
📌 Key Points
- ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా ప్రజలు ఊబకాయంతో బాధపడుతున్నారు.
- ఊబకాయం దీర్ఘకాలిక వ్యాధి మరియు ఇతర వ్యాధులకు ప్రధాన కారణం కావచ్చు.
- ఊబకాయం ఉన్నవారికి మానసిక సమస్యలు వచ్చే అవకాశం 30-70% ఎక్కువ.
- డిప్రెషన్, ఆందోళన, బాడీ షేమింగ్ వంటి సమస్యలకు ఊబకాయం దారితీయవచ్చు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం అనేది ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారింది. ఇది శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యలకు కూడా దారితీస్తుంది. దీని గురించి అవగాహన పెంచుకోవడం చాలా అవసరం.
ఊబకాయం – ఒక ప్రపంచ ఆరోగ్య సమస్య
ప్రస్తుతం ఊబకాయం (ఒబేసిటీ) ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద పబ్లిక్ హెల్త్ సమస్యగా మారింది. ప్రపంచంలో 100 కోట్లకు పైగా జనాభా ఈ సమస్యతో జీవిస్తున్నారు. ముందుగా శరీరంపై ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం.
ఊబకాయం అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఇది రిపీట్ అయ్యే స్వభావం కలిగి ఉంటుంది. ఇది చాలా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కి ప్రధాన కారణం.
ఊబకాయం వల్ల మానసిక ఆరోగ్యంపై కూడా తీవ్రమైన ప్రభావం ఉంటుంది. ఊబకాయం ఉన్నవారికి 30 నుంచి 70 శాతం వరకు మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ.
శరీరంపై ఊబకాయం ప్రభావం
డిప్రెషన్, ఆందోళన, సమాజంలో ఎదురయ్యే విమర్శలు, బాడీ షేమింగ్ వల్ల నామోషీ, క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీద ప్రభావం చూపిస్తుంది.
ఊబకాయం, దానికి సంబంధించిన వ్యాధులు చాలా వరకు నివారించగలిగినవే, నియంత్రించగలిగినవే.
కన్సల్టెంట్ – ఇంటర్నల్ మెడిసిన్
మానసిక ఆరోగ్యంపై ఊబకాయం యొక్క ప్రభావం
మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ
హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం. Read More
ఊబకాయం అనేది నివారించదగిన సమస్య అని గుర్తెరగాలి. సరైన జీవనశైలి మార్పులు మరియు వైద్య సహాయంతో దీనిని నియంత్రించవచ్చు. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం కృషి చేద్దాం.


