
పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా నుండి విడుదలైన రెండో పాట ‘సువ్వి సువ్వి’ యూట్యూబ్‌లో అద్భుతమైన విజయాన్ని సాధించింది. రొమాంటిక్ మెలోడీతో అలరించే ఈ పాట లిరిక్స్ ఇప్పుడు మీకోసం.
Key Points
పవన్ కళ్యాణ్ 'ఓజీ' సినిమా రెండో పాట 'సువ్వి సువ్వి' యూట్యూబ్‌లో విడుదలైంది.
మూడు రోజుల్లోనే 64 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది.
పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ మధ్య రొమాన్స్‌ను చాటే పాట.
సువ్వి సువ్వి పాట యూట్యూబ్ లో విజయం
పవన్ కల్యాణ్ అప్ కమింగ్ మూవీ ‘ఓజీ’. ఈ సినిమా ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ చేసింది. ఇక రీసెంట్ గా వచ్చిన రొమాంటిక్ లవ్ మెలోడీ సాంగ్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. మంచి ఫీల్ గుడ్ మ్యూజిక్ తో సాగుతున్న ‘ సువ్వి సువ్వి సువ్వాల ’ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. మూడో రోజుల్లోనే 64 లక్షలకు పైగా వ్యూస్ రాబట్టింది.
ఫైర్ స్టార్మ్ అంటూ ఓజీ నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసింది. ఇప్పుడు పవన్ కల్యాణ్ , ప్రియాంక మోహన్ మధ్య రొమాన్స్ ను చాటేలా, వాళ్ల ప్రేమను చెప్పేలా ‘సువ్వి సువ్వి’ సాంగ్ వచ్చేసింది. తమన్ అదిరిపోయే మ్యూజిక్ అందించారు. శ్రుతి రంజని వాయిస్ తో మ్యాజిక్ చేసింది. సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న ఓజీ సినిమాకు డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి ప్రొడ్యూసర్లు. సువ్వి సువ్వి సాంగ్ లిరిక్స్ ఇక్కడ మీకోసం.
తోడుగా నా మూడు ముళ్ల లాగా
ఉండి రెండుగానే ఒక్కటైనా ముడిలాగా
ఉండి రెండుగానే ఒక్కటైనా ముడిలాగా
విడివిడిగానే అడుగులు ఉన్నా
సువ్వి సువ్వి సువ్వాలా సూదంటు రాయే పిల్ల
పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ రొమాన్స్
మళ్లీ మళ్లీ చూసేలా చేసిందే మాయే ఇల్లా
సువ్వి సువ్వి సువ్వాలా సూదంటు రాయే పిల్ల
మళ్లీ మళ్లీ తలచేలా నచ్చావే చాలా చాలా
తోడుగా నా మూడు ముళ్ల లాగా
ఉండి రెండుగానే ఒక్కటైనా ముడిలాగా
ఇక చివరే లేదను ప్రేమ మనదని
సువ్వి సువ్వి సువ్వాలా సూదంటు రాయే పిల్ల
తమన్ సంగీతం, శ్రుతి రంజని గాత్రం
మళ్లీ మళ్లీ చూసేలా చేసిందే మాయే ఇల్లా
సువ్వి సువ్వి సువ్వాలా సూదంటు రాయే పిల్ల
మళ్లీ మళ్లీ తలచేలా నచ్చావే చాలా చాలా
తోడుగా నా మూడు ముళ్ల లాగా
ఉండి రెండుగానే ఒక్కటైనా ముడిలాగా
ఉండి రెండుగానే ఒక్కటైనా ముడిలాగా
సువ్వి సువ్వి పాటతో ఓజీ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. తమన్ సంగీతం, శ్రుతి రంజని గొప్ప గాత్రంతో ఈ పాట అందరినీ మెప్పించింది.


