|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ఎన్టీఆర్ ప్రేమించిన హీరోయిన్‌ను పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇదేనా? వైరల్ న్యూస్!

Published: 23-03-2026, 11:05 PM
షాకింగ్: ఎన్టీఆర్ ప్రేమించిన హీరోయిన్‌ను పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇదేనా? వైరల్ న్యూస్!
  • యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ ఆరంభంలోనే ‘ఆది’, ‘సింహాద్రి’ వంటి బ్లాక్ బస్టర్ విజయాలు.
  • సమీరా రెడ్డితో ఎన్టీఆర్ ప్రేమ వ్యవహారం అప్పట్లో టాలీవుడ్ మీడియాలో సంచలనం.
  • 23 ఏళ్ల వయసులో ప్రేమ, ఆకర్షణ సహజమని ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు.
  • ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్ వేర్వేరుగా ఉండాలని తారక్ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఒక సంచలన విషయం బయటకు వచ్చింది. ఎన్టీఆర్ ఒకప్పుడు హీరోయిన్ సమీరా రెడ్డితో ప్రేమలో ఉన్నారట. కానీ వారి ప్రేమ పెళ్లి వరకు ఎందుకు వెళ్లలేదు? తెలుసుకుందాం రండి!

సమీరా రెడ్డితో ఎన్టీఆర్ ప్రేమాయణం.. అసలు నిజం!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస పాన్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం తారక్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. కెరీర్ బిగినింగ్ లోనే తారక్ ఆది, సింహాద్రి లాంటి సూపర్ హిట్ సినిమాలతో స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ కి వరుస ప్లాపులు మొదలయ్యాయి.

ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మాట్లాడుతూ తన లవ్ స్టోరీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నరసింహుడు చిత్రంలో ఎన్టీఆర్.. సమీరా రెడ్డితో కలసి నటించారు. ఆ చిత్ర షూటింగ్ సమయంలో ఎన్టీఆర్, సమీరా రెడ్డి మధ్య ప్రేమ చిగురించినట్లు అప్పట్లో మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

ప్రేమను వదులుకున్నందుకు ఎన్టీఆర్ రిగ్రెట్ అయ్యారా?

చాలా కాలం పాటు ఈ రూమర్స్ కొనసాగాయి. సినిమా ఫీల్డ్ అంటేనే ఆకర్షణ ఎక్కువ. మీరు ఎవరి పట్ల అయినా ఆకర్షణకు గురయ్యారా ? ప్రేమలో పడ్డారా అని ప్రశ్నించగా ఎన్టీఆర్ బదులిచ్చారు. నా లవ్ స్టోరీ గురించి మీడియా వాళ్లే బాగా పబ్లిసిటీ చేశారు కదా. అది ఎవరో మీకు తెలుసు అని అన్నారు. పరోక్షంగా సమీరా రెడ్డి గురించి తెలిపారు.

ఆ టైంలో నా వయసు 23 ఏళ్ళు మాత్రమే. ఒకరి పట్ల ఇష్టం కలగడం, ఆకర్షణకు గురి కావడం సహజమే. అది నా కెరీర్ లో పాసింగ్ ఫేజ్. ఇది నిజమైన ప్రేమ కాదేమో అని త్వరగానే రియలైజ్ అయ్యాను. అలా ఆ సమయం గడిచిపోయింది. ప్రేమని వదులుకున్నందుకు ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారా అని అడగగా.. నా జీవితంలో నేను తీసుకున్న ఏ డెసిషన్ కి కూడా రిగ్రెట్ ఫీల్ కాలేదు అని ఎన్టీఆర్ అన్నారు.

ప్రొఫెషనల్ లైఫ్ పై తారక్ ఆసక్తికర వ్యాఖ్యలు!

అలా ఒకరిపై ఆకర్షణకు గురైనప్పుడు నాకు పూర్తిగా అర్థం కాలేదు. ఆ తర్వాత ప్రొఫెషనల్ లైఫ్ ని, పర్సనల్ లైఫ్ ని మిక్స్ చేయకూడదు.. వేర్వేరుగానే చూడాలి అని రియలైజ్ అయ్యాను అని తారక్ తెలిపారు.

ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.