|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీ అవార్డ్స్ 2025.. ఉత్తమ నటి సమంత.. ఆ సినిమా, వెబ్ సిరీస్‌కు అవార్డుల పంట.. తెలుగు ఇండియన్ ఐడల్‌కు అవార్డు

Published: 29-09-2025, 10:06 AM
ఓటీటీ అవార్డ్స్ 2025.. ఉత్తమ నటి సమంత.. ఆ సినిమా, వెబ్ సిరీస్‌కు అవార్డుల పంట.. తెలుగు ఇండియన్ ఐడల్‌కు అవార్డు

ఇండియన్ స్ట్రీమింగ్ అకాడెమీ అవార్డ్స్ 2025 వేడుకలు ముంబైలో ఘనంగా జరిగాయి. ఈ అవార్డులలో సమంత రుత్ ప్రభు ఉత్తమ నటిగా నిలిచారు. అమర్ సింగ్ చమ్కీలా, పోచర్ వంటి సినిమాలు, వెబ్ సిరీస్‌లకు అవార్డుల పంట పండగా, తెలుగు ఇండియన్ ఐడల్‌కు కూడా పురస్కారం లభించింది.

Key Points

1

ఇండియన్ స్ట్రీమింగ్ అకాడెమీ అవార్డ్స్ 2025 వేడుకలు ముంబైలో జరిగాయి.

2

సిటాడెల్ హనీ బన్నీ కోసం సమంత ఉత్తమ నటి (పాపులర్) అవార్డు గెలుచుకున్నారు.

4

బెస్ట్ నాన్-ఫిక్షన్ ఒరిజినల్ కేటగిరీలో తెలుగు ఇండియన్ ఐడల్‌కు అవార్డు లభించింది.

ఇండియన్ స్ట్రీమింగ్ అకాడెమీ అవార్డుల విశేషాలు

ఓటీటీల్లోకి నేరుగా వచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్ లకు అవార్డులు ఇచ్చే ఉద్దేశంతో మొదలైంది ఇండియన్ స్ట్రీమింగ్ అకాడెమీ అవార్డులు. ఈ ఏడాదికి సంబంధించి ఈ కార్యక్రమం శనివారం (సెప్టెంబర్ 27) రాత్రి ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగింది.

సమంత ఉత్తమ నటి అవార్డు అందుకోవడం విశేషం. ఇక అమర్ సింగ్ చమ్కీలా మూవీ, పోచర్ వెబ్ సిరీస్ ఆయా కేటగిరీలలో ఎక్కువ అవార్డులు గెలుచుకోగా.. సమంత రుత్ ప్రభు, వరుణ్ ధావన్, పరిణీతి చోప్రా లాంటి పెద్ద స్టార్లు తమ పర్ఫార్మెన్స్‌కు పాపులర్ అవార్డులను గెలుచుకున్నారు.

బెస్ట్ డైరెక్టర్ (సిరీస్): జై మెహతా (లూటేరే)

బెస్ట్ యాక్టర్ – పాపులర్ (సిరీస్): వరుణ్ ధావన్ (సిటాడెల్ హనీ బన్నీ)

బెస్ట్ యాక్టర్ – క్రిటిక్స్ (సిరీస్): జితేంద్ర కుమార్ (పంచాయత్)

బెస్ట్ యాక్ట్రెస్ – పాపులర్ (సిరీస్): సమంత రూత్ ప్రభు (సిటాడెల్ హనీ బన్నీ)

బెస్ట్ యాక్ట్రెస్ – క్రిటిక్స్ (సిరీస్): సోనాలి బింద్రే (ది బ్రోకెన్ న్యూస్)

బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ (సిరీస్): సికిందర్ ఖేర్ (ఆర్య)

బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ (సిరీస్): సాన్వికా (పంచాయత్)

బెస్ట్ నాన్-ఫిక్షన్ ఒరిజినల్, సిరీస్/స్పెషల్: ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో, ఫాబులస్ లైవ్స్ వర్సెస్ బాలీవుడ్ వైవ్స్

బెస్ట్ వెబ్ ఒరిజినల్ ఫిల్మ్: అమర్ సింగ్ చమ్కీలా

బెస్ట్ డైరెక్టర్ (ఫిల్మ్): సిద్ధార్థ్ పి మల్హోత్రా (మహారాజ్)

బెస్ట్ యాక్టర్ – పాపులర్ (ఫిల్మ్): విక్రాంత్ మస్సే (సెక్టార్ 36)

బెస్ట్ యాక్టర్ – క్రిటిక్స్ (ఫిల్మ్): దిల్జిత్ దోసాంజ్ (అమర్ సింగ్ చమ్కీలా)

బెస్ట్ యాక్ట్రెస్ – పాపులర్ (ఫిల్మ్): పరిణీతి చోప్రా (అమర్ సింగ్ చమ్కీలా)

సమంతకు ఉత్తమ నటి అవార్డు: పూర్తి వివరాలు

బెస్ట్ యాక్ట్రెస్ – క్రిటిక్స్ (ఫిల్మ్): దివ్య దత్తా (శర్మాజీ కి బేటి)

బెస్ట్ డాక్యుమెంటరీ: యో యో హనీ సింగ్: ఫేమస్

బెస్ట్ ఒరిజినల్ స్టోరీ (సిరీస్): చందన్ కుమార్ (పంచాయత్)

బెస్ట్ సినిమాటోగ్రాఫర్ (సిరీస్): జల్ కోవాస్జీ (లూటేరే)

బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ (సిరీస్): అమిత్ రే, సుబ్రతా చక్రవర్తి (హీరామండి)

బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ (సిరీస్): రింపిల్ హర్‌ప్రీత్ నారులా (హీరామండి)

బెస్ట్ ఒరిజినల్ సౌండ్‌ట్రాక్ (సిరీస్): అనా రెహమాన్ (బండిష్ బాండిట్స్)

బెస్ట్ ఒరిజినల్ స్టోరీ (ఫిల్మ్): ఇంతియాజ్ అలీ (అమర్ సింగ్ చమ్కీలా)

బెస్ట్ సినిమాటోగ్రాఫర్ (ఫిల్మ్): సిల్వెస్టర్ ఫోన్సెకా (అమర్ సింగ్ చమ్కీలా)

బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ (ఫిల్మ్): అమిత్ రే, సుబ్రతా చక్రవర్తి (మహారాజ్)

బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ (ఫిల్మ్): మాగ్జిమా బసు (మహారాజ్)

బెస్ట్ ఒరిజినల్ సౌండ్‌ట్రాక్ (ఫిల్మ్): ఏఆర్ రెహమాన్ (అమర్ సింగ్ చమ్కీలా)

బెస్ట్ డైరెక్టర్ (సిరీస్): జి వసంతబాలన్ (తలైమై సయలగం)

బెస్ట్ యాక్టర్ – పాపులర్ (సిరీస్): రోషన్ మాథ్యూ (పోచర్)

బెస్ట్ యాక్టర్ – క్రిటిక్స్ (సిరీస్): అశుతోష్ గోవారికర్ (మన్వత్ మర్డర్స్)

అవార్డుల పంట పండిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు

బెస్ట్ యాక్ట్రెస్ – (సిరీస్): శ్రియా రెడ్డి (తలైమై సయలగం)

బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ (సిరీస్): దిబ్యేందు భట్టాచార్య (పోచర్)

బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ (సిరీస్): సోనాలి కులకర్ణి (మన్వత్ మర్డర్స్)

బెస్ట్ వెబ్ ఒరిజినల్ ఫిల్మ్: చాల్‌చిత్ర ఎఖోన్

బెస్ట్ డైరెక్టర్ (ఫిల్మ్): అంజన్ దత్ (చాల్‌చిత్ర ఎఖోన్)

బెస్ట్ యాక్టర్ – (ఫిల్మ్): సావోన్ చక్రవర్తి (చాల్‌చిత్ర ఎఖోన్)

బెస్ట్ యాక్ట్రెస్ – (ఫిల్మ్): పూర్ణిమ రవి (సెవప్పి)

బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ (ఫిల్మ్): మేఘ్లా దాస్‌గుప్తా (చాల్‌చిత్ర ఎఖోన్)

బెస్ట్ ఒరిజినల్ స్టోరీ (సిరీస్): సురేష్ జై (హరికథ)

బెస్ట్ సినిమాటోగ్రాఫర్ (సిరీస్): జోహన్ హర్లిన్ ఐడ్‌ట్ (పోచర్)

బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ (సిరీస్): మందార్ నాగ్‌వాంకార్ (పోచర్)

బెస్ట్ ఒరిజినల్ సౌండ్‌ట్రాక్ (సిరీస్): యువన్ శంకర్ రాజా (పారాచూట్)

గతేడాది ఈ ఇండియన్ స్ట్రీమింగ్ అకాడెమీ అవార్డులు మొదలయ్యాయి. ఈసారి అవార్డుల వేడుక సందర్భంగా అకాడమీ అవార్డ్స్ వైస్ ప్రెసిడెంట్ రాజ్ నాయక్ మాట్లాడారు. “గతేడాది మేము ఇండియన్ స్ట్రీమింగ్ అకాడమీ అవార్డ్స్‌ను మొదలుపెట్టినప్పుడు ఇది ఒక ఆలోచన మాత్రమే. ఇండియాలో ఓటీటీ ఇండస్ట్రీకి అన్ని భాషల ప్రాంతాల టాలెంట్‌ను సెలబ్రేట్ చేసే ఒక ప్లాట్‌ఫారమ్ ఉండాలి అని. మా రెండో సంవత్సరంలో ఈ రెస్పాన్స్ మూడు రెట్లు పెరగడం చాలా గర్వంగా ఉంది. మేము నిజమైన, నమ్మదగిన, ఇండస్ట్రీ మొత్తానికి చెందినదాన్ని నిర్మిస్తున్నామని ఇది చెబుతోంది. నాకైతే, ఈ ప్రయాణంలో ఇదే అత్యంత రివార్డింగ్ భాగం” అని చెప్పారు.

ఈ అవార్డ్స్ నైట్‌కి సమంత రుత్ ప్రభు, సోనాలి బింద్రే, అశుతోష్ గోవారికర్, దివ్య దత్తా, సోనాలి కులకర్ణి, రాజ్ అండ్ డీకే, గునీత్ మోంగా, రోషన్ మాథ్యూ, నిమిషా సజయన్ లాంటి చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు.

ఓటీటీ వేదికలపై సత్తా చాటిన తారలు, కంటెంట్‌ను ఇండియన్ స్ట్రీమింగ్ అకాడెమీ అవార్డ్స్ గుర్తించాయి. సమంత, వరుణ్ ధావన్, పరిణీతి చోప్రా లాంటి వారికి అవార్డులు దక్కడం ప్రేక్షకులను సంతోషపరిచింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.