|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

టూరిస్ట్ ఫ్యామిలీ: ప్రముఖుల నుండి ప్రశంసల జల్లు

Updated: 24-05-2025, 10:03 AM
టూరిస్ట్ ఫ్యామిలీ: ప్రముఖుల నుండి ప్రశంసల జల్లు

మే 01న విడుదలైన టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రం అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. రజనీకాంత్, శివకార్తికేయన్, ఎస్.ఎస్. రాజమౌళి, సూర్య వంటి ప్రముఖులు ఈ సినిమాను ప్రశంసించడం విశేషం.

Key Points

1

టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది.

2

రజనీకాంత్, శివకార్తికేయన్, ఎస్.ఎస్. రాజమౌళి, సూర్య వంటి ప్రముఖులు సినిమాను ప్రశంసించారు.

4

చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించింది.

సూపర్ హిట్ టూరిస్ట్ ఫ్యామిలీ

చిన్న సినిమాగా వ‌చ్చి పెద్ద‌ హిట్‌ను సొంతం చేసుకున్న మూవీ టూరిస్ట్ ఫ్యామిలీ. త‌మిళ న‌టులు శశికుమార్, సిమ్రాన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించ‌గా.. యోగి బాబు, మిథున్ జై శంకర్, కమలేష్ జెగన్ తదిత‌రులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. అభిషాన్ జీవింత్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రం మే 01న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి సూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా చూసిన ప్రేక్ష‌కులు చాలా బాగుందని ప్ర‌శంసిస్తున్నారు. ఇప్ప‌టికే సూప‌ర్ స్టార్‌ ర‌జ‌నీకాంత్‌, న‌టుడు శివ‌కార్తికేయ‌న్ ఈ సినిమా చూసి చిత్ర‌బృందాన్ని ప్ర‌త్యేకంగా పిలిపించుకుని అభినందించారు. అలాగే ద‌ర్శ‌క ధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి కూడా మూవీని ప్ర‌శంసిస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టు పెట్టారు. మంచి సినిమా అని, అంద‌రూ త‌ప్ప‌క చూడాల‌ని కోరారు. తాజాగా మ‌రో స్టార్ హీరో సూర్య సైతం టూరిస్ట్ ఫ్యామిలీ చిత్ర‌బృందంపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. తాజాగా ఆయ‌న మూవీ టీమ్‌ను క‌లిసి, వారితో ముచ్చ‌టించారు. ఈ విష‌యాన్ని తెలుపుతూ ద‌ర్శ‌కుడు అభిషాన్ ‘ఎక్స్’ (గ‌తంలో ట్విట్ట‌ర్‌) వేదిక‌గా పోస్టు పెట్టారు. “ఈ అనుభూతిని ఎలా వ‌ర్ణించాలో తెలియ‌డం లేదు. ఎప్ప‌ట్నుంచో ఉన్న బాధ ఇప్పుడు తీరిన‌ట్లు ఉంది. సూర్య న‌న్ను క‌లిశారు. మూవీ ఆయ‌న‌కు ఎంతో న‌చ్చిందని ప్ర‌శంసించారు. ‘సూర్య స‌న్నాఫ్ కృష్ణ‌న్’ సినిమా 100 సార్లు చూసిన నేను ఇప్పుడు భావోద్వేగాన్ని అదుపు చేసుకోలేక‌పోతున్నాను. ధ‌న్య‌వాదాలు సార్” అంటూ ట్వీట్ చేశారు.

ప్రముఖుల ప్రశంసలు

దర్శకుని ఆనందం

చిన్న బడ్జెట్ సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా, ప్రముఖుల ప్రశంసలతో మరింత ప్రజాదరణ పొందింది. ఇది చిన్న సినిమాలకు ప్రోత్సాహకంగా నిలుస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.