|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఎన్టీఆర్ చేతుల్లో ఉన్న ఆ బుక్ ఏంటో తెలుసా? ముంబైలో ల్యాండైన మ్యాన్ ఆఫ్ మాసెస్.. ఆ సినిమాకు సిద్ధమవుతూ..

Published: 26-06-2025, 5:45 AM
ఎన్టీఆర్ చేతుల్లో ఉన్న ఆ బుక్ ఏంటో తెలుసా? ముంబైలో ల్యాండైన మ్యాన్ ఆఫ్ మాసెస్.. ఆ సినిమాకు సిద్ధమవుతూ..

జూనియర్ ఎన్టీఆర్ ముంబైకి వెళ్ళిన సమయంలో అతని చేతిలో ‘మురుగ ది గాడ్ ఆఫ్ వార్’ అనే పుస్తకం కనిపించింది. ఇది త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోయే మైథలాజికల్ సినిమాకు సంబంధించినదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Key Points

1

ఎన్టీఆర్ ముంబైలో ల్యాండయ్యాడు.

2

అతని చేతిలో 'మురుగ ది గాడ్ ఆఫ్ వార్' పుస్తకం కనిపించింది.

4

వార్ 2 సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది.

ముంబైలో ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2 కోసం బిజీగా ఉన్నాడు. ఓవైపు ప్రశాంత్ నీల్ తో మూవీ చేస్తూనే.. ఆగస్ట్ 15న రిలీజ్ కానున్న వార్ 2 పనుల్లోనూ నిమగ్నమయ్యాడు. ఈ క్రమంలో అతడు గురువారం (జూన్ 26) ముంబైలో ల్యాండవడం, ఆ సమయంలో అతని చేతుల్లో ఒక బుక్ కనిపించడం విశేషం.

జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీ తర్వాత వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఓవైపు వార్ 2, మరోవైపు ప్రశాంత్ నీల్ తో భారీ బడ్జెట్ మూవీ కొనసాగుతుండగానే.. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ మైథలాజికల్ మూవీ చేయబోతున్నట్లు కూడా కన్ఫమ్ అయింది. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రొడ్యూసర్ నాగవంశీ వెల్లడించాడు. ఇప్పుడా సినిమా కోసమే ఎన్టీఆర్ సిద్ధమవుతున్నట్లు అతని చేతుల్లో ఉన్న పుస్తకం చూస్తే తెలుస్తోంది.

చేతిలో ఉన్న పుస్తకం

అతడు పట్టుకున్న ఆ బుక్ పేరు మురుగ ది గాడ్ ఆఫ్ వార్ ది గాడ్ ఆఫ్ విజ్డమ్. ఆనంద్ బాలసుబ్రమణియన్ రాసిన బుక్ ఇది. ఇప్పుడు త్రివిక్రమ్ సుబ్రమణ్యస్వామిపై ఓ భారీ బడ్జెట్ మైథలాజికల్ మూవీ తీయబోతున్న నేపథ్యంలో దానికి ముందే మురుగన్ స్టోరీ తెలుసుకోవడానికి ఎన్టీఆర్ ఈ బుక్ చదువుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కోసం ఓ పుస్తకాన్ని ఆధారంగా తీసుకోబోతున్నట్లు తెలిసింది. ఆ పుస్తకం ఇదేనా అన్న సందేహాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందించబోతున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీప్రొడక్షన్ పనులు నడుస్తున్నాయి. మొదట అల్లు అర్జున్ తో అనుకున్నా.. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో ఈ మూవీని కన్ఫమ్ చేశారు.

త్రివిక్రమ్ సినిమా సన్నాహాలు

ఇక ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ వార్ 2 కోసం సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా ఆగస్ట్ 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. హిందీతోపాటు తెలుగు, తమిళంలలోనూ ఈ మూవీ రానుంది. ఈ సినిమాతోనే తారక్ బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడు. ఇందులో అతనిది నెగటివ్ రోల్ కావడం విశేషం. లీడ్ రోల్లో హృతిక్ రోషన్ నటిస్తున్నాడు.

ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాల కోసం సన్నద్ధమవుతున్నాడు. వార్ 2 సినిమా త్వరలో విడుదల కానుండగా, త్రివిక్రమ్ సినిమా ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ రెండు ప్రాజెక్టుల విజయం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.