|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వందమంది ఫైటర్లతో ప్రశాంత్ నీల్ యాక్షన్ ట్రీట్!

Published: 08-01-2026, 10:30 PM
వందమంది ఫైటర్లతో ప్రశాంత్ నీల్ యాక్షన్ ట్రీట్!
  • ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో భారీ యాక్షన్ సీక్వెన్స్!
  • వందమంది ఫైటర్లతో హైదరాబాద్ ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్ పూర్తి!
  • 1969 బ్యాక్‌డ్రాప్‌లో చైనా, భూటాన్, ఇండియా సరిహద్దుల కథ!
  • జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా ‘డ్రాగన్’ విడుదల!

ఎన్టీఆర్ అభిమానులకు ఇది నిజంగా గుడ్ న్యూస్! ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘డ్రాగన్’. ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆర్‌ఎఫ్‌సీలో భారీ ఫైట్ సీన్!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌(Prashanth Neel)తో ‘డ్రాగన్’(వర్కింగ్ టైటిల్) అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో యంగ్ బ్యూటీ రుక్మిణి వసంత్(Rukmini Vasanth) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని భారీ నిర్మాణాల సంస్థ మైత్రీ మూవీమేకర్స్‌ నిర్మిస్తున్నది. అయితే ఎన్టీఆర్ ఈ మూవీ కోసం చాలా సన్నగా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

1969 బ్యాక్‌డ్రాప్‌లో చిత్రం!

ఇక షూటింగ్ విషయానికి వస్తే.. ఇప్పటి వరకు కర్ణాటకలోనూ విదేశాల్లోనూ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతం భాగ్యనగరంలో చిత్రీకరణ జరుగుతుంది. 1969 కాలంలో చైనా, బూటాన్‌, ఇండియా సరిహద్దు ప్రాంతాల నేపథ్యంలో ఈ కథ సాగుతుందట. ఈ క్రమంలో ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

జూన్ 25న విడుదల!

రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌ ఆర్‌ఎఫ్‌సీలో గుట్టుచప్పుడు కాకుండా జరిగిందని టాక్‌. ఈ షెడ్యూల్‌ కోసం ఓ భారీ ఫారెస్ట్‌ సెట్‌ని నిర్మించి, వందమంది ఫైటర్లతో ఆ సెట్‌లోనే యాక్షన్‌ సన్నివేశాలను ప్రశాంత్‌నీల్‌ చిత్రీకరించారని వినికిడి. దీంతో ఫ్యాన్స్ ఈసారి ఎన్టీఆర్ భీభత్సం చూస్తాము కావచ్చు అని అంటున్నారు. కాగా ఈ ఏడాది జూన్‌ 25న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు సమాచారం.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.