|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మెగాస్టార్ మూవీకి ఎన్టీఆర్ ఫిదా! ఆ సినిమా ఏదో తెలిస్తే షాక్ అవుతారు!

Published: 14-04-2026, 7:00 AM
మెగాస్టార్ మూవీకి ఎన్టీఆర్ ఫిదా! ఆ సినిమా ఏదో తెలిస్తే షాక్ అవుతారు!
  • మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మంత్రిగారి వియ్యంకుడు’ చిత్రాన్ని ఎన్టీఆర్ ఎంతగానో ఇష్టపడ్డారట – ఇది మెగా అభిమానులకు గర్వకారణం!
  • 1983లో విడుదలైన ఈ సినిమా సక్సెస్ మీట్‌కి ఎన్టీఆర్ స్వయంగా హాజరయ్యారు – బాపు దర్శకత్వం వహించడమే దీనికి కారణం!
  • చిరంజీవి తండ్రి కొణిదెల వెంకట్రావు గారు ఈ చిత్రంలో మంత్రి పాత్ర పోషించారు – తండ్రీ కొడుకులు కలిసి నటించిన ఏకైక చిత్రం ఇదే!
  • చిరంజీవి డాన్సులు, యాక్షన్ సీక్వెన్స్‌లలో చూపించే ప్రత్యేక శైలిని ఎన్టీఆర్ మెచ్చుకున్నారు – ఆరోజుల్లోనే స్వయంగా చెప్పారు!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. కానీ ఒక సినిమా మాత్రం నందమూరి తారక రామారావు గారి మనసు దోచుకుంది. ఆ సినిమా గురించిన వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఎన్టీఆర్ కి నచ్చిన సినిమా ఇదే!

ఎన్టీఆర్‌ సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నాక.. చిరంజీవి హీరోగా ఎదిగారు. ఆ సమయంలోనే బ్రేక్‌ అందుకుని స్టార్‌ అయిపోయారు. అనంతరం ఒక్కో విజయాన్ని అందుకుంటూ సూపర్‌ స్టార్‌గా, మెగాస్టార్‌గా ఎదిగారు. అయితే ప్రారంభంలో ఎన్టీఆర్‌, చిరంజీవి కలిసి ఒకే ఒక్క చిత్రంలో నటించారు. అదే `తిరుగులేని మనిషి`. ఇది యావరేజ్‌గానే ఆడింది. ఆ సమయంలో ఎన్టీఆర్‌ సూపర్‌ స్టార్‌ అయినా, చిరంజీవికి పెద్దగా ఇమేజ్‌ లేదు. దీంతో ఈ మూవీ పెద్దగా చర్చనీయాంశం కాలేదు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ రాజకీయ పార్టీ పెట్టి పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు.

ఇదిలా ఉంటే చిరంజీవితో ఎన్టీఆర్‌, ఎన్టీఆర్‌తో చిరంజీవి కలిసి ఎక్కువ సినిమాలు చేయకపోయినా మెగాస్టార్‌ యాక్టింగ్ ని రామారావు ఇష్టపడేవారు. ఆయన నటన, డాన్సులు, స్టయిల్‌, ఎనర్జీని చూసి ముచ్చటపడేవారట. ఈ క్రమంలో చిరంజీవి నటించిన చిత్రాల్లో అప్పట్లో రామారావు ఒక మూవీని ఎక్కువగా ఇష్టపడేవారట. అందులో చిరంజీవి నటనకు ఫిదా అయ్యారట. ముఖ్యంగా అందులో మెగాస్టార్‌ పోషించిన పాత్రకి ఆయన ముగ్దుడయ్యాడట. ఈ మూవీ చిరంజీవికి, మెగా ఫ్యామిలీకి కూడా చాలా స్పెషల్‌ కావడం విశేషం.

చిరంజీవికి స్పెషల్ మూవీ ఎందుకంటే?

ఎన్టీరామారావుకి ఇష్టమైన చిరంజీవి సినిమా ఏంటనేది చూస్తే, అది `మంత్రిగారి వియ్యంకుడు`. 1983లోనే ఈ సినిమా విడుదలయ్యింది. ఈ చిత్ర సక్సెస్‌ మీట్‌కి ఎన్టీఆర్‌ కూడా వచ్చారు. ఈ సినిమా ఎన్టీఆర్‌కి బాగా నచ్చడానికి కారణం దీనికి లెజెండరీ దర్శకుడు బాపు డైరెక్టర్‌ కావడం. బాపు శైలిని ఎంతో గౌరవించే ఎన్టీఆర్‌ ఈ మూవీలో చిరంజీవి పోషించిన బాబూజీ పాత్రను, ఆయనలోని చురుకుదనాన్ని చూసి ముచ్చటపడ్డారట. ముఖ్యంగా చిరంజీవి డాన్సులు, యాక్షన్‌ సీక్వెన్స్ ల్లో చూపే ఈజ్‌ ఎన్టీఆర్‌ని బాగా ఆకట్టుకున్నాయట. అందుకే ఈ సినిమా తన ఫేవరేట్‌ అని అప్పట్లోనే చెప్పారట.

మెగా ఫ్యామిలీకి గర్వకారణం!

`మంత్రిగారి వియ్యంకుడు` సినిమా చిరంజీవికి చాలా స్పెషల్‌. ఎందుకంటే ఇందులో ఆయన తన నాన్నతో కలిసి నటించారు. చిరంజీవి నాన్న కొణిదెల వెంకట్రారావు ఒక పోలీస్‌. ఆయనకు నాటకాలపై, నటనపై ఆసక్తి ఉండేది. కానీ తాను జాబ్‌ మానేస్తే ఫ్యామిలీ ఇబ్బందుల్లో పడుతుందని భావించి నటనని పక్కన పెట్టి పోలీస్‌ ఉద్యోగం చేశారు. మొదటగా ఆయన `జగత్‌ కిలాడీలు` అనే మూవీలో చిన్న పాత్రలో నటించారు. ఆ తర్వాత చిరంజీవి నటించిన `మంత్రిగారి వియ్యంకుడు` మూవీలో మంత్రి పాత్రని పోషించారు. చిరంజీవి, ఆయన తండ్రి కలిసి నటించి ఒకే ఒక్క మూవీ ఇదే. ఇందులో ఇద్దరి మధ్య సీన్లు లేకపోవడం గమనార్హం. ఇలా చిరంజీవి కెరీర్‌లో ఇది చాలా స్పెషల్‌ మూవీగా నిలిచిపోయిందని చెప్పొచ్చు. చిరంజీవి ప్రస్తుతం బాబీతో సినిమా చేయబోతున్నారు. త్వరలోనే ఇది ప్రారంభం కాబోతుంది. ఈ సంక్రాంతికి ఆయన `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీతో రీజనల్‌ ఫిల్మ్స్ లో ఇండస్ట్రీ హిట్‌ని అందుకున్న విషయం తెలిసిందే.

చిరంజీవి నటించిన ఈ సినిమా ఎన్టీఆర్ గారికి బాగా నచ్చడం నిజంగా మెగా అభిమానులకు ఒక పండుగ లాంటి వార్త. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.