|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

OG Success Meet : దసరా స్పెషల్.. OG సక్సెస్ మీట్.. పవర్ స్టార్ కూడా.. ఫ్యాన్స్ కి పండగే..

Published: 30-09-2025, 10:17 AM
OG Success Meet : దసరా స్పెషల్.. OG సక్సెస్ మీట్.. పవర్ స్టార్ కూడా.. ఫ్యాన్స్ కి పండగే..

పవన్ కళ్యాణ్ నటించిన OG చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించి దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ దసరా స్పెషల్ గా ఓ సక్సెస్ మీట్ ను ప్లాన్ చేసింది. రేపు అక్టోబర్ 1న హైదరాబాద్ లో జరిగే ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరవుతారు. ఇది పవన్ అభిమానులకు ముందుగానే వచ్చిన దసరా పండగ.

Key Points

1

పవన్ కళ్యాణ్ OG సినిమా భారీ విజయం సాధించి థియేటర్లలో దూసుకుపోతోంది.

2

OG సినిమా ఇప్పటికే 270 కోట్లకు పైగా వసూలు చేసి 300 కోట్లకు చేరువలో ఉంది.

4

అక్టోబర్ 1న హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్ పాల్గొనే OG సక్సెస్ మీట్ జరగనుంది.

OG ఘన విజయం: అభిమానుల ఆనందం

OG Success Meet : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా భారీ విజయం సాధించి థియేటర్స్ లో దూసుకుపోతుంది. దసరా హాలిడేస్ కూడా ఉండటంతో ఫ్యామిలీలు కూడా OG సినిమాకు వెళ్తున్నారు. ఈ సినిమా విజయంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ముందు నుంచి ఉన్న హైప్, పవన్ కళ్యాణ్ స్టిల్స్, సినిమాలో పవన్ లుక్స్, సాంగ్స్.. ఇవన్నీ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.(OG Success Meet)

చాన్నాళ్ల తర్వాత పవన్ భారీ సక్సెస్ కొట్టడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినిమా సెలబ్రిటీలు కూడా చాలా మంది సినిమా చూసి పొగిడారు. ఇప్పటికే OG 270 కోట్లకు పైగా వసూలు చేసి 300 కోట్లకు దూసుకెళ్తుంది. తాజాగా మెగాస్టార్ తో పాటు మెగా ఫ్యామిలీ అంతా OG సినిమా చూసి మెచ్చుకున్నారు. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడంతో మూవీ యూనిట్ సక్సెస్ మీట్ ప్లాన్ చేసింది.

270 కోట్లు వసూలు.. 300 వైపు పయనం

పవన్ కళ్యాణ్ తో OG సక్సెస్ మీట్ వివరాలు

పవన్ కళ్యాణ్ కూడా ఎలాగో హైదరాబాద్ లోనే ఉండటంతో రేపు అక్టోబర్ 1న సక్సెస్ మీట్ నిర్వహిస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ స్టార్ హోటల్ లో రేపు అక్టోబర్ 1 బుధవారం రాత్రి OG సక్సెస్ మీట్ చేయనున్నట్టు సమాచారం. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ తో పాటు మూవీ టీమ్ అంతా హాజరు కానున్నట్టు తెలుస్తుంది. దీంతో అక్టోబర్ 2 దసరా కాగా పవన్ ఫ్యాన్స్ కి ఒక రోజు ముందే పండగ వచ్చేసినట్టే అని అంటున్నారు. అయితే దీనిపై మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

OG సక్సెస్ మీట్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నా, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో ఉండటంతో ఆయన హాజరు ఖాయంగా కనిపిస్తోంది. ఈ వేడుక OG విజయాన్ని పవన్ అభిమానులకు మరింత ప్రత్యేకంగా మారుస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.