|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓజీ ఆరంభమే.. ఈ ప్రపంచం చాలా పెద్దది కాబోతోంది: సినిమాటిక్ యూనివర్స్‌పై సుజీత్ కామెంట్స్

Published: 24-09-2025, 12:45 PM
ఓజీ ఆరంభమే.. ఈ ప్రపంచం చాలా పెద్దది కాబోతోంది: సినిమాటిక్ యూనివర్స్‌పై సుజీత్ కామెంట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా త్వరలో విడుదల కానుంది. దర్శకుడు సుజీత్ ఈ సినిమాను ఒక సినిమాటిక్ యూనివర్స్‌గా ప్రారంభించే ప్రణాళికతో ఉన్నాడని తెలుస్తోంది. అతని తాజా ట్వీట్ ఈ విషయాన్ని ధృవీకరిస్తోంది.

Key Points

1

సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

2

ఓజీ సినిమా విడుదల తర్వాత సుజీత్ సినిమాటిక్ యూనివర్స్ విస్తరించే అవకాశం ఉంది.

4

పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో తుఫానులాంటి పాత్రలో కనిపించనున్నాడు.

ఓజీ సినిమా విడుదలకు సిద్ధం

తెలుగులో మరో సినిమాటిక్ యూనివర్స్ రాబోతోంది. అది ఓజీ యూనివర్స్. అది డైరెక్టర్ సుజీత్ యూనివర్స్. కేవలం 23 ఏళ్ల వయసులోనే రన్ రాజా రన్ తో సంచలనం సృష్టించి, తర్వాత ప్రభాస్ తో సాహో తీసి.. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో దే కాల్ హిమ్ ఓజీ మూవీతో వస్తున్న సుజీత్ షేర్ చేసిన నోట్ ఇంట్రెస్టింగా ఉంది.

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ తో తన సినిమాటిక్ యూనివర్స్ ప్రారంభించిన విషయం తెలుసు కదా. ఇప్పుడు మరో టాలీవుడ్ యువ డైరెక్టర్ సుజీత్ కూడా అదే హింట్ ఇచ్చాడు. పవన్ కల్యాణ్ తో అతడు తీసిన ఓజీ మూవీ గురువారం (సెప్టెంబర్ 25) రిలీజ్ కానుండగా.. బుధవారం అతడు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఇందులో తన ఓజీ టీమ్ అందరికీ థ్యాంక్స్ చెబుతూ.. రానున్న రోజుల్లో అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ ప్రపంచం పెద్దది కాబోతోందని అతడు అనడం గమనార్హం.

“దే కాల్ హిమ్ ఓజీ.. దే కాల్ హిమ్ ఓజీ కొన్ని గంటల్లో మీ అందరి ముందుకు రాబోతోంది. ఇన్నేళ్ల ప్రయాణం చివరికి ఒక ముగింపుకు వస్తున్నందుకు ఎగ్జైటెడ్‌గా, థ్రిల్డ్‌గా ఇంకా కొంచెం బాధగా కూడా ఉంది. రేపటి నుంచి ఇది ఇలా ఉండదు. నా ఫ్యామిలీకి ఇంకా ప్రతి అడుగులో నన్ను ముందుకు నడిపిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. నా ఏడీ టీమ్‌కి ఇంకా నా టెక్నీషియన్స్‌కి నేను ఇకపై ఎప్పటికీ చెప్పలేనిది.. నేను మీ అందరినీ చాలా ప్రేమిస్తున్నాను. మీరు ప్రతి అడ్డంకిని, ప్రతి ఇబ్బందిని ఎదుర్కొంటూ నా వెంట ఉన్నారు.

సుజీత్ యొక్క సినిమాటిక్ యూనివర్స్ ప్రకటన

దానయ్య గారికి ఇంకా కళ్యాణ్ దాసరి గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ ప్రయాణంలో వాళ్ళు ఎప్పుడూ ఒక బలంలాగా ఉండి.. నన్ను నమ్మి, ఈ సినిమా కోసం నాకు ప్రతిదీ ఇచ్చారు. నవీన్ నూలి బ్రో, స్క్రీన్‌పై మీరు చేసిన మ్యాజిక్‌ని ప్రేక్షకులు చూడటానికి నేను వెయిట్ చేయలేకపోతున్నాను. రవి కె. చంద్రన్ సార్ ఇంకా మనోజ్ సార్, మీ బ్రిలియన్స్ మేకింగ్‌లో ప్రతిదాన్ని ఎలివేట్ చేసింది. రాఘవ్ బ్రో ఇంకా నీల్ దర్శన్, ఈ మ్యాజిక్ మొత్తం తీసుకువచ్చినందుకు థ్యాంక్యూ. సచిన్ అద్భుతమైన పని చేసినందుకు థ్యాంక్యూ.

ఈ రోజు మీలో ఉన్న యూఫోరియా ఇంకా పిచ్చి అన్నీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాను చూడండి.. సెలబ్రేట్ చేయండి.. ఎంజాయ్ చేయండి. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని గుర్తుంచుకోండి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ ప్రపంచం ఇక్కడి నుండి మరింత పెద్దగా మారుతుంది. లవ్ యు మై పవర్‌స్టార్ .. సినిమాలో తుఫాను లాగా వస్తున్నాడు.. సుజీత్” అని అతడు పెద్ద నోట్ రిలీజ్ చేశాడు.

పవన్ కళ్యాణ్ ఓజీలో కీలక పాత్ర

సుజీత్ అప్పుడెప్పుడో 2014లో రన్ రాజా రన్ మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. అంతకుముందు పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ గా ఉన్నాడు. అయితే ఈ 11 ఏళ్లలో కేవలం మూడే మూడు సినిమాలు తీశాడు. తొలి సినిమా సూపర్ హిట్ కావడంతో రెండో సినిమా ఏకంగా ప్రభాస్ తో తీశాడు. సాహోను రూ.350 కోట్లతో తీసినా అది బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది.

ఇక ఇప్పుడు పవన్ కల్యాణ్ తో ఓజీ తీశాడు. ఎన్నో అడ్డంకులు, ఇబ్బందులు వచ్చినా చివరికి ఈ సినిమా రిలీజ్ అవుతోంది. సాహో, ఓజీని లింకు పెడుతూ ఈ యూనివర్స్ ను సుజీత్ ముందుకు తీసుకెళ్లే ప్లాన్ చేస్తున్నాడు. మరి రానున్న రోజుల్లో ఈ యూనివర్స్ నుంచి ఎలాంటి సినిమాలు వస్తాయో చూడాలి.

ఓజీ సినిమా విడుదల తర్వాత సుజీత్ సినిమాటిక్ యూనివర్స్ ఎలా విస్తరిస్తుందో చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ప్రకటన తెలుగు సినిమా ప్రేమికులను ఉత్సాహపరుస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.