|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఎన్టీఆర్ వర్ధంతి: ఫిల్మ్ నగర్ దద్దరిల్లేలా నివాళులు! NTR గురించి ఈ నిజాలు తెలుసా?

Published: 18-01-2026, 12:30 PM
ఎన్టీఆర్ వర్ధంతి: ఫిల్మ్ నగర్ దద్దరిల్లేలా నివాళులు! NTR గురించి ఈ నిజాలు తెలుసా?
  • ఎన్టీఆర్ 30వ వర్ధంతి: ఫిల్మ్‌నగర్‌లో ఘన నివాళులు అర్పించిన సినీ, రాజకీయ ప్రముఖులు!
  • తెలుగు సినిమా చరిత్రలో ఎన్టీఆర్ నంబర్ వన్ అని కొనియాడిన కాజా సూర్యనారాయణ!
  • ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేసిన మాదాల రవి, మద్దతు తెలిపిన ప్రముఖులు!
  • ప్రతి నటుడికి ఎన్టీఆర్ శిక్షణాలయం: ప్రసన్నకుమార్ ప్రశంసలు, ఆదర్శంగా తీసుకోవాలని పిలుపు!

తెలుగు జాతి గర్వించదగ్గ నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి తారకరామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా సినీ మరియు రాజకీయ ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఫిల్మ్‌నగర్‌లో ఎన్టీఆర్ ఘన నివాళి!

విశ్వ విఖ్యాత నట సారభౌమ నందమూరి తారకరామారావు 30వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. ఫిల్మ్‌నగర్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహానికి సినీ పరిశ్రమకు చెందిన పలు శాఖల ప్రముఖులు పూల మాలలతో నివాళి అర్పించారు.

కాజా సూర్యనారాయణ మాట్లాడుతూ ‘తెలుగు సినిమా చరిత్రలో నంబర్‌వన్‌ ఎన్టీఆర్‌గారు. ఆయన ఆ రోజున తెలుగుదేశం పార్టీ స్థాపించకపోతే ఈరోజున చాలామంది రాజకీయాల్లో, పలు పదవుల్లో ఉండేవారు కాదు. తెలుగు ఇండస్ట్రీకి ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ రెండు కళ్లు. ఇప్పుడు ఇద్దరూ లేరు. అక్కినేని నాగేశ్వరరావుగారి విగ్రహం కూడా పెట్టాలని నా కోరిక. అందుకు పరిశ్రమ పెద్దలు కృషి చేయాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.

మాదాల రవి మాట్లాడుతూ ‘తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప వ్యక్తి నందమూరి తారకరామారావు. తెలుగు జాతికి, సినిమాకు గుర్తింపు తీసుకొచ్చిన అలాంటి వ్యక్తి భారతరత్న ఇవ్వాలి. దానికోసం మనమంతా కృషి చేయాలి’ అన్నారు.

ఎన్టీఆర్‌కు భారతరత్న డిమాండ్!

పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ ‘మనదేశం’ చిత్రంలో ఎన్టీఆర్‌ చెప్పిన డైలాగ్‌ ప్రకారమే ఒక్కోమెట్టు ఎక్కుతూ ఏ స్థాయికి ఎదిగారో అందరికీ తెలిసిందే! ఆయన మనల్ని విడిచి 30 ఏళ్లు దాటిని… ఇప్పటికీ మా అందరికీ సజీవంగా వచ్చి పలకరిస్తునట్టే ఉంటుంది. అన్నగారు లేరని ఏరోజు అనుకోలేదు’ అని అన్నారు.

తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ‘తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంచిన వ్యక్తి ఎన్టీఆర్‌. స్వార్థం లేని మనిషి ఆయన. సినిమాల్లో ఆయన చేయని ప్రయోగం లేదు.. కథ లేదు. అలాంటి వ్యక్తిని ఏడాదికి ఓసారి జయంతి, వర్థంతులకు గుర్తు చేసుకొని, పూల మాలలు వేసి నివాళులు అర్పించడం కాదు.. రాజకీయంలో అయినా, సినిమాల్లో అయినా ఆయన్ను ఆదర్శంగా తీసుకునే ధైర్యం ఉండాలి. ఇవాళ ఎంతమందిలో ఆ ధైర్యం ఉంది. ఆయనలా స్వార్థం లేకుండా ఈ రోజున రాజకీయం చేయగలరా? చేయాలనే ఆలోచన జనాల్లో రావాలంటే ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలి’ అని అన్నారు.

‘ప్రతి నటుడికి నందమూరి తారకరామారావు ఓ శిక్షణాలయం. ప్రతి నటుడు, రాజకీయ నాయకుడు ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలి. తెలుగువాడి పౌరుషం, పరాక్రమం ప్రపంచానికి చాటి చెప్పి ఏకైక వ్యక్తి ఎన్టీఆర్‌’ అని ప్రసన్నకుమార్‌ అన్నారు.

ఎన్టీఆర్ ఆదర్శం: సినీ ప్రముఖులు

వై.వి.ఎస్‌ చౌదరి మాట్లాడుతూ ‘చరిత్రలో గొప్ప వ్యక్తులకే విగ్రహాలు పెడుతుంటారు. తద్వారా భావితరాలకు వారి చరిత్ర తెలియాలని. కొందరు అవతార పురుషులు, మహానుభావులకే జననం- మరణం అని కాకుండా జయంతి, వర్ధంతి అని చెబుతాం. అలాంటి ప్రయాణం ఎన్టీఆర్‌ది. వెండితెర వేల్పుగా నిలిచారు. అంకితభావం, కార్యదక్షత, క్రమశిక్షణగా ఉండి అగ్రగామిగా ఎదిగారు. మద్రాసీలు అని పిలవబడుతున్న మనల్ని తెలుగుజాతి అని ప్రపంచవ్యాప్తంగా మన ఉనికికి తెలిపారు’ అన్నారు.

నందమూరి జానకీరామ్‌ భార్య దీపిక, మోహనరూప తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎన్టీఆర్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

నందమూరి తారకరామారావు గారి వర్ధంతి వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఆయన తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.