
నటీమణి భావన నటించిన ‘ది హంట్’ అనే హారర్ థ్రిల్లర్ సినిమా ఇటీవల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదలైంది. ఊహించని ట్విస్టులు, భావన అద్భుతమైన నటనతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
Key Points
భావన నటించిన 'ది హంట్' సినిమా ఓటీటీలోకి
ఊహించని ట్విస్టులతో కూడిన హారర్ థ్రిల్లర్
భావన నటనకు విమర్శకుల ప్రశంసలు
భావన హారర్ రోల్
హీరో శ్రీకాంత్ నటించిన ‘మహాత్మ’ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ భావన (Bhavana). తర్వాత టాలీవుడ్‌లో ఆఫర్స్ తగ్గడంతో కన్నడ, మలయాళంపై ఫోకస్ పెట్టి అక్కడ సినిమాల్లో నటించింది. ఇక పెళ్లి అనంతరం కొన్నాళ్లు మూవీస్‌కు బ్రేక్ ఇచ్చిన భావన.. ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి లేడీ ఓరియెంటెడ్, హారర్, థ్రిల్లర్ చిత్రాలు చేస్తూ సందడి చేస్తుంది. ఇందులో భాగంగానే ఈ హీరోయిన్ ఇటీవల ‘ది హంట్’ (Hunt) అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఊహించని ట్విస్టులతో హారర్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీకి షాజీ కైలాస్ దర్శకత్వం వహించారు. గతేడాది రిలీజైనా ఈ మూవీ మొదటి షోతోనే మిక్సిడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఇందులో భావన పర్ఫామెన్స్‌కు మాత్రం విమర్శకుల ప్రశంసలు అందాయి. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం ఇప్పటికే పలు ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉండగా.. తాజాగా సింప్లీసౌత్ యాప్‌లోకి కూడా స్ట్రీమింగ్‌కు రాబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు హంట్-మే 23 నుండి ప్రసారం కాబోతున్నట్లు షేర్ చేసిన పోస్టర్ ప్రజెంట్ వైరల్ అవుతోంది.
Bhavana’s #Hunt , streaming from May 23rd on @SimplySouthApp !! 🍿 #OTT_Trackers pic.twitter.com/QEQp3R6z9m
ఊహించని ట్విస్టులు
SimplySouth OTT రిలీజ్
చివరగా, భావన నటనకు ప్రశంసలు అందుకున్న ‘ది హంట్’ సినిమా SimplySouth యాప్ ద్వారా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఇందులోని ఊహించని ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని భావిస్తున్నారు.


