ్యాన్స్.

ఇక ఇప్పటికే సినిమాపై  మైత్రి మూవీ మేకర్స్,ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి వందల కోట్లు కుమ్మరిస్తున్నాయి. షూటింగ్ ఇలాగే ఆలస్యమైతే వడ్డీలు పెరిగిపోవడం, ప్రొడక్షన్ ఖర్చులు భారమవ్వడం ఖాయం.ఏది ఏమైనా ప్రశాంత్ తన స్టైలిష్ మేకింగ్ కోసం ఇలా మేకర్లను మరియు హీరోను ఇబ్బంది పెడుతున్నారా? అనే టాక్ ఫిలిం సర్కిల్స్ లో కాస్త గట్టిగానే వినిపిస్తుంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ ఇప్పటివరకు చూడని అవతార్‌లో కనిపిస్తారని చెప్తున్నా.. అసలు ఆ అవతార్ ఎప్పుడు బయటకు వస్తుందో ఎవరికీ తెలియని పరిస్థితి.

అభిమానుల అసహనానికి కారణం ఇదేనా?

ఏది ఏమైనా తారక్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో తెలిసిందే. సో ఇప్పటికైనా మేకర్స్ చేస్తున్నఇలా స్లో షూటింగులు చేయకుండా సినిమాని వేగంగా పరుగులు పెట్టిస్తే మంచిది.

ఏది ఏమైనా, ఎన్టీఆర్ క్రేజ్ దృష్ట్యా సినిమా త్వరగా పూర్తి చేసి విడుదల చేస్తే అభిమానులకు ఊరట కలుగుతుంది. లేదంటే నిరీక్షణ మరింత భారంగా మారుతుంది. దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.