
ఓజీ మూవీ విలన్ ఇమ్రాన్ హష్మి తన కొత్త సినిమా ప్రమోషన్లలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కొందరు నటులు అసలు సెట్స్‌కే రారని, టైమ్‌కి రావడం కాదంటూ వ్యాఖ్యానించాడు. దీంతో అతడు ఎవరి గురించి ఈ కామెంట్స్ చేశాడన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Key Points
ఓజీ విలన్ ఇమ్రాన్ హష్మి తన 'హక్' సినిమా ప్రమోషన్లలో కామెంట్స్ చేశాడు.
కొందరు నటులు అసలు సెట్స్‌కే రారని, సమయానికి రావడం లేదని అన్నాడు.
అతని వ్యాఖ్యలు ఏ నటులను ఉద్దేశించాయో అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
తన 'సీరియల్ కిస్సర్' ఇమేజ్‌పై కూడా ఇమ్రాన్ ఆసక్తికరంగా మాట్లాడాడు.
సెట్స్‌కి రాని నటులు: ఇమ్రాన్ హష్మి సంచలన వ్యాఖ్యలు
ఓజీ మూవీలో విలన్ గా చేసిన ఇమ్రాన్ హష్మి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన నెక్స్ మూవీ హక్ (Haq) ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అతడు.. కొందరు యాక్టర్స్ అసలు సెట్స్ కే రారు అని అనడం గమనార్హం.
నటుడు ఇమ్రాన్ హష్మీ తెలుసు కదా. ఈ మధ్యే పవన్ కల్యాణ్ నటించిన ఓటీ మూవీలో విలన్ గా కనిపించాడు. ప్రస్తుతం యామీ గౌతమ్‌తో కలిసి నటించిన తన రాబోయే మూవీ ‘హక్’ (Haq) విడుదల కోసం సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడు యాక్టర్స్ సమయానికి సెట్స్ కు రావడం, రాకపోవడంపై అతడు స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు? సోషల్ మీడియాలో చర్చ
ఇప్పటికే కొందరు టైమ్ కి రావడం లేదా అని రిపోర్టర్ అడగగా.. కొందరైతే అసలు రానే రారు.. సమయానికి రావడం కాదు కదా అసలు రారు అని ఇమ్రాన్ హష్మి అనడం విశేషం. దీంతో అతడు ఎవరి గురించి ఈ కామెంట్స్ చేశాడన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆ యాక్టర్స్ ఎవరన్నదానిపై చర్చించుకుంటున్నారు.
ఆ వెబ్ సిరీస్‌లో క్యామియోపై..
‘సీరియల్ కిస్సర్’ ఇమేజ్‌పై ఇమ్రాన్ ఫన్నీ కామెంట్స్
తనకు చాలా కాలంగా అంటుకుపోయిన ‘సీరియల్ కిస్సర్’ ఇమేజ్ ఇప్పటికీ తనను ఎలా వెంటాడుతోందో అని అతడు నవ్వుతూ చెప్పాడు. “నాకు తెలుసు ఇంతకుముందు అభిమానులు పేరు పెట్టి పిలిచేవారు.. లేదా ‘S’ తో మొదలయ్యే మరొక ఇమేజ్ ఉండేది. నేను ఆ పేరు ప్రస్తావించను. లేదంటే రాత్రి మొత్తం దీని గురించే చర్చ జరుగుతుంది” అని చమత్కరించాడు. తన ఇమేజ్‌కు బదులుగా అభిమానులు తన డైలాగ్‌లు, నటనను అభినందించడం చూసి చాలా సంతోషంగా ఉందని ఇమ్రాన్ అన్నాడు.
ఇమ్రాన్ హష్మి చేసిన ఈ వ్యాఖ్యలు బాలీవుడ్‌లో చర్చకు దారితీశాయి. సమయపాలన లేని ఆ నటులు ఎవరన్నది సస్పెపెన్స్‌గా మారగా, అతని ‘సీరియల్ కిస్సర్’ ఇమేజ్‌పై వ్యాఖ్యలు కూడా అభిమానులను ఆకట్టుకున్నాయి.


