|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నిర్మాత చెప్పినదానికి నోటి నుంచి మాట రాలేదు.. 6 గంటల సమయం తీసుకున్న.. ఓజీ మూవీ డైరెక్టర్ సుజీత్ కామెంట్స్

Published: 03-10-2025, 6:11 AM
నిర్మాత చెప్పినదానికి నోటి నుంచి మాట రాలేదు.. 6 గంటల సమయం తీసుకున్న.. ఓజీ మూవీ డైరెక్టర్ సుజీత్ కామెంట్స్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ మూవీ విజయోత్సవ వేడుకలో దర్శకుడు సుజిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ తో సినిమా అవకాశం, నిర్మాత డీవీవీ దానయ్య మద్దతు, సినిమాటోగ్రాఫర్‌కు కథ చెప్పిన విధానం గురించి సుజిత్ వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

Key Points

1

పవన్ కల్యాణ్ తో ఓజీ అవకాశం త్రివిక్రమ్ వల్ల లభించిందని సుజిత్ వెల్లడించారు.

2

నిర్మాత డీవీవీ దానయ్య 'సినిమా హిట్ అవ్వాలి' అంటూ పూర్తి మద్దతు అందించారు.

4

ఓజీ హిట్ అయితే పవన్ కల్యాణ్ తో మరో సినిమా చేయాలని సుజిత్ కోరారు.

పవన్ కళ్యాణ్ తో ఓజీ అవకాశం: సుజిత్ వెల్లడి

ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఓజీని యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కించారు. డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మాతగా వ్యవహరించిన ఓజీ సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంటోంది.

ఈ నేపథ్యంలో ఇటీవల ఓజీ విజయోత్సవ వేడుకను నిర్వహించారు. హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్‌లో గ్రాండ్‌గా జరిగిన ఓజీ సక్సెస్ ఈవెంట్‌లో దర్శకుడు సుజిత్ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు.

ఓజీ డైరెక్టర్ సుజీత్ మాట్లాడుతూ.. ” పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా చేస్తాను అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఒక కథ కూడా రాసుకోలేదు ఆయన కోసం. కానీ ప్రకృతి ఎంత బలమైంది అంటే నన్ను తీసుకువచ్చి పవన్ గారితో సినిమా చేసేలాగా చేసింది” అని అన్నారు.

నిర్మాత దానయ్య, త్రివిక్రమ్ అండదండలు

“త్రివిక్రమ్ గారి వల్ల ఈ అవకాశం రావడం నాకు సంతోషంగా ఉంది. ఆయనే వచ్చి నువ్వు పవన్ గారితో ఒక సినిమా చేస్తే బాగుంటుందని చెప్పడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. తర్వాత డీవీవీ దానయ్య గారిని కలవడం జరిగింది. ఆయన చెప్పిన ఒకే ఒక్క మాట.. సినిమా ఎలా అయినా హిట్ అవ్వాలి దానికి నీకు ఏం కావాలి. నేను పవన్ కళ్యాణ్ గారికి నా బ్యానర్‌లో ఒక హిట్ ఇవ్వాలి అనేసరికి.. నా నోటి నుంచి మాట రాలేదు. అంత సపోర్ట్ చేశారు సినిమా పూర్తి అయ్యేవరకు” అని సుజీత్ చెప్పారు.

“ఇంకా ఓజీ సినిమా బ్యాక్ బోన్ అనిపించుకుంటున్న తమన్ అన్న సినిమాకే కాదు నాకు కూడా ఒక బ్యాక్ బోన్‌లా నుంచున్నాడు సినిమా పూర్తి అయ్యేవరకు. మిగతా తారాగణం అంతా కూడా సినిమాకి చాలా సపోర్టివ్‌గా ఉన్నారు” అని దర్శకుడు సుజిత్ తెలిపారు.

సినిమాటోగ్రాఫర్‌కు కథ చెప్పడానికి పట్టిన సమయం

“సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ గారికి ముందు స్టోరీ చెప్పడానికి వెళ్లినప్పుడు 6 గంటలు తీసుకున్న సినిమా ఇలా ఉంటుంది అని చెప్పడానికి. అప్పుడు ఆయన నిజంగా ఈ సినిమా పవన్ గారు ఒప్పుకున్నారా అని అడిగారు. తర్వాత రోజు సెకండ్ హాప్ చెప్పే సరికి. ఓకే అదిరిపోయింది ఫస్ట్ హాఫ్ సంగతి మనం చూసుకుందాం అని ఆయన ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను థాంక్యూ సో మచ్ సార్” అని సుజిత్ చెప్పుకొచ్చాడు.

” పవన్ కల్యాణ్ గారితో సినిమా చేస్తునంత సేపు ఆయన్ని ఒక విషయం అడగడానికి ధైర్యం సరిపోలేదు. ఎలా అయితే ఒక రోజు ముంబైలో షూటింగ్ జరుగుతున్నప్పుడు టీమ్ మొత్తంతో అడిగించిన తర్వాత నేను అడిగా. సార్ ఈ సినిమా హిట్ అయితే ఇంకొక సినిమా చేద్దాం సార్ అని. అప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం వల్లే ఈరోజు ఓజీ యూనివర్స్ స్టార్ట్ అయ్యింది. థాంక్యూ సార్” అని సుజిత్ వెల్లడించారు.

మొత్తంగా, ఓజీ చిత్రం విజయం వెనుక దర్శకుడు సుజిత్ కృషి, నిర్మాత దానయ్య, పవన్ కల్యాణ్ వంటి వారి అండదండలు ఉన్నాయని సుజిత్ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది. ఈ కామెంట్స్ ఓజీ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.