|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

OG 9 Days Collection: కాంతార చాప్టర్‌ 1 కి ఝలక్‌ ఇస్తోన్న పవన్ కళ్యాణ్.. ఓజీ బాక్సాఫీసు సునామీ

Published: 04-10-2025, 3:57 PM
OG 9 Days Collection: కాంతార చాప్టర్‌ 1 కి ఝలక్‌ ఇస్తోన్న పవన్ కళ్యాణ్.. ఓజీ బాక్సాఫీసు సునామీ

పవన్ కళ్యాణ్ నటించిన ‘దే కాల్ హిమ్ ఓజీ’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ప్రదర్శన కొనసాగిస్తోంది. 9 రోజుల్లోనే భారీ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం, ‘కాంతార చాప్టర్‌ 1’ పోటీని తట్టుకుని దూసుకుపోవడం విశేషం. బ్రేక్ ఈవెన్‌కు చేరువలో ఉన్న ఓజీ వారాంతంలో మరింత ప్రభంజనం సృష్టించనుంది.

Key Points

1

'ఓజీ' 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ₹271 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.

2

9వ రోజు 'ఓజీ' ₹3.81 కోట్లు (నెట్) వసూలు చేసింది, మొత్తం ₹171.58 కోట్లు.

4

సినిమా బ్రేక్ ఈవెన్‌కి దగ్గరగా ఉంది; వారాంతంలో సేఫ్‌లోకి వెళ్లే అవకాశం.

ఓజీ తొమ్మిదో రోజు వసూళ్లు

సుజీత్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘దే కాల్ హిమ్ ఓజీ’ మొదటి వారంలో బాక్సాఫీస్ వద్ద అద్భుత ప్రదర్శన ఇచ్చింది. సెప్టెంబర్ 25న విడుదలై, 24న పెయిడ్ ప్రీమియర్లతో, ఈ పవన్ కళ్యాణ్ సినిమా 7 రోజుల్లోనే ₹160 కోట్లు(నెట్‌) దాటింది. ఎనిమిదో రోజు  కూడా ఈ చిత్రానికి అదిరిపోయే వసూళ్లు వచ్చాయి. ఇక శుక్రవారం 9వ రోజు ( అక్టోబర్ 3)’దే కాల్ హిమ్ ఓజీ’ తెలుగు ఆక్యుపెన్సీ 29.89%గా ఉంది. ఉదయం షోలకు 22.79%, మధ్యాహ్నం షోలకు 36.98% ప్రేక్షకులు హాజరయ్యారు. ఈ సినిమా రెండో వారంలో కూడా మంచి ఆక్యుపెన్సీని సాధించడం విశేషం. సినిమాకి ఇంకా ఆదరణ ఉందంటే మామూలు విషయం కాదు. సాధారణంగా కమర్షియల్‌ చిత్రాలు మొదటి  వారంలోనే క్లోజ్‌ అవుతుంటాయి.

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా వచ్చిన `ఓజీ` మూవీ తొమ్మిదో రోజు కూడా సత్తా చాటింది. ఈ చిత్రానికి ఇంకా మంచి కలెక్షన్లు రావడం విశేషం. ఇక తొమ్మిదో రోజు ఈ మూవీ సుమారు  రూ.3.81  రావడం విశేషం. దాదాపు ఆరున్నర కోట్ల గ్రాస్‌ రాబట్టింది. ఓ వైపు `కాంతార 2` నడుస్తుండగా ఈ చిత్రానికి ఇంతటి కలెక్షన్లు రావడం ట్రేడ్‌ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.  దీంతో ఇప్పటి వరకు ఈ మూవీ తొమ్మిది రోజుల్లో దాదాపుగా రూ.171.58 కోట్లు రాబట్టడం విశేషం.  ప్రపంచ వ్యాప్తంగా ఇది రూ.271కోట్ల గ్రాస్‌ కలెక్షన్లని  సాధించింది. ఆల్మోస్ట్ ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌కి దగ్గరగా ఉంది. ఈ శనివారం, ఆదివారాల కలెక్షన్లు పెరిగితే సినిమా సేఫ్‌లోకి వెళ్తుంది. మరి అది సాధ్యమేనా అనేది చూడాలి.

కాంతార చాప్టర్ 1 ప్రభావం

ప్రస్తుతం థియేటర్లలో `కాంతారః చాప్టర్‌ 1`(కాంతార 2) సందడి చేస్తోంది. ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభించినా `కాంతార`కి ప్రీక్వెల్‌గా రావడంతో ఆడియెన్స్ లో క్రేజ్‌ ఉంది. అది కలెక్షన్ల విషయంలో హెల్ప్ అవుతుంది. దీనికితోడు పండగ సెలవులు ఉండటంతో సినిమాని జనం చూస్తున్నారు. బాగానే ఆదరిస్తున్నారు. ఈ ఆదివారం వరకు ఈ మూవీ ప్రభావం ఉండనుంది. ఈ క్రమంలో `కాంతార 2` ఎఫెక్ట్ ఉన్నా కూడా `ఓజీ` సినిమాకి అదిరిపోయే వసూళ్లు  వస్తున్నాయి. ఇది `ఓజీ` టీమ్‌కి హ్యాపీగా అనిపించే విషయం. ఓ రకంగా `ఓజీ` చాలా చోట్ల `కాంతార 2` కలెక్షన్లకి దెబ్బకొడుతుందని సమాచారం.

ఓజీ బాక్సాఫీస్ దూకుడు

ఓజీ మూవీని దర్శకుడు సుజీత్‌ ఆద్యంతం స్టయిలీష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. ముంబయి గ్యాంగ్‌ స్టర్‌ నేపథ్యంలో సినిమాని మలిచారు. ఇందులో పవన్‌ ఓజాస్‌ గాంభీరగా గ్యాంగ్‌స్టర్‌గా ఆకట్టుకున్నారు. ఆయన స్టయిలీష్‌ యాక్టింగ్‌, యాక్షన్‌ సీన్లు అదిరిపోయాయి. ఆడియెన్స్ కి పూనకాలు తెప్పించాయి. పవన్‌ ఫ్యాన్స్ సినిమాని బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత పవన్‌ని తమకు కావాల్సిన విధంగా, తాము కోరుకున్న విధంగా కనిపించడంతో వారంతా పండగ చేసుకుంటారు. థియేటర్‌ పవన్‌ మేనియాకి ఫిదా అవుతున్నారు. దీంతో ఈ మూవీ భారీ వసూళ్ల దిశగా వెళ్తోంది. ఈ చిత్రంతో పవన్‌కి జోడీగా ప్రియాంక మోహన్‌ నటించింది. ప్రకాష్‌ రాజ్‌, ఇమ్రాన్‌ హష్మీ, అర్జున్‌ దాస్‌, తేజ్‌ సప్రూ, శ్రియా  రెడ్డి  కీలక పాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య నిర్మించారు.

‘ఓజీ’ 9 రోజులు పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది. ‘కాంతార చాప్టర్‌ 1’ వంటి పెద్ద సినిమా పోటీలోనూ పవన్ కళ్యాణ్ చిత్రం మంచి వసూళ్లను సాధించడం సినిమా పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.