
ఓటీటీలో హారర్ థ్రిల్లర్ జోనర్ ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అలాంటి సినిమాలలో జారన్ ఒకటి. చేతబడులతో కొట్టుమిట్టాడే ఒక కుటుంబం కథ ఇది. అద్భుతమైన ట్విస్టులతో నిండి ఉంటుంది.
Key Points
ఓటీటీలో టాప్ 2లో ట్రెండింగ్‌లో ఉన్న హారర్ థ్రిల్లర్ జారన్.
చేతబడులతో కుటుంబం ఎదుర్కొనే పోరాటాన్ని చూపించే కథ.
అదిరిపోయే ట్విస్టులు, ఊహించని ట్విస్టులతో నిండి ఉన్న సినిమా.
IMDb 7.1 రేటింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
జారన్: చేతబడులతో కూడిన హారర్ థ్రిల్లర్
ఓటీటీ ఆడియెన్స్ ఎక్కువగా మెచ్చి జోనర్లలో హారర్ థ్రిల్లర్ ఒకటి. రెగ్యులర్‌గా ఏదో ఒక సినిమా ఈ హారర్ జోనర్‌లో వస్తుంటుంది. ఆ హారర్ జోనర్ సినిమాలకు కామెడీ, యాక్షన్, అడ్వెంచర్, సైకలాజికల్, క్రైమ్ వంటి అంశాలను మిళితం చేసి కూడా తెరకెక్కిస్తుంటారు దర్శకనిర్మాతలు.
ఇక ఇటీవల వచ్చి బెస్ట్ అనిపించుకున్న హారర్ థ్రిల్లర్స్‌లలో జారన్ ఒకటి. ఇది ఒక మరాఠీ సినిమా. జారన్ అంటే మరాఠీలో చేతబడి అనే అర్థం వస్తుంది. రాధ అనే మహిళ కుటుంబం చేతబడికి గురవుతుంది. రాధ ఇంట్లో ఏమాత్రం ప్రశాంతత, సంతోషం లేకుండా బిక్కిబిక్కుమంటూ జీవిస్తుంది.
రాధకు భర్త, కుమార్తె ఉంటారు. రాధకు చిన్నప్పుడు కూడా చేతబడి జరుగుతుంది. చిన్నతనం నుంచే రాధ కుటుంబం చేతబడితో కొట్టుమిట్టాడుతుంటుంది. అసలు రాధకు ఎవరు చేతబడి చేస్తున్నారు?, ఆమె కుటుంబంపై ఎవరికి పగ ఉంది?, ఎందుకు ఉంది?, చివరికి చేతబడి కారణంగా రాధకు ఏమైంది?, ఆ బ్లాక్ మ్యాజిక్ నుంచి రాధ, రాధ కుటుంబం తప్పించుకుందా? అనేదే జారన్ సినిమా కథ.
అదిరిపోయే ట్విస్టులు, ఉత్కంఠభరితమైన కథ
జూన్ నెలలో వచ్చిన మరాఠి సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమానే జారన్. ఈ సినిమాకు హృషికేష్ గుప్తే కథ అందించడంతోపాటు దర్శకత్వం వహించారు. అనీస్ బజ్మీ నిర్మాతగా వ్యవహరించి నిర్మించారు. జారన్ సినిమాలో హిందీ నటి, సేక్రెడ్ గేమ్ సిరీస్ ఫేమ్ అమృత సుభాష్, అనితా కేల్కర్ ప్రధాన పాత్రలు పోషించారు.
సోనాలీ కులకర్ణి టైటిల్ రోల్ అయిన జారన్‌గా నటించింది. జూన్ 6న థియేటర్లలో విడుదలైన జారన్ మంచి రెస్పాన్సే అందుకుంది. ఐఎమ్‌డీబీ నుంచి పదికి 7.1 రేటింగ్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకున్న జారన్ ఓటీటీ లోకి వచ్చేసింది.
ఓటీటీలో విజయవంతమైన ప్రయాణం
ఆగస్ట్ 8 నుంచి జారన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. జీ5లో జారన్ ఓటీటీ రిలీజ్ అయింది. అంటే, మూడు రోజుల క్రితం జీ5 ఓటీటీలో జారన్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఓటీటీ రిలీజ్ అయిన రోజు నుంచే జారన్ ట్రెండింగ్ అవుతోంది. జీ5లో గత 3 రోజుల నుంచి టాప్ 2 స్థానంలో జారన్ ఓటీటీ ట్రెండింగ్ అవుతోంది.
భాష మీద సంబంధం లేకుండా ఓటీటీ సినిమాలను వీక్షించే వారికి జారన్ మంచి హారర్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. అదిరిపోయే ట్విస్టులతో సాగే జారన్ సినిమాను మరాఠీ భాషలో జీ5 ఓటీటీ లో ఎంచక్కా చూసేయొచ్చు.
జారన్ సినిమా ఓటీటీలో అద్భుతమైన విజయం సాధించింది. అదిరిపోయే ట్విస్టులు, 7.1 IMDb రేటింగ్ దీనికి నిదర్శనం. హారర్ థ్రిల్లర్ ప్రేమికులు తప్పకుండా చూడదగిన చిత్రమిది.


