
📌 Key Points
- NTR x త్రివిక్రమ్ ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్ట్‌కు భారీ వివాదం. తమిళ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ రచ్చ.
- కుమార స్వామిని ఉత్తరాది దైవంగా చూపడంపై తమిళ తంబీల అభ్యంతరం. నాగవంశీ పోస్ట్ కారణం.
- సీమాన్ సీరియస్ వార్నింగ్: సినిమా ఆపకపోతే ఆందోళనలు, తమిళనాట ప్రదర్శన నిలిపివేత.
- పోస్టర్ రిలీజ్ నుండి వివాదం.. ఇప్పుడు సీమాన్ వ్యాఖ్యలతో మళ్లీ తెరపైకి. ఉత్కంఠ.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘గాడ్ ఆఫ్ వార్’ ఇప్పుడు ఊహించని వివాదంలో చిక్కుకుంది. సినిమా సెట్స్ పైకి వెళ్లకుండానే, తమిళనాట పెద్ద ఎత్తున రచ్చ మొదలైంది. అసలేం జరిగిందో తెలుసుకుందాం!
‘గాడ్ ఆఫ్ వార్’ వివాదం ఎందుకు?
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఇటీవలే ఓ భారీ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘NTR x Trivikram’ అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘అరవింద సమేత వీర రాఘవ’ తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ ప్రాజెక్ట్ పై అందరిలో అంచనాలు నెలకొన్నాయి. యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఈ కాంబినేషన్ పట్ల ఎంతో హ్యాపీగా ఉన్నారు. అయితే ఇంకా సెట్స్ మీదకు వెళ్లకముందే ఈ చిత్రంపై వివాదం చెలరేగింది. ‘ఎన్టీఆర్ – త్రివిక్రమ్’ సినిమాకి ‘గాడ్ ఆఫ్ వార్’ అనే పేరు ప్రచారంలో ఉంది. కుమార స్వామి, సుబ్రమణ్య స్వామి, మురుగన్ ఇలా అనేక పేర్లతో పిలవబడే శివపార్వతీ దేవి కుమారుడు కార్తికేయుడు కథతో ఈ చిత్రం తెరకెక్కనుందని టాక్ వినిపిస్తోంది. కథ ఇదో కాదో తెలియదు, ఇంకా షూటింగ్ మొదలు కాలేదు.. కేవలం ఒక్క పోస్టర్ తో ఈ చిత్రంపై తమిళ తంబీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తమిళుల మనోభావాలను కించపరిచే ఈ సినిమాని ఆపేయాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీనికి కారణం నిర్మాత నాగవంశీ చేసిన ఓ పోస్ట్ అని తెలుస్తోంది. తారక్ – త్రివిక్రమ్ సినిమా అనౌన్స్ మెంట్ సందర్భంగా నాగవంశీ తన పోస్టులో “ఉత్తరాదిన జన్మించాడు. నడిగడ్డపై రాటుదేలాడు. దక్షిణాదిన పూజించబడుతున్నాడు. ఇప్పుడు విశ్వవ్యాప్తం కాబోతున్న ఒక మహా అద్భుత గాథ” అని రాసుకొచ్చారు. ఇక్కడ ఆయన మురుగన్ నార్త్ లో పుట్టాడని పోస్టు చేశాడంటూ తమిళులు రచ్చ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వివాదంలోకి రాజకీయ పార్టీలు కూడా ఎంటర్ అయ్యాయి. తాజాగా తమిళ నటుడు, NTK పార్టీ అధినేత సీమాన్ ఈ మూవీపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళ ప్రజల ఇష్ట దైవం మురుగన్ సుబ్రహ్మణ్యంను ఉత్తరాంద్ర దేవుడుగా చూపడం సరికాదని సీమాన్ అన్నారు. సుబ్రహ్మణ్యస్వామి తమిళనాడు దైవమని, అందుకు ఆధారాలు కూడా ఉన్నాయని, తమిళుల మనోభావాలు దెబ్బ తీస్తే చూస్తూ ఊరుకునేదే లేదని ఆయన హెచ్చరించారు. వెంటనే ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమాను ఆపేయకపోతే ఆందోళనలు ఉదృతం చేస్తామని సీమాన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అలాంటి చిత్రాలను తమ రాష్ట్రంలో ప్రదర్శించబోమని షాకింగ్ కామెంట్స్ చేశారు. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడే, కొన్ని తమిళ హ్యాండిల్స్ నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ఆ తర్వాత అందరూ సైలెంట్ అయ్యారు. మళ్లీ ఇప్పుడు సీమాన్ వ్యాఖ్యలతో మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది. అయినా ఒక్క సోషల్ మీడియా పోస్టు, ఒక్క పోస్టర్ ఆధారంగా సినిమాపై ఆరోపణలు చేయడం తగదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు కథేంటో తెలియకుండా, ఇంకా సెట్స్ మీదకు వెళ్లని సినిమాపై ఇంత రాద్ధాంతం చేయడం కరెక్ట్ కాదని తారక్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి తమిళ తంబీల అభ్యంతరాలపై మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.
సీమాన్ సీరియస్ వార్నింగ్.. ఏం అన్నారంటే?
తమిళనాట సినిమా బ్యాన్ అవుతుందా?
మొత్తానికి ‘గాడ్ ఆఫ్ వార్’ వివాదం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సమస్య ఎలా పరిష్కారమవుతుంది, సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి. మరిన్ని అప్‌డేట్‌ల కోసం చూస్తూ ఉండండి!


