
📌 Key Points
- షాహిద్ కపూర్, త్రిప్తి దిమ్రి లవ్ స్టోరీ ఓటీటీలో రిలీజ్!
- తమన్నా మెరుపులు, ముంబై గ్యాంగ్‌స్టర్ కథతో రొమాంటిక్ థ్రిల్లర్!
- ఏకంగా 240 దేశాల్లో ‘ఓ రొమియో’ స్ట్రీమింగ్ అవుతోంది
- విశాల్ భరద్వాజ్, గుల్జార్ మ్యాజిక్ తో సినిమా!
టాలీవుడ్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్! షాహిద్ కపూర్, తమన్నా నటించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఓ రొమియో’ ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమా 240 దేశాల్లో స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం.
ఓటీటీలో రొమాంటిక్ యాక్షన్ మూవీ రిలీజ్
O’Romeo OTT: లేటెస్ట్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఓ రొమియో’ మూవీ ఈ రోజు ఓటీటీలో రిలీజైంది. షాహిద్ కపూర్, త్రిప్తి దిమ్రి, తమన్నా, దిశా పటానీ తదితరులు నటించిన ఈ సినిమా ఏకంగా 240 దేశాల్లో డిజిటల్ డెబ్యూ చేసింది.
O’Romeo OTT: ఇండియన్ సినీ లవర్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్న రోజు రానే వచ్చింది. బాలీవుడ్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఓ రోమియో’ (O’Romeo) మూవీ ఓటీటీలో అడుగుపెట్టింది. ఈ రోజు (ఏప్రిల్ 10) నుంచే గ్లోబల్ ప్రీమియర్ అవుతోంది. ఇది ముంబై గ్యాంగ్ స్టర్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించిన మూవీ.
తమన్నా మెరుపులతో గ్యాంగ్‌స్టర్ స్టోరీ
తన ప్రియుడు బిల్లు హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని తహతహలాడుతున్న అఫ్షాన్ (త్రిప్తి దిమ్రి) ఉస్తారా జీవితంలోకి ప్రవేశించడంతో కథ అనూహ్య మలుపు తిరుగుతుంది. హింస, విధేయత మధ్య మొదలైన ఈ ప్రయాణం.. చివరికి ప్రేమ, ద్రోహం, సర్వైవల్ కోసం పోరాటంగా ఎలా మారిందనేది దర్శకుడు అత్యంత ఉత్కంఠభరితంగా ఆవిష్కరించాడు.
240 దేశాల్లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ఓ రొమియో’
విశాల్ భరద్వాజ్ – గుల్జార్ మ్యాజిక్
ఓ రొమియో మూవీ ఓటీటీలో దుమ్ము రేపుతోంది. రొమాంటిక్ యాక్షన్ సన్నివేశాలతో సినిమా అభిమానులను అలరిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


