
📌 Key Points
- యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా డ్రాగన్ టీజర్ విడుదల!
- మే 19న టీజర్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న మేకర్స్!
- 30 సెకన్ల టీజర్ తో ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఇంటర్నేషనల్ లెవెల్లో తెరకెక్కుతున్న డ్రాగన్!
మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న డ్రాగన్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఇది నిజంగా పండగే.
ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ ట్రీట్!
Ntr: ఇంటర్నేషనల్ లెవల్లో ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురుచూపుల గురించి ఎంత చెప్పినా తక్కువే. చిన్న అప్డేట్ వచ్చిన చాలు అని కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. కానీ, దర్శకుడు ప్రశాంత్ నీల్ మాత్రం ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. ఎలాంటి న్యూస్ కూడా బయటకు రానివ్వడం లేదు.
30 సెకన్లలోనే రికార్డులు బ్రేక్!
ఈనేపథ్యంలోనే డ్రాగన్ సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే, ఇన్నాళ్లు ఒక్క అప్డేట్ కూడా ఇవ్వని మేకర్స్ ఇప్పుడు ఏకంగా డ్రాగన్ టీజర్ రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారట. అది కూడా ఒక ప్రత్యేకమైన రోజున. ఆ రోజు ఎన్టీఆర్(Ntr) ఫ్యాన్స్ కి పండుగ లాంటి రోజు. అదే ఎన్టీఆర్ పుట్టిన రోజు. అవును. 2026 ఎన్టీఆర్ బర్త్ డే సందర్బంగా డ్రాగన్ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారట.
ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్!
అయితే, ఎన్టీఆర్ బర్త్ డే మే 20 కి ఒకరోజు ముందే అంటే మే 19న డ్రాగన్ సినిమా టీజర్ రిలీజ్ చేయాలనీ చూస్తున్నారట. దీనికి సంబంధించి టీజర్ కట్టింగ్ పనులు కూడా ఇప్పటికే మోపడాలయ్యాయని సమాచారం. కేవలం 30 సెకన్ల పాటు ఉండే ఈ టీజర్ లో ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో ఉంటుందట. ఆ ఒక్క టీజర్ సినిమాపై అంచనాలను ఒక రేంజ్ లో పెంచానుందట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుంది అని తెలుస్తోంది. ఇక ఈ న్యూస్ తెలియడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ టీజర్ వచ్చాకా సోషల్ మీడియా రికార్డ్స్ ఒక్కటైనా మిగులుతాయా అనేది చూడాలి.
డ్రాగన్ టీజర్ విడుదల కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ టీజర్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


