
నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్ అద్వితీయ వ్యక్తిత్వం ప్రజలను ఆకట్టుకుంది. ఆయన కార్యకర్తలు ఆయన కాళ్లు మొక్కడం వెనుక ఉన్న కథ ఇప్పుడు తెలియజేద్దాం. రామారావుగారి ఆలోచనలు నిజంగా ఆశ్చర్యపరుస్తాయి.
Key Points
ఎన్టీఆర్ కార్యకర్తలు ఆయన కాళ్లు మొక్కడం వెనుక ఆసక్తికరమైన కారణం ఉంది.
రామారావు తన కార్యకర్తలను, నాయకులను అంచనా వేయడానికి ఈ పద్ధతిని ఉపయోగించేవారు.
స్వచ్ఛందంగా కాళ్లు మొక్కేవారు నిజమైన అభిమానులు అని ఆయన నమ్మేవారు.
ఈ వినూత్నమైన విధానం రాధాకృష్ణను ఆశ్చర్యపరిచింది.
ఎన్టీఆర్: నటుడిగా, రాజకీయ నాయకుడిగా
ఎన్టీఆర్ లెజెండరీ నటుడిగా రాణించారు. నటుడిగా ఆయన విశ్వరూపం చూపించారు. పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేయడం, రక్తికట్టించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.
సరదా పాత్ర అయినా, యాక్షన్ రోల్ అయినా, పౌరాణికమైనా, జానపద పాత్ర అయినా రక్తికట్టించారు. ఇంకా చెప్పాలంటే పాత్ర ఆయనకు బానిస అయిపోయింది. తెలుగు ప్రజలు ఆయన్ని రాముడిగా, కృష్ణుడిగా పూజించారు.
ఆ తర్వాత రాజకీయాల్లోనూ అదే స్థాయిలో సక్సెస్ అయ్యారు రామారావు. అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించి జనం గుండెల్లో నిలిచిపోయారు.
రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేసిన మొదటి దశలోనే ఆయన విజయం సాధించారు. సీఎం అయ్యారు. అయితే రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. అందులోనూ తన డామినేషన్ చూపించారు రామారావు.
ఈ క్రమంలో సీఎంగా, పొలిటికల్ లీడర్‌గా ఆయన ఒక కల్చర్‌ని పాటించారు. తన కార్యకర్తలతో కాళ్లు మొక్కించుకున్నారు. అప్పట్లో ఇది పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యింది.
కాళ్లు మొక్కడం: ఒక ఆచారమా? ఒక వ్యూహమా?
ఎన్టీఆర్.. కాళ్లు మొక్కించుకునే కల్చర్ వెనుక ఒక స్ట్రాటజీ ఉందట. దాని వెనుక ఒక బలమైన కారణం ఉందట. ఈ విషయాన్ని ఏబీఎన్ ఛైర్మెన్ రాధాకృష్ణ తెలిపారు.
రామారావు సీఎంగా ఉన్న సమయంలో ఎక్కడ మీటింగ్‌లు జరిగినా కార్యకర్తలు స్టేజ్‌పైకి వచ్చి రామారావు కాళ్లకి దెండం పెట్టుకుని వెళ్లేవారట.
అంతేకాదు కార్యకర్తలు, లీడర్లు కాళ్లు మొక్కుతుంటే ఆయన ఎదురుగా ఉండే ఇతర లీడర్లని చూసేవారట. ఆయన చూస్తున్నారని చెప్పి చాలా మంది వచ్చి రామారావు కాళ్లు మొక్కేవారట.
ఇది చూసిన రాధాకృష్ణ ఓ సారి ఆయన్ని ప్రశ్నించారు. సీఎంగా దిగిపోయినప్పుడు ఆయన్ని కలిసిన సందర్భంలో ఈ విషయాన్ని ప్రశ్నించారట. ఎందుకు ఈ కల్చర్‌ని పాటిస్తున్నారు , అది మీకు ఎఫెక్ట్ అవుతుంది కదా అని అడగ్గా,
ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ, అలా చేయడానికి బలమైన కారణం ఉంది. ఎవరికి వారు స్వతహాగా నా కాళ్లు మొక్కేవాళ్లు, నన్ను అభిమానించేవారు,
రామారావు లాజిక్: ఆశ్చర్యకరమైన వివరణ
నేను చూస్తున్నానని చెప్పి వచ్చిన వారు దొంగలు. నేను చూసినా రాని వాడు నిజమైన నాయకుడు అని భావించేవారట. ఆ లెక్కన కార్యకర్తలను, లీడర్లని అంచనా వేసేవారట రామారావు.
ఈ లాజిక్ విని రాధాకృష్ణకి మతిపోయింది. ఈ విషయాన్ని రాధాకృష్ణ.. నటుడు శరత్ కుమార్ ని ఇంటర్వ్యూ చేసే సమయంలో తెలిపారు. తమిళనాడు రాజకీయాల్లో ఈ కల్చర్ ఎక్కువగా ఉండేది, దాన్ని రామారావు ఇక్కడ కూడా పాటించారని చెబుతూ, ఈ సంఘటన పంచుకున్నారు ఆర్కే.
ఎన్టీఆర్ నాటకాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుని సినిమాల్లోకి వెళ్లారు. 1949లో `మనదేశం` చిత్రంతో నటుడిగా మారారు. ఆ తర్వాత హీరోగా ఎదిగారు. స్టార్ హీరోగా రాణించారు.
కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే తెలుగు దేశం పార్టీని స్థాపించి 1983లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి సీఎం అయ్యారు. మూడుసార్లు సీఎంగా గెెలుపొందారు. ఆయన చేసిన కొన్ని మిస్టేక్స్ తోపాటు, తన వాళ్ల కుట్రలకు బలయ్యారు.
చివరగా, ఎన్టీఆర్ రాజకీయ జీవితంలోని ఈ అరుదైన అంశం, ఆయన వ్యక్తిత్వం, రాజకీయ జాగ్రత్తలను తెలియజేస్తుంది. ఆయన లాజిక్ చాలా ఆసక్తికరంగా ఉంది.


