|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓరీపై ట్రోలింగ్‌.. కొంచెమైనా బుద్ధుందా? అవేం మాటలు!

Published: 08-11-2025, 5:29 AM
ఓరీపై ట్రోలింగ్‌.. కొంచెమైనా బుద్ధుందా? అవేం మాటలు!

సెలబ్రిటీల కామన్ ఫ్రెండ్‌గా పేరుగాంచిన ఓరీ.. తాజాగా తీవ్ర ట్రోలింగ్‌కు గురయ్యాడు. ఫరా ఖాన్ నిర్వహిస్తున్న ఓ షోలో ఆడవేషంలో ఉన్నవారిపై చేసిన వ్యాఖ్యలు, ‘చెక్క’ అనే పదాన్ని వాడటంపై నెటిజన్లు మండిపడుతున్నారు. బుద్ధి లేదా అంటూ నిలదీస్తున్నారు.

Key Points

1

కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ షోకు ఓరీ హాజరయ్యారు.

2

ఓరీ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో 'చెక్క' పదాన్ని ఉపయోగించారు.

4

ఓరీ సెలబ్రిటీ పార్టీలకు హాజరై డబ్బు సంపాదించే ఓ ఇన్‌ఫ్లుయెన్సర్.

ఓరీపై నెటిజన్ల ఆగ్రహం ఎందుకు?

సెలబ్రిటీలందరికీ కామన్‌ ఫ్రెండ్‌ ఓరీ ( Orhan Awatramani ). ఎక్కడైనా ఏదైనా పార్టీ జరుగుతుందన్నా.. ఈవెంట్‌ అవుతుందన్నా వెంటనే అక్కడ ప్రత్యక్షమైపోతాడు. హీరోహీరోయిన్లపై చేతులు వేసి చనువుగా ఫోటోలు దిగుతుంటాడు. ముఖ్యంగా జాన్వీ, ఖుషి కపూర్‌లకైతే బెస్ట్‌ ఫ్రెండ్‌ అనే చెప్పొచ్చు. విచిత్ర వేషధారణతో కనిపించే ఓరీ.. తాజాగా విమర్శలపాలయ్యాడు.

ఆడవేషంలో ఉన్నవారిపై జోక్స్‌ కొరియోగ్రాఫర్‌, దర్శకురాలు ఫరా ఖాన్‌ ( Farah Khan ) నిర్వహిస్తున్న టాలెంట్‌ షో ఆంటీ కిస్కో బోలాకి ఓరీ హాజరయ్యాడు. ఆడవారిలా చీర కట్టుకుని రెడీ అయిన అబ్బాయిల మధ్యలో ఓరీ కూర్చున్నాడు. అందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఓ కామెడీ షోకి వచ్చా.. ఇద్దరు చెక్కగాళ్లు నా ముందే గొడవపడుతున్నారు. ఇలా కొట్టుకుంటున్నారేంటి? అని రాసుకొచ్చాడు.

ఫరా ఖాన్ షోలో ఏం జరిగింది?

సరదాగా ఉందా? ఈ వీడియో వైరల్‌గా మారగా ఓరీపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెక్క అనే పదాన్ని వాడటం నీకు సరదాగా ఉందా? అలా ఎలా అనగలిగావు? కొంచెమైనా బుద్ధి లేదా? అని మండిపడుతున్నారు. కొందరు పేరుకే ధనవంతులు కానీ, విలువలు తెలియవు.. ఒక కమ్యూనిటీని తక్కువ చేసి మాట్లాడటం కరెక్ట్‌ కాదు అని ఆగ్రహిస్తున్నారు.

ఓరీ ఏం చేస్తుంటాడు? ఓరీ.. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌. ఇతడు న్యూయార్క్‌లో మోడలింగ్‌ నేర్చుకున్నాడు. న్యూయార్క్‌లో పార్సన్స్‌ స్కూల్‌ ఆఫ్‌ డిజైన్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేశాడు. ఓ కంపెనీలో ప్రాజెక్ట్‌ మేనేజర్‌గానూ వర్క్‌ చేశాడు. సెలబ్రిటీల పార్టీలకు మాజరై అక్కడున్నవారితో ఫోటోలు దిగుతాడు. ఇలా పార్టీలకు వెళ్లి, ఫోటోలు దిగి రూ.20-30 లక్షలు సంపాదిస్తాడు. మోడల్‌గానూ ప్రాజెక్టులు చేస్తూ డబ్బు సంపాదిస్తున్నాడు. తనకు ఐదుగురు మేనేజర్లున్నారు.

ఎవరీ ఓరీ? అతని ఆదాయం ఎంత?

ఓరీ వ్యాఖ్యలపై రేగిన ఈ వివాదం సెలబ్రిటీల బాధ్యతారహిత ప్రవర్తనను, సోషల్ మీడియాలో పదాల ఎంపిక ప్రాముఖ్యతను మరోసారి గుర్తుచేసింది. ఇతనిపై వస్తున్న విమర్శలు ఆన్‌లైన్ ప్రవర్తనపై చర్చను రేకెత్తించాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.