|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అద్భుతమైన సెట్‌లో ‘ఓం వీర నాగ్’ షూట్..

Published: 07-11-2025, 12:46 PM
అద్భుతమైన సెట్‌లో ‘ఓం వీర నాగ్’ షూట్..

యంగ్ హీరో విరాట్ కర్ణ నటిస్తున్న పాన్-ఇండియా మైథలాజికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘నాగబంధం’ నుండి తాజా అప్డేట్ వచ్చింది. అద్భుతమైన శివాలయం సెట్‌లో ‘ఓం వీర నాగ్’ సాంగ్ షూటింగ్ చేస్తున్నారు. విరాట్ కర్ణ ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఈ సినిమాకు హైలైట్.

Key Points

1

యంగ్ హీరో విరాట్ కర్ణ, డైరెక్టర్ అభిషేక్ నామా కాంబోలో 'నాగబంధం' మూవీ వస్తుంది.

2

రామానాయుడు స్టూడియోస్‌లో అద్భుతమైన శివాలయ సెట్‌లో 'ఓం వీర నాగ్' సాంగ్ షూటింగ్.

4

ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న పాన్-ఇండియా ఎంటర్‌టైనర్.

‘నాగబంధం’ నుండి తాజా అప్డేట్

యంగ్ హీరో విరాట్ కర్ణ, డైరెక్టర్ అభిషేక్ నామా కాంబినేషన్‌లో వస్తున్న మూవీ ‘నాగబంధం’. కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్న పాన్-ఇండియా ఎపిక్ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ నుంచి తాజాగా అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అద్భుతమైన శివాలయం సెట్‌లో గణేశ్ ఆచార్య మాస్టర్ కోరియోగ్రఫీలో హీరో విరాట్ కర్ణపై ‘ఓం వీర నాగ’ సాంగ్ షూటింగ్ చేస్తున్నారు. ఈ చిత్రంలోని ప్రధాన ఆకర్షణగా నిలవనున్న ఈ డివోషనల్ సాంగ్.. ప్రస్తుతం రామానాయుడు స్టూడియోస్‌లో అత్యద్భుతంగా నిర్మించిన శివాలయ సెట్‌లో షూట్ చేస్తున్నారు.

అంతే కాకుండా ఈ పాట కార్తీక మాసంలో చిత్రీకరించడం ఆధ్యాత్మికతకు మరింత వైభవం జోడించింది. కాగా.. ‘నాగబంధం’లో విరాట్ తన పాత్ర కోసం ఎంతో డెడికేషన్‌తో అద్భుతంగా ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ అయినట్లు తెలుస్తుంది. అంతే కాకుండా ఈ చిత్రం భక్తి, యాక్షన్, మిస్టరీని సమపాళ్లలో కలిపి ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. స్కేల్, విజువల్స్, కాన్సెప్ట్.. ఇవన్నీ తెలుగు సినిమా సరిహద్దులను దాటేలా ఉంటాయని చెబుతున్నారు మేకర్స్. ఇక భారతదేశంలోని ప్రాచీన విష్ణు ఆలయాల నేపథ్యంపై సాగే ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. ప్రమోషనల్ యాక్టివిటీస్ త్వరలో ప్రారంభం కానున్నాయి.

ఓం వీర నాగ్ సాంగ్ షూట్ విశేషాలు

విరాట్ కర్ణ ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్

‘నాగబంధం’ చిత్రం భక్తి, యాక్షన్, మిస్టరీని కలిపి ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని మేకర్స్ చెబుతున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.