
జూనియర్ ఎన్టీఆర్ చేతిలో ‘మురుగ’ పుస్తకం కనిపించడంతో త్రివిక్రమ్‌తో ఆయన చేయబోయే మైథాలజీ సినిమా గురించి చర్చ జోరందుకుంది. కార్తికేయుడి పాత్రలో ఎన్టీఆర్ నటించే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.
Key Points
జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలోని మైథాలజీ సినిమా కోసం సన్నద్ధమవుతున్నారు.
ముంబైలో ఆయన చేతిలో 'మురుగ' పుస్తకం కనిపించడం ఈ వార్తలకు బలాన్ని చేకూర్చుతోంది.
కార్తికేయుడి పాత్రలో ఎన్టీఆర్ నటించే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.
కల్యాణ్ రామ్, సూర్యదేవర రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్స్
వెండితెరపై కార్తికేయుడిగా జూనియర్ ఎన్టీఆర్ కనిపించనున్నారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మరో చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మైథాలజీ సినిమాలోనే కార్తికేయుడిగా ఎన్టీఆర్ కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ వార్త నిజమయ్యేలా ఉంది. ఎందుకంటే ‘వార్ 2’ సినిమా వర్క్స్‌లో భాగంగా ముంబై ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిన ఎన్టీఆర్ చేతిలో ‘మురుగ’ (కార్తికేయుడు) పుస్తకం కనిపించింది.
‘మురుగ’ పుస్తకం: కార్తికేయుడు పాత్ర?
అందుకోసమే ఈ ప్రిపరేషన్ దీంతో త్రివిక్రమ్‌తో చేయబోయే మైథాలజీ సినిమాకు ఎన్టీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని, ఇందులో భాగంగానే మురుగ పుస్తకం చదువుతున్నారని ఆయన ఫ్యాన్స్ హ్యాపీ ఫీలవుతున్నారు. ఈ సినిమాను కల్యాణ్‌రామ్, సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించనున్నారనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో ‘డ్రాగన్’ సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. కొరటాల శివతో ‘దేవర 2’ కమిట్ అయ్యారు. తమిళ దర్శకుడు నెల్సన్‌తో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తారని టాక్. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్ చేయబోయే సినిమా చిత్రీకరణ ఎప్పుడు మొదలవుతుందనే చర్చ జరుగుతోంది. ఈ కాంబినేషన్ గురించి కూడా అధికారక ప్రకటన రావాల్సి ఉంది.
సినిమా విడుదల తేదీ, నిర్మాతలు
ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నా, త్రివిక్రమ్ సినిమాపై అభిమానుల ఆసక్తి అధికంగా ఉంది. ఈ సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.


