|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే! తాతతో కలిసి యంగ్ టైగర్ మాస్ ట్రీట్!!

Published: 23-01-2026, 8:35 PM
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే! తాతతో కలిసి యంగ్ టైగర్ మాస్ ట్రీట్!!
  • యంగ్ టైగర్ ఎన్టీఆర్, తాత సీనియర్ ఎన్టీఆర్ కలిసి బుల్లెట్ బండిపై చక్కర్లు!
  • హరికృష్ణ, సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ ల అద్భుతమైన కలయికతో AI వీడియో వైరల్
  • దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్
  • ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కొత్త సినిమా.. త్వరలో షూటింగ్ ప్రారంభం!

టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఎన్టీఆర్ తన తాత సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఉన్న ఒక అద్భుతమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో అభిమానులకు కన్నుల పండుగలా ఉంది.

తాతతో ఎన్టీఆర్ సందడి.. వీడియో వైరల్!

టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సీనియర్ ఎన్టీఆర్ వారసత్వాన్ని అందుకు ఉంచుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకు వెళ్తున్నాడు. గుక్క తిప్పుకోకుండా డైలాగ్ చెప్పే జూనియర్ ఎన్టీఆర్, RRR సినిమా తర్వాత పాన్ ఇండియా రేంజ్ కు వెళ్ళాడు. ఆ తర్వాత దేవర సినిమాతో బంపర్ హిట్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్, వరుసగా సినిమాలను లైన్ లో పెట్టాడు.

దేవర సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్

అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీకి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో వైరల్ గా మారింది. తన తాత సీనియర్ ఎన్టీఆర్ ను బుల్లెట్ బైక్ పైన జూనియర్ ఎన్టీఆర్ తీసుకు వెళుతున్న వీడియోను వైరల్ చేస్తున్నారు ఆయన అభిమానులు. అలాగే తాత, మనవడు పంట పొలాల్లో తిరుగుతూ, కలిసి భోజనం చేసిన విజువల్స్ కూడా ఈ వీడియోలో పెట్టారు. హరికృష్ణ, సీనియర్ ఎన్టీఆర్, యంగ్ టైగర్ ముగ్గురు కలిసి సంతోషంగా గడిపిన క్షణాన్ని కూడా పొందుపరిచారు. ఈ వీడియోలో చూస్తుంటే సీనియర్ ఎన్టీఆర్ బతికి ఉన్నాడని అనిపిస్తుంది. అంత అద్భుతంగా ఈ వీడియోని చిత్రీకరించారు. AI వీడియో అయినప్పటికీ అందరి గుండెల్ని టచ్ చేస్తోంది.

ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ

దేవర సినిమాతో సక్సెస్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్, ఇటీవల హిందీ సినిమా వార్ 2 తో సందడి చేశారు. ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు ఎన్టీఆర్. ఈ మూవీ తర్వాత దేవర 2 ఉంటుందట. ఆ తర్వాత త్రివిక్రమ్ తో ఓ మూవీ ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో త్వరలో సినిమా ప్రారంభం కానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.