|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

O Cheliya: ‘ఓ.. చెలియా’ టీజర్ రిలీజ్.. శ్రీకాంత్ చేతుల మీదుగా..

Published: 25-09-2025, 2:47 AM
O Cheliya: ‘ఓ.. చెలియా’ టీజర్ రిలీజ్.. శ్రీకాంత్ చేతుల మీదుగా..

ఎస్‌ఆర్ఎస్ మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ‘ఓ.. చెలియా’ సినిమా టీజర్‌ను నటుడు శ్రీకాంత్ విడుదల చేశారు. నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య రెడ్డి ప్రధాన పాత్రధారులు.

‘ఓ.. చెలియా’ టీజర్ విడుదల

O Cheliya : ఎస్‌ఆర్ఎస్ మూవీ క్రియేషన్స్, ఇందిరా దేవీ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై రూపాశ్రీ కొపురు నిర్మాణంలో ఎం. నాగరాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఓ.. చెలియా’. నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య రెడ్డి ముఖ్య పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్ రిలీజ్ చేసారు.

తాజాగా ‘ఓ.. చెలియా’ నుంచి టీజర్‌ను విడుదల చేశారు. హీరో శ్రీకాంత్ ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసి మూవీ యూనిట్ కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. మీరు కూడా ఓ చెలియా టీజర్ చూసేయండి..

శ్రీకాంత్ చేతుల మీదుగా టీజర్ రిలీజ్

హారర్, లవ్ జానర్ మిశ్రమం

టీజర్ రిలీజ్ అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ.. నాకు టీజర్ చాలా నచ్చింది. యంగ్ టీం అంతా కలిసి ఈ మూవీని తెరకెక్కించినట్టుగా కనిపిస్తోంది అని అన్నారు. ఈ టీజర్‌ చూస్తుంటే హారర్, లవ్ జానర్లో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు.

‘ఓ.. చెలియా’ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. హారర్ మరియు లవ్ జానర్‌ల కలయిక ఆసక్తిని రేకెత్తిస్తోంది. త్వరలోనే విడుదల తేదీ వెల్లడించనున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.