|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

NTR: షాకింగ్ లుక్ లో ఎన్టీఆర్! ప్రశాంత్ నీల్ మూవీ కోసం ఊహించని ట్రాన్స్‌ఫార్మేషన్!

Published: 21-03-2026, 10:05 PM
NTR: షాకింగ్ లుక్ లో ఎన్టీఆర్! ప్రశాంత్ నీల్ మూవీ కోసం ఊహించని ట్రాన్స్‌ఫార్మేషన్!
  • NTR కొత్త సినిమా కోసం బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్: షాకింగ్‌గా సన్నబడ్డారు!
  • ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్.. హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా!
  • 7 వారాల్లో 10 కేజీల బరువు తగ్గిన ఎన్టీఆర్: ఫ్యాన్స్ ఆశ్చర్యం!
  • వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు డ్రాగన్.. భారీ అంచనాలు!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం ‘డ్రాగన్’ కోసం సరికొత్తగా సిద్ధమవుతున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తన శరీరాకృతిని మార్చుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

డ్రాగన్ కోసం ఎన్టీఆర్ కఠిన శిక్షణ!

Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ డ్రాగన్. కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో లేటెస్ట్ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. కేజీఎఫ్, సాలార్ లాంటి బ్లాక్ బస్టర్స్ తరువాత దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమా కావడంతో డ్రాగన్ పై అంచనాలు ఒక రేంజ్ లో నెలకొన్నాయి. అయితే, ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడట. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తన బాడీని పూర్తిగా మార్చేశారు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ యాక్షన్ డ్రామా!

ఇటీవల ఎయిర్‌పోర్టులలో, యాడ్ షూటింగ్స్‌లో తారక్‌(Ntr)ను చూసిన సామాన్య ప్రేక్షకులు, అభిమానులు ఆయన లుక్ చూసి ఒక్కసారిగా అశ్చర్యపోయారు. ఆయన మునుపటి కంటే చాలా సన్నగా కనిపించడంతో కొందరు ఆందోళన కూడా వ్యక్తం చేశారు. అయితే, ఈ మార్పు వెనుక ఒక బలమైన కారణం ఉంది. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాలో పాత్ర డిమాండ్ మేరకు ఎన్టీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తన పాత్రకు తగ్గట్టుగా మరింత లీన్‌గా ఉండాలని దర్శకుడు కోరడంతో, తారక్ తన ఫిట్‌నెస్ టీమ్‌తో కలిసి కఠినమైన శిక్షణ తీసుకున్నారట.

ఎన్టీఆర్ డెడికేషన్‌కు ఫ్యాన్స్ ఫిదా!

రోజుకు సుమారు 90 నిమిషాల ఫంక్షనల్ ట్రైనింగ్ చేస్తూ, పక్కాగా డైట్ కంట్రోల్ పాటిస్తూ కేవలం ఏడు వారాల సమయంలోనే ఏకంగా 10 కేజీల వరకు బరువు తగ్గారట. ఈ విషయం గురించి ఎన్టీఆర్ ట్రైనింగ్ టీమ్ అధికారికంగా తెలిపింది. దీంతో, ఈ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఒక సినిమా కోసం ఎన్టీఆర్ పడుతున్న శ్రమ చూసి ఆయన ఫ్యాన్స్ ఆననందం వ్యక్తం చేస్తున్నారు. సినిమా పట్ల ఆయనకు ఉన్న డెడికేషన్ కి హ్యాట్సాఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

ఎన్టీఆర్ సినిమా కోసం ఇంతలా కష్టపడుతున్నాడంటే సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.