|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

OTT Movie: మలయాళ హిట్ సినిమా ‘జింఖానా’.. ఓటీటీ డేట్ ఫిక్స్

Updated: 14-06-2025, 8:45 AM
OTT Movie: మలయాళ హిట్ సినిమా 'జింఖానా'.. ఓటీటీ డేట్ ఫిక్స్

‘ప్రేమలు’ సినిమాతో పేరు తెచ్చుకున్న నస్లేన్ నటించిన ‘జింఖానా’ మలయాళం, తెలుగులో థియేటర్లలో విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రయాణం ప్రారంభం కాబోతోంది.

Key Points

1

మలయాళ హిట్ సినిమా 'జింఖానా' ఓటీటీలోకి

2

జూన్ 13 నుండి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

4

నస్లేన్, మమిత బైజు నటించిన ఈ చిత్రం థియేటర్లలో విజయవంతమైంది

‘జింఖానా’ సినిమా వివరాలు

‘ప్రేమలు’ సినిమాతో హీరోయిన్ మమిత బైజు గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సూర్య, ప్రదీప్ రంగనాథన్ లాంటి హీరోలతో మూవీస్ చేస్తోంది. ఇదే చిత్రంలో హీరోగా నటించిన నస్లేన్ కూడా వరస సినిమాలు చేస్తున్నాడు. అలా ఇతడు నటించిన లేటెస్ట్ మూవీ.. మలయాళంతో పాటు తెలుగులోనూ థియేటర్లలో రిలీజై హిట్ కొట్టింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇంతకీ ఆ చిత్రం సంగతేంటి? ఎందులో రానుంది?

‘ప్రేమలు’ హీరో నస్లేన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘జింఖానా’. ఏప్రిల్ 10న మలయాళ వెర్షన్ రిలీజ్ కాగా.. ఇదే నెల చివర్లో తెలుగు వెర్షన్ థియేటర్లలోకి వచ్చింది. పాజిటివ్ టాక్‌తో పాటు ఓ మాదిరి కలెక్షన్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రం సోనీ లివ్ ఓటీటీలో జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుందని అధికారికంగా ప్రకటించారు.

ఓటీటీ రిలీజ్ తేదీ

భాషలు మరియు అందుబాటు

‘జింఖానా’ సినిమా విషయానికొస్తే.. అలప్పుజాకు చెందిన ఆకతాయి కుర్రాళ్లు జాన్సన్ (నస్లేన్)తో పాటు మరో ఐదుగురు ఫ్రెండ్స్. వీళ్లలో షణవాస్ అనే కుర్రాడు తప్పితే మిగిలిన వాళ్లంతా 12వ తరగతిలో ఫెయిల్. దీంతో డిగ్రీ చదవాలంటే స్పోర్ట్స్ కోటా ద్వారా వెళ్లాలనుకుంటారు. అలా బాక్సింగ్ నేర్చుకుంటారు. స్థానికంగా ‘అలప్పుజా జింఖానా’ అకాడమీలో శిక్షణ తీసుకోవడం ప్రారంభిస్తారు. స్థానిక పోటీల్లో ఎలాగో గెలిచిన కుర్రాళ్ల గ్యాంగ్‌.. కేరళ స్టేట్‌ బాక్సింగ్‌ పోటీల్లో పాల్గొనేందుకు రెడీ అవుతుంది. ఫ్రొఫెషనల్‌ ఆటగాళ్లు ఉండే ఆ బాక్సింగ్‌ పోటీల్లో ఈ ఆకతాయి గ్యాంగ్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? గెలిచారా లేదా అనేది మిగతా స్టోరీ.

చివరగా, ‘జింఖానా’ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. జూన్ 13 నుంచి సోనీ లివ్‌లో అన్ని భాషల్లో చూడొచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.