|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హేమ, సురేఖ వాణి కల్లు పార్టీ: ఊహించని వీడియోతో ఒక్కసారిగా షాక్!

Published: 17-03-2026, 2:05 PM
హేమ, సురేఖ వాణి కల్లు పార్టీ: ఊహించని వీడియోతో ఒక్కసారిగా షాక్!
  • హేమ, సురేఖ వాణి కల్లు తాగుతూ సందడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్.
  • సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో స్నేహితులతో కలిసి పల్లెటూరి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్న హేమ, సురేఖ వాణి.
  • నెటిజన్లు వారి వీడియోపై ఫన్నీ కామెంట్స్, మీమ్స్ ద్వారా స్పందిస్తున్నారు.
  • సురేఖ వాణి తన కూతురితో డ్యాన్స్ వీడియోలు, హేమ కాంట్రవర్సీలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.

టాలీవుడ్ నటీమణులు హేమ మరియు సురేఖ వాణి కల్లు తాగుతూ సందడి చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరు తమ స్నేహితులతో కలిసి పల్లెటూరి వాతావరణంలో ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

వైరల్ అవుతున్న కల్లు వీడియో

Hema and Surekha Vani: టాలీవుడ్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులు హేమ (Hema), సురేఖ వాణి (Surekha Vani) అంటే తెలియని వారుండరు. వెండితెరపై అక్కగా, వదినగా, తల్లిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన వీరు.. నిజజీవితంలో కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనే విషయం తెలిసిందే. తాజాగా వీరిద్దరూ కలిసి గ్రామీణ వాతావరణంలో ప్రకృతి ఒడిలో ఎంజాయ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. షూటింగ్‌లతో ఎప్పుడూ బిజీగా ఉండే వీరికి.. ఈ మధ్య అనుకున్నంతగా అవకాశాలు అయితే రావడం లేదు. కానీ, ఈ ఖాళీ టైమ్‌లో లైఫ్‌ని మాత్రం చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ల బిజీ లైఫ్ నుంచి కాస్త విరామం తీసుకున్న ఈ ఇద్దరు భామలు, తమ స్నేహితులతో కలిసి పల్లెటూరి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు.

ఈ క్రమంలో వీరికి (Hema and Surekha Vani) సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో హేమ, సురేఖ వాణిలు స్వయంగా ఒక ఈత చెట్టు వద్దకు వెళ్లి, అక్కడ ఈత చెట్టుకు ఉన్న కల్లు కుండని తప్పించి, ఆ కుండ నుంచి కల్లును గ్లాసుల్లో పోసుకుని, ఒకరికొకరు చియర్స్ చెప్పుకుంటూ చాలా సరదాగా గడిపారు. సాధారణంగా సినిమాల్లో పద్ధతిగా కనిపించే వీరు, ఇలా బయట మాస్ స్టైల్‌లో కల్లు తాగుతూ కనిపించడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. దీనికి నెటిజన్లు ఆసక్తికరంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల ఓ ఈవెంట్‌లో హేమ మాట్లాడుతూ.. ఇంత మంది కోతులం ఉన్నామనే పదం వాడిన విషయం తెలిసిందే. ఇప్పుడు నెటిజన్లు కూడా ‘అసలే కోతులు.. ఆ పైన కల్లు తాగారు.. ఇక చూడాలి వీళ్ల రాద్ధాంతం’ అనేలా పాత సామెతను గుర్తు చేసుకుంటున్నారు. ‘ఏది ఏమైనా పల్లెటూరి మజానే వేరు..’ అంటూ ఈ వీడియోపై రకరకాల కామెంట్లు వస్తున్నాయి.

పల్లెటూరి వాతావరణంలో హేమ, సురేఖ వాణి

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సురేఖ వాణి, తరచుగా తన కూతురితో కలిసి డ్యాన్స్ వీడియోలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. మరోవైపు హేమ కూడా తనదైన శైలిలో ఏదో ఒక కాంట్రవర్సీలో నిలుస్తూ.. నిత్యం వార్తలలో కనిపిస్తూనే ఉంటారు. ఇద్దరికీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. ఇక వైరల్ అవుతున్న ఈ వీడియోలో వీరు చూపిస్తున్న ఎనర్జీ, వారి మధ్య ఉన్న స్నేహం చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కల్లు తాగడం తప్పేం కాదు. అందులోనూ ఎండాకాలం అందరూ ఇష్టపడుతుంటారు. దీనికి వారిపై ఏదేదో ఊహించేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ, రేపు ఇవన్నీ కామన్. కాబట్టి, ఓ వారి గురించి నెగిటివ్‌గా ఆలోచించకుండా.. ఇందులో వారిద్దరూ ఎంత ఆనందంగా ఉన్నారో.. దానిని ఎంజాయ్ చేస్తే బెటర్.

తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా గుర్తింపు పొందిన హేమ, సురేఖవాణి ప్రకృతి ఒడిలో సందడి చేస్తున్నారు. తాజాగా వీరిద్దరూ తమ స్నేహితులతో కలిసి గ్రామీణ వాతావరణంలో హాలిడే ఎంజాయ్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో వారు ఈత చెట్టు వద్ద ఈతకల్లు తాగుతూ..… pic.twitter.com/GpBiw6G7GD

నెటిజన్ల స్పందనలు, కామెంట్లు

— ChotaNews App (@ChotaNewsApp) March 17, 2026

మొత్తానికి హేమ, సురేఖ వాణి కల్లు తాగుతూ చేసిన సందడి వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. వారి అభిమానులు ఈ వీడియోపై తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం ట్రెండింగ్‌లో ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.