|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీలో అదరగొడుతున్న సైకలాజికల్ థ్రిల్లర్.. ప్రైమ్ వీడియో ట్రెండింగ్ నంబర్ వన్.. టాప్-5 మూవీస్ ఇవే.. ఓ లుక్కేయండి

Published: 04-10-2025, 3:55 PM
ఓటీటీలో అదరగొడుతున్న సైకలాజికల్ థ్రిల్లర్.. ప్రైమ్ వీడియో ట్రెండింగ్ నంబర్ వన్.. టాప్-5 మూవీస్ ఇవే.. ఓ లుక్కేయండి

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓ తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ ‘మదరాసి’ దూసుకుపోతోంది. ప్రస్తుతం నంబర్ వన్ గా ట్రెండ్ అవుతున్న ఈ సినిమాతో పాటు, టాప్ 5లో నిలిచిన ఇతర చిత్రాలను కూడా ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. మరి ఆ సినిమాలు ఏంటి, వాటి విశేషాలు ఏంటో చూద్దాం.

Key Points

1

తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ 'మదరాసి' ప్రైమ్ వీడియోలో నంబర్ వన్ ట్రెండింగ్.

2

రజనీకాంత్ బ్లాక్ బస్టర్ మూవీ 'కూలీ' ప్రైమ్ వీడియోలో రెండో స్థానంలో ఉంది.

4

అనుష్క లీడ్ రోల్ 'ఘాటి', రాజ్ కుమార్ రావు 'మాలిక్' టాప్-5లో ఉన్నాయి.

ప్రైమ్ వీడియోలో నంబర్ 1: మదరాసి

తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ ‘మదరాసి’ ఓటీటీలో అదరగొడుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ డిజిటల్ స్ట్రీమింగ్ లో ఆడియన్స్ ను బాగానే ఎంగేజ్ చేస్తుంది. ఈ సినిమాతో పాటు టాప్-5లో ఏయే చిత్రాలు ఉన్నాయో ఓ లుక్కేయండి.

పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో మదరాసి ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగుతోంది. ఈ తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ ఓటీటీని షేక్ చేస్తోంది. శివ కార్తీకేయన్, రుక్మిణి వసంత్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు ఏఆర్ మురుగదాస్ డైరెక్టర్. బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా అక్టోబర్ 1న ఓటీటీ లో రిలీజైంది.

బాధలో ఉన్న అందరూ తన బంధువులే అనుకుని ఫీల్ అయ్యే మానసిక వ్యాధి హీరోకు ఉంటుంది. లవర్ వదిలేయడంతో చనిపోవాలనుకుంటాడు. కానీ అక్రమ ఆయుధాలను ధ్వంసం చేయడానికి ఎన్ఐఏ ఆపరేషన్ లో హీరోను భాగం చేస్తారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందన్నది మదరాసి మూవీ చూసి తెలుసుకోవాలి.

కూలీ, హౌస్‌ఫుల్ 5: ట్రెండింగ్‌లో మిగతా చిత్రాలు

రజనీకాంత్ బ్లాక్ బస్టర్ మూవీ కూలీ కూడా ప్రైమ్ వీడియోలో అదరగొడుతోంది. ఈ సినిమా ట్రెండింగ్ నంబర్ టూగా ఉంది. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వచ్చిన కూలీ సినిమాలో శ్రుతి హాసన్, నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్ తదితరులు నటించారు. తన ఫ్రెండ్ ను చంపిన విలన్ పై హీరో రివేంజ్ తీర్చుకోవడం చుట్టూ ఈ థ్రిల్లర్ సాగుతోంది.

బాలీవుడ్ కామెడీ మూవీ హౌస్ ఫుల్ 5 కూడా ఓటీటీలో సత్తాచాటుతోంది. అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేశ్ దేశ్ ముఖ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సోనమ్ బజ్వా, నర్గీస్ ఫక్రి, చిత్రాంగద సింగ్, సంజయ్ దత్, జాకీ ష్రాఫ్ తదితరులు నటించారు. ఇది ప్రైమ్ వీడియో ట్రెండింగ్ టాప్-3గా ఉంది.

ఘాటి, మాలిక్: ఈ వారం టాప్-5లో

అనుష్క లీడ్ రోల్ ప్లే చేసిన రివేంజ్ థ్రిల్లర్ ఘాటి. స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఇది ప్రైమ్ వీడియో ఓటీటీలో ట్రెండింగ్ నాలుగులో ఉంది. గంజాయి స్మగ్లింగ్ కోసం ఘాటిల జీవితాలను బలి తీసుకునే ముఠాకు వ్యతిరేకంగా జరిగే పోరాటమే ఇది. ఇందులో అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు.

అమెజాన్ ప్రైమ్ వీడియో ట్రెండింగ్ టాప్-5లో లాస్ట్ మూవీ మాలిక్. ఈ హిందీ యాక్షన్ థ్రిల్లర్ లో రాజ్ కుమార్ రావు హీరో. ఇందులో మానుషి చిల్లర్, సౌరభ్ శుక్లా, అన్షుమాన్ పుష్కర్ తదితరులు నటించారు. ఫుల్ వైలెన్స్ తో సాగుతుంది ఈ సినిమా.

ఓటీటీలో కొత్త సినిమాలతో పాటు హిట్ చిత్రాలు కూడా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ వారం ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న టాప్ 5 చిత్రాలను చూశారు కదా. మీరూ ఈ సినిమాలను చూసి ఎంజాయ్ చేయండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.