
📌 Key Points
- తొలి రోజుల్లో 10% ఆక్యుపెన్సీతో ఫ్లాప్ దిశగా వెళ్లిన మాతృదేవోభవ
- వెయ్యి రూపాయల బెట్టింగ్ ప్రమోషన్ ఐడియాతో సినిమా ట్రెండ్ మారింది
- కావలిలో రోడ్డు మీద టీవీ ప్రదర్శనకు వేలాది మంది కన్నీళ్లు పెట్టుకున్నారు
- చిరంజీవి ముఠామేస్త్రి కంటే ఎక్కువగా మాతృదేవోభవకు జనాలు గుమిగూడారు
తెలుగు సినిమా చరిత్రలో మరపురాని చిత్రం మాతృదేవోభవ. తొలుత ఫ్లాప్ అనుకున్న ఈ సినిమా ఒక వినూత్న ప్రమోషన్ ఐడియాతో ఇండస్ట్రీ హిట్ అయింది. ఆసక్తికర వివరాలు ఇవిగో!
తొలి మూడు రోజుల్లో 10% ఆక్యుపెన్సీ
తెలుగు సినిమా చరిత్రలో కన్నీళ్లు పెట్టించిన అద్భుతమైన కావ్యాల్లో ‘ మాతృదేవోభవ ‘ చిత్రం ఎప్పటికీ ప్రత్యేకమైనదే. అయితే, ఈ సినిమా విడుదలైన తొలినాళ్లలో థియేటర్లలో ప్రేక్షకుల్లేక ప్లాప్ దిశగా వెళ్ళిందన్న నిజం చాలా మందికి తెలియదు. కేవలం ఒకే ఒక్క వినూత్న ప్రమోషన్ ఐడియా ఈ సినిమాను డిజాస్టర్ టాక్ నుంచి ఇండస్ట్రీ హిట్ వైపు నడిపించింది. ఈ చిత్ర అసాధారణ మార్కెటింగ్ వ్యూహం గురించి, అప్పట్లో సృష్టించిన సంచలనాల గురించి దర్శకుడు కె. అజయ్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. * సూర్య ఈజ్ బౌన్స్ బ్యాక్… ‘కరుప్పు’ సక్సెస్‌తో ఏకంగా రూ.100 కోట్ల రెమ్యునరేషన్? వెయ్యి రూపాయల బెట్టింగ్! ఈ సినిమా సమాజంపై ముఖ్యంగా అప్పట్లో ఉన్న విచ్చలవిడి మద్యపాన అలవాట్లపై తీవ్ర ప్రభావం చూపిందని అజయ్ కుమార్ తెలిపారు. సినిమా చూసిన ఎందరో వ్యక్తులు తాగుడు మానేసి, తమ పిల్లల భవిష్యత్తు కోసం మారినట్లు మహిళల నుంచి పెద్ద ఎత్తున లేఖలు వచ్చేవట. ఈ సినిమా ఎంతటి భావోద్వేగ భరితంగా సాగుతుందంటే.. “థియేటర్‌లో ఏడవకుండా ఈ సినిమాను పూర్తిగా చూస్తే వెయ్యి రూపాయలు బహుమతి” అంటూ అప్పట్లో పత్రికల్లో సవాల్ విసిరారట. ఆ రోజుల్లో వెయ్యి రూపాయలు అనేది చాలా పెద్ద మొత్తం. దీనికి ఉదాహరణగా కావలిలో జరిగిన ఒక సంఘటనను దర్శకుడు గుర్తుచేసుకున్నారు. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా ఒకే వీధిలో ఒకవైపు చిరంజీవి ‘ముఠామేస్త్రి’ సినిమాను, మరోవైపు ‘మాతృదేవోభవ’ సినిమాను వీసీడీల ద్వారా ప్రదర్శించారు. కమర్షియల్ హిట్ అయిన ముఠామేస్త్రి దగ్గర పెద్దగా జనం లేకపోగా, మాతృదేవోభవ ప్రదర్శించే టీవీ చుట్టూ జనాలు గుంపులు గుంపులుగా చేరి, రోడ్డుపైనే కూర్చుని బోరున ఏడ్చారట. టీవీల్లో చూస్తే అంతగా ఎమోషన్ కనెక్ట్ అవ్వదు అనే అపోహను దాటి జనం ఆ రోడ్డుపైనే కన్నీళ్లు పెట్టుకోవడం సినిమా సత్తాను చాటింది. * గతాన్ని మర్చిపోయి సరికొత్తగా వస్తున్నా.. మోకాళ్లపై కూర్చొని క్షమాపణలు చెప్పిన జయం రవి మొదటి మూడు రోజులు దారుణమైన పరిస్థితి ఇంతటి ఘనచరిత్ర ఉన్న ఈ సినిమా విడుదలైన మొదటి శుక్రవారం ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని దేవి థియేటర్‌లో కేవలం 10 శాతం ఆక్యుపెన్సీతో నడిచింది. శని, ఆదివారాలు గడిచినా 12 శాతానికి మించలేదు. పక్క థియేటర్లలో పాత సినిమాలు హౌస్‌ఫుల్ అవుతుంటే, ఈ సినిమా పరిస్థితి చూసి దర్శకుడికి మైండ్ బ్లాక్ అయింది. సినిమా చూసి బయటకు వచ్చిన ఒక ప్రేక్షకుడు తీవ్ర అసహనంతో, “ఇంత అద్భుతమైన సినిమాను జనాలు చూడటం లేదు.. మన వాళ్లకు బట్టలు ఊడదీసే సినిమాలే కావాలి” అంటూ నిర్మాత ముందే ఆవేదన వ్యక్తం చేశాడట. మాస్టర్ ప్లాన్‌తో తిరగబడిన బాక్సాఫీస్ థియేటర్లకు వచ్చిన వారు సినిమాను అద్భుతం అంటున్నా, కొత్తగా జనాలు రాకపోవడాన్ని గమనించిన నిర్మాత కె.ఎస్. రామారావు వెంటనే అలర్ట్ అయ్యారు. రెండ్రోజుల పాటు సుదీర్ఘంగా ఆలోచించి ఒక వినూత్న ప్రమోషన్ ప్లాన్ చేశారు. థియేటర్లో టికెట్ కొన్న ప్రతి ఒక్కరికీ ఒక కర్చీఫ్ ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు. తొలుత కర్చీఫ్‌పై కథానాయిక మాధవి బొమ్మ ముద్రించాలనుకున్నా, సమయం లేకపోవడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. మంగళవారం రాత్రి డిస్ట్రిబ్యూటర్లందరికీ ఫోన్ చేసి, ఒక రూపాయి లోపు లభించే కర్చీఫ్‌లను కొనుగోలు చేసి, బుధవారం ఉదయం కల్లా టికెట్లతో పాటు పంచాలని నిర్మాత ఆదేశించారు. ఈ ‘కర్చీఫ్ స్ట్రాటజీ’ ఊహించని విధంగా వర్కవుట్ అయింది. బుధవారం ఈ పబ్లిసిటీ మొదలవగా.. గురువారం సాయంత్రానికి వైజాగ్, రాజమండ్రి వంటి ప్రాంతాల నుంచి థియేటర్లు హౌస్‌ఫుల్ అవుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఒక్క రోజు ఈ ప్రమోషన్ ఆలస్యమై ఉంటే సినిమా థియేటర్ల నుంచి వెళ్లిపోయేదని, కానీ ఈ ఒక్క ఐడియాతో రెండో శుక్రవారం నాటికి చాలా థియేటర్లు “జనాల కోరిక మేరకు” అంటూ బోర్డులు తిప్పేసి సినిమాను కొనసాగించాయని అజయ్ కుమార్ చెప్పారు. విజయవాడలో ఒక రిక్షా కార్మికుడు కూడా ఈ సినిమా గురించి, అక్కడ ఇస్తున్న కర్చీఫ్‌ల గురించి పది మందికి రికమండ్ చేశాడంటే, ఈ సినిమా సామాన్యుల గుండెల్లోకి ఎంత బలంగా దూసుకెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. అలా ఒక చిన్న ప్రమోషన్ స్ట్రాటజీ, టాలీవుడ్‌లో ఒక క్లాసిక్ హిట్‌ను కాపాడింది.
వెయ్యి రూపాయల బెట్టింగ్ ప్రమోషన్
రోడ్డు మీద టీవీకి జనాల ఆటంకం
మాతృదేవోభవ సక్సెస్ స్టోరీ నిజంగా స్ఫూర్తిదాయకం. ఒక్క క్రియేటివ్ ఐడియా సినిమా గతిని మార్చేస్తుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాల కోసం మాతో ఉండండి.


