
📌 Key Points
- ఉత్తమ నటుడిగా మైఖేల్ బి జోర్డన్ సంచలనం, ‘సిన్నర్స్’ చిత్రానికి ఆస్కార్
- ఉత్తమ నటిగా జెస్సీ బుక్లే విజయం, ‘హమ్నెట్’ మూవీతో సెన్సేషన్
- ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ మూవీకి ఆరు ఆస్కార్‌లు, పాల్ థామస్‌కు దర్శకుడిగా అవార్డుల వర్షం
- భారతీయ చిత్రాలకు నిరాశ, ‘సిన్నర్స్’ మూవీకి విజువల్ ఎఫెక్ట్స్‌లో ప్రత్యేక గుర్తింపు
98వ ఆస్కార్ అవార్డుల వేడుక టాలీవుడ్‌లో హాట్ టాపిక్! ఏ సినిమా ఎన్ని అవార్డులు గెలుచుకుంది? మన తారలకు ఏమైనా అవార్డులు వచ్చాయా? తెలుసుకోవాలంటే చదవండి!
ఉత్తమ నటుడు ఎవరో తెలుసా?
98వ అకాడమీ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. క్రేజీ సినిమాలు ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకున్నాయి. భారతీయ చిత్రాలకు ఈ సారి నిరాశే ఎదురయ్యింది. అలాగే `వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్`, `సిన్నర్స్` చిత్రాలకు అవార్డులు దక్కాయి. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ మూవీకి ఆరు, సిన్నర్స్ కి ఐదు అవార్డులు దక్కాయి. ఉత్తమ నటుడిగా మైఖేల్ బి జోర్డన్ నిలిచారు. సిన్నర్స్ చిత్రానికి గానూ ఆయనకు ఈ పురస్కారం దక్కింది. అలాగే ఉత్తమ నటిగా జెస్సీ బుక్లే కి ఆస్కార్ వరించింది. ఆమెకి హమ్నెట్ మూవీకి ఈ అవార్డు దక్కడం విశేషం. ఇక వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ మూవీకిగానూ పాల్ థామస్ ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్‌ని సొంతం చేస్తున్నారు. అంతేకాదు ఇదే మూవీ ఉత్తమ చిత్రంగానూ నిలిచింది.
ఉత్తమ చిత్రం: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
ఉత్తమ నటుడు: మైఖేల్ బి జోర్డన్ (సిన్సర్స్)
ఉత్తమ నటి: జెస్సీ బుక్లే (హమ్నెట్)
ఉత్తమ దర్శకుడు: పాల్ థామస్ అండర్సన్(వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)
ఉత్తమ సహాయ నటుడు: ఈన్ పెన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)
ఉత్తమ సహాయ నటి: ఎమీ మాడిగన్(వెపన్స్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఆటమ్ డురాల్డ్ అర్కపా(సిన్నర్స్)
ఉత్తమ ఎడిటింగ్: యాండీ జుర్గెన్ సన్(వన్ బ్యాటిల్ అఫ్టర్ అనదర్ )
ఏ మూవీకి ఎన్ని అవార్డులో?
ఉత్తమ సంగీతం: లుడ్విగ్ గోరాన్సన్(సిన్నర్స్)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్: అవతార్ ఫైర్ అండ్ యాష్
ఉత్తమ ఒరిజినల్ స్కోర్: సిన్నర్స్
ఉత్తమ ఒరిజినల్ సాంగ్ : గోల్డెన్ ఫ్రమ్ కేపాప్ డీమాన్ హంటర్స్
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: ర్యాన్ కూగ్లర్ (సిన్నర్స్)
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: పాల్ థామస్ అండర్సన్(వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)
ఉత్తమ క్యాస్టింగ్ : వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: ఫ్రాంకిన్ స్టన్
భారతీయ చిత్రాలకు నిరాశేనా?
ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టయిలింగ్: ఫ్రాంకిన్ స్టన్
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: తమర డేవెరల్, షేన్ వ్యూ(ఫ్రాంకిన్ స్టన్)
ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్: సెంటిమెంటల్ వ్యాల్యూ(నార్వే)
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: కెపాస్ డెమన్ హంట్స్
ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: ది గర్ల్ హు క్రైడ్ పెరల్స్
ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ది సింగర్స్, టూ పీపుల్ ఎక్స్జేంచ్ సలైవా
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: మిస్టర్ నోబడీ ఎగనెస్ట్ పుతిన్
ఉత్తమ డాక్యుమెంటరీ ఆర్ట్ ఫిల్మ్: ఆల్ ది ఎంప్టీ రూమ్స్
ఆస్కార్ అవార్డుల వేడుక ముగిసింది. విజేతల వివరాలు చూశారుగా. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి!


