
📌 Key Points
- ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్‌కు ఎన్టీఆర్ అనారోగ్యం కారణంగా బ్రేక్ పడింది.
- రామోజీ ఫిల్మ్ సిటీలో రాత్రిపూట షూటింగ్ జరుగుతుండగా ఎన్టీఆర్ జలుబుతో బాధపడుతున్నారు.
- షూటింగ్ త్వరగా పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారు, ఎన్టీఆర్ కోలుకున్న వెంటనే నైట్ సీన్స్ పూర్తి చేస్తారు.
- ముందు కూడా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ బ్రేక్ పడింది.
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమాకు మరోసారి బ్రేక్ పడింది. ఎన్టీఆర్ జలుబుతో బాధపడుతుండటంతో షూటింగ్ నిలిపివేశారు. దీనికి ముందు కూడా కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆగిపోయింది.
షూటింగ్‌కు బ్రేక్ ఎందుకు?
NTR – Neel : గ్లోబల్ స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం భారీ ప్రాజెక్టులలో నటిస్తూ వస్తున్నాడు. చివరగా వార్ 2 మూవీతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఆ మూవీ టాక్ ఎలా ఉన్నా సరే కలెక్షన్లు మాత్రం భారీగానే వసూల్ అయ్యాయి. ప్రస్తుతం యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ మూవీ గురించి ప్రకటించినప్పటి నుంచి రోజురోజుకీ అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాని ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూస్తామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఈ మూవీ షూటింగ్ కి కొన్ని కారణాల బ్రేక్ వచ్చిన విషయం తెలిసిందే. మళ్లీ తిరిగి సెట్స్ మీదకి వెళ్ళిన సినిమాకు మరోసారి బ్రేక్ పడింది.. ఈసారి ఎన్టీఆర్ వల్లే షూటింగ్ కు బ్రేక్ పడిందని తెలుస్తుంది. అసలేం జరిగింది ఎందుకు సినిమాకు మరోసారి బ్రేక్ పడింది అన్నది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
ఎన్టీఆర్ – నీల్ మూవీకి మరోసారి బ్రేక్ పడింది.. అవును మీరు విన్నది అక్షరాలా నిజమే.. ఈ సినిమా షూటింగ్ మరోసారి ఆగిపోయింది. అందుకు కారణం ఎన్టీఆర్ అని సినీ వర్గాల్లో ఓ వార్త ప్రచారంలో ఉంది. అసలు ఏం జరిగింది అంటే.. ఎన్టీఆర్ తీవ్రమైన జలుబుతో ఇబ్బంది పడుతున్నాడట. అందుకే ప్రశాంత్ నీల్ చిత్ర షూటింగ్‌కు చిన్న బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఈ తాజా షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది.. ఈ షూటింగ్ కేవలం రాత్రిపూట జరుగుతుందని తెలుస్తుంది. రాత్రి చలి తీవ్రత ఎక్కువగా ఉంది. అందుకే షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.. ఎన్టీఆర్ మళ్లీ సెట్స్ లోకి ఎంట్రీ ఇవ్వగానే త్వరగా నైట్ సీన్స్ పూర్తి చెయ్యనున్నారని సమాచారం..
ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితి
చిత్ర యూనిట్ ప్రయత్నాలు
భారీ యాక్షన్ స్టోరీతో రాబోతున్న ఈ మూవీలో ఎన్టీఆర్ ఎలా కనిపిస్తాడో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు తమ హీరోని స్క్రీన్ మీద చూస్తామని ఆశ పడుతున్నారు.. అయితే కొన్ని రోజుల క్రితం కొన్ని కారణాలవల్ల షూటింగ్ కి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. మళ్లీ షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఇక త్వరగా పూర్తి చేసి థియేటర్లలోకి వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో మరోసారి షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇలా బ్రేక్ పడుతుంటే రిలీజ్ అవ్వడం కష్టమని అభిమానులు ఫీల్ అవుతున్నారు. మొదట 2026 జనవరి 26న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని ప్రకటించినా.. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ఇందులో బాలీవుడ్ యాక్టర్ అనిల్ కపూర్ ఓ కీలక పాత్రలో నటిస్తుండగా అందాల భామ రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.
ఎన్టీఆర్ త్వరగా కోలుకుని షూటింగ్‌లో పాల్గొనాలని అభిమానులు కోరుకుంటున్నారు. సినిమా విడుదల ఎప్పుడు ఉంటుందో వేచి చూడాలి. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.


