|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నువ్వు నాకు నచ్చావ్ రీ-రిలీజ్: వెంకటేష్ భార్య చెప్పిన ఆ మాట నిజమైందా? త్రివిక్రమ్ వెల్లడి!

Published: 31-12-2025, 9:01 AM
నువ్వు నాకు నచ్చావ్ రీ-రిలీజ్: వెంకటేష్ భార్య చెప్పిన ఆ మాట నిజమైందా? త్రివిక్రమ్ వెల్లడి!
  • నువ్వు నాకు నచ్చావ్ జనవరి 1న 4K వెర్షన్‌లో రీ-రిలీజ్ కాబోతోంది.
  • దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు కథా రచయితగా పనిచేశారు.
  • వెంకటేష్ భార్య ‘గుండమ్మ కథ’తో ఈ సినిమా ఆదరణను పోల్చి చూశారు.
  • 15 సంవత్సరాల తర్వాత కూడా సినిమా అదే ఆదరణ చూసి త్రివిక్రమ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

టాలీవుడ్‌లో రీ-రిలీజ్ సినిమాల పరంపర కొనసాగుతోంది. విక్టరీ వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్ జనవరి 1న తిరిగి విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, వెంకటేష్ భార్య సినిమా గురించి చేసిన వ్యాఖ్యలను వెల్లడించారు. ఇది సినీ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.

రీ-రిలీజ్ ట్రెండ్‌లో “నువ్వు నాకు నచ్చావ్”

Nuvvu Naaku Nacchav Re Release: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాల హవా కొనసాగుతుంది. ఇప్పటికే ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు విడుదల అయ్యి అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాయి .ఈ నేపథ్యంలోనే 2026లో కూడా సూపర్ హిట్ సినిమాలు రీ రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జనవరి ఒకటవ తేదీ విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వెంకటేష్ ఆర్తి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించినదో మనకు తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమా టీవీలలో ప్రసారమైతే ప్రేక్షకులు కల్లార్పకుండా చూస్తారు.

ఇలా మంచి లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా జనవరి ఒకటో తేదీ తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ రచయితగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు. ఒక ఇంటర్వ్యూ సందర్భంగా నువ్వు నాకు నచ్చావ్ సినిమా గురించి వెంకటేష్ వైఫ్ రియాక్షన్ గురించి తెలియజేశారు.

వెంకటేష్ భార్య ఆసక్తికర కామెంట్స్

ఈ సినిమా ప్రివ్యూ చూసిన అనంతరం వెంకటేష్ గారి భార్య నాతో ఒక్కటే మాట అన్నారు. మనం ఇప్పుడు గుండమ్మ కథ, మిస్సమ్మ సినిమాలను ఎలాగైతే చూసామో నెక్స్ట్ జనరేషన్ వారికి నువ్వు నాకు నచ్చావ్ సినిమా అదే విధంగా ఉంటుందని, తిరిగి 15 సంవత్సరాల తర్వాత ఈ సినిమాని అలా చూస్తూ ఉంటారని వెంకటేష్ గారి వైఫ్ నాతో అన్నారు. ఆరోజు ఆవిడ చెప్పిన విధంగానే ఇప్పుడు నువ్వు నాకు నచ్చావ్ సినిమాని తిరిగి ప్రేక్షకులు చూడటానికి ఆసక్తి కనబరుస్తుండటం విశేషం అంటూ త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలియజేశారు.

ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47..

త్రివిక్రమ్ కథా రచయితగా ప్రస్థానం

నువ్వు నాకు నచ్చావ్ సినిమా రీ రిలీజ్ అవుతున్న సందర్భంగా 4k వెర్షన్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాకు  కథా రచయితగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పనిచేయగా, ఈ సినిమాకు కె విజయ్ భాస్కర్ దర్శకత్వంలో ఈ సినిమా సెప్టెంబర్ 6 2021 వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్రివిక్రమ్ డైరెక్షన్లో వెంకటేష్ ఇప్పటివరకు సినిమా చేయకపోయినా, ఆయన కథా రచయితగా పనిచేసిన మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్ సినిమాలలో వెంకటేష్ నటించి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ప్రస్తుతం వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లు సినిమా రాబోతుంది. ఈ సినిమాకు “ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47” అనే పేరుతో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

వెంకటేష్ భార్య ముందుచూపుతో చెప్పినట్లు, నువ్వు నాకు నచ్చావ్ తరతరాలకు నచ్చే క్లాసిక్‌గా నిలిచింది. ఈ రీ-రిలీజ్ సినిమా ప్రేక్షకుల ఆదరణను మరోసారి రుజువు చేస్తుంది. మళ్ళీ థియేటర్లలో ఈ మ్యాజిక్‌ను అనుభవించేందుకు సిద్ధం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.