
నవీన్ చంద్ర నటించిన ‘ఎలెవెన్’ అనే క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ఆహా ఓటీటీలో జూన్ 13న విడుదల కానుంది. విశాఖపట్నం నేపథ్యంలో వరుస హత్యలు, ఒక పోలీసు అధికారి యొక్క కష్టతరమైన దర్యాప్తు ఇందులో ప్రధానంగా ఉన్నాయి.
Key Points
నవీన్ చంద్ర నటించిన 'ఎలెవెన్' సినిమా ఓటీటీలోకి
ఆహా ఓటీటీలో జూన్ 13 నుంచి స్ట్రీమింగ్
క్రైమ్ థ్రిల్లర్‌గా ఆకట్టుకున్న ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను ఆకర్షించనుంది
ఎలెవెన్ సినిమా ఓటీటీ విడుదల
డిఫరెంట్ కథలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో నవీన్ చంద్ర నటించిన లేటెస్ట్ మూవీ ‘ఎలెవన్’. లోకేశ్ అజిల్స్ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో.. రియా హరి, శశాంక్, అభిరామి, దిలీపన్, ఆడుకాలం నరేన్, రవి వర్మ, కిరీటి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఎ.ఆర్.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అజ్మల్ ఖాన్, రేయా హరి నిర్మించిన ‘ఎలెవన్’ మూవీ గత నెల 16న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధం అయింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకోగా.. జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది.
కథాంశం: వరుస హత్యలు మరియు పోలీసుల దర్యాప్తు
ఇక ఈ సినిమా కథ విషాయానికి వస్తే.. విశాఖపట్నంలోని జరిగే వరుస హత్యలు పోలీసులుకు నిద్ర లేకుండా చేస్తాయి.. అప్పటికే ఈ కేస్ డీల్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ శశాంక్‌కు ప్రమాదం జరగడంతో.. ఆయన ప్లేస్‌లో ఇన్వెస్టిగేషన్ చేసేందుకు నవీన్ చంద్ర రంగంలోకి దిగుతాడు. అయినా హత్యలు ఆగకుండా జరుగుతూనే ఉంటాయి.. అంతే కాకుండా హత్యకు గురైన వారి ఆనవాళ్లు కూడా దొరకవు. దీంతో నవీన్ చంద్ర ఎలా కిల్లర్‌ను పట్టుకుంటాడు అనేది ఎంతో ఆసక్తికంగా సాగుతోంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీపై అనౌన్స్‌మెంట్ రావడంతో ప్రేక్షకులు ఖుష్ అవుతున్నారు.
నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు
A post shared by OTT Trackers (@ott_trackers)
చివరిగా, ‘ఎలెవెన్’ సినిమా ఓటీటీలో విడుదల కావడంతో ప్రేక్షకులు ఇంటి వద్దనే ఈ థ్రిల్లింగ్ కథను ఆస్వాదించే అవకాశం లభించింది.


